తెలంగాణలో నేడు (నవంబరు 3) అక్కడక్కడ భారీగా, రేపటి నుంచి వరుసగా 3 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం నెలకొన్న వాతావరణ పరిస్థితి గురించి అధికారులు వివరించారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ మొత్తం 109 ప్రాంతాల్లో వర్షాలు కురిసినట్లు వివరించారు. అత్యధికంగా జనగామ జిల్లా కోలుకొండలో 7.1 సెంటీమీటర్లు, జఫర్‌గఢ్‌లో 5.2 సెంటీమీటర్లు, పాలకుర్తిలో 4.3, వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో 3.2 సెంటీమీటర్లు, వనపర్తి జిల్లా పంగల్‌‌లో 3.2 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. మరోవైపు, వర్షాల వల్ల ఉష్ణోగ్రతలు కాస్త పెరిగినట్లు అధికారులు చెప్పారు. సాధారణంకన్నా 3 డిగ్రీల వరకూ అదనంగా పెరిగింది. ఆదిలాబాద్‌ జిల్లా అర్లిలో మంగళవారం తెల్లవారుజామున అత్యల్పంగా 13.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Continues below advertisement


బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో కొమరీన్‌ ప్రాంతంపై అల్పపీడనం ఉంది. దీని నుంచి తమిళనాడు తీరం వరకూ గాలులతో ఉపరితల ద్రోణి వ్యాపించింది. వీటి ప్రభావంతో తెలంగాణలో వాతావరణం ఇలా ఉండే అవకాశం ఉంది.


Also Read: హుజూరాబాద్ ఓటమిపై స్పందించిన మంత్రి కేటీఆర్... 20 ఏళ్లలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశామని ట్వీట్


తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు చాలా జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది.






ఏపీలో వాతావరణం ఇలా.. 
నేడు, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు చాలా ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.


Also Read: ఈటల రాజేందర్ ఆధిక్యం వెనుక ఎవరి ‘హస్తం’ ఉంది..? కౌంటింగ్ సరళి చెబుతోంది అదేనా ?


దక్షిణ కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి లేక రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, దక్షిణ కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. ఒకటి లేక రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి.


Also Read: బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు... టీఆర్ఎస్ ఓట్లు తగ్గలేదు... హుజూరాబాద్ ఫలితంపై మంత్రి హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు


రాయలసీమలో వచ్చే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి లేక రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.






ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి