హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ ఫ‌లితాల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌పై ఘన విజయం సాధించారు. టీఆర్‌ఎస్ ఓడిపోవడంతో మంత్రి హరీశ్ రావు స్పందించారు. ప్రజా తీర్పును శిర‌సావ‌హిస్తానని మంత్రి హరీశ్ అన్నారు. హుజూరాబాద్‌ ఉపఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ కు ఓట్లు వేసి ఓట‌ర్లంద‌రికీ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం క‌ష్టప‌డిన కార్యక‌ర్తల‌కు ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఎక్కడ‌లేని విధంగా హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌, బీజేపీలు కుమ్మక్కై పనిచేశాయన్నారు. బీజేపీకి కాంగ్రెస్ పరోక్ష మద్దతు తెలిపిందని ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలే చెప్తున్నారన్నారు. జాతీయ స్థాయిలో కొట్టుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్‌... తెలంగాణలో కుమ్మక్కు రాజకీయాలు చేయడాన్ని రాష్ట్ర ప్రజలు గ‌మ‌నిస్తున్నారన్నారు. 






Also Read: హుజూరాబాద్ ఓటమిపై స్పందించిన మంత్రి కేటీఆర్... 20 ఏళ్లలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశామని ట్వీట్


టీఆర్ఎస్ ఓట్లు తగ్గలేదు


 ఓట‌మితో కుంగిపోవడం, గెలిచిన‌నాడు పొంగిపోవడం టీఆర్ఎస్ చరిత్రలో లేదన్నారు హరీశ్ రావు. ఓడినా, గెలిచినా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం ప‌నిచేస్తుందన్నారు.  హజూరాబాద్ ప్రజా తీర్పును గౌరవిస్తామని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఒక్క ఓటమితో టీఆర్ఎస్ కుంగిపోదన్నారు. జాతీయ పార్టీలు కుమ్మక్కు అయినప్పటికీ టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేమీ తగ్గలేదన్నారు. ఉపఎన్నికలో స్ఫూర్తిదాయ పోరాటం చేసిన గెల్లు శ్రీనివాస్‌కు అభినందనలు తెలిపారు. 


Also Read: ఈటల రాజేందర్ ఆధిక్యం వెనుక ఎవరి ‘హస్తం’ ఉంది..? కౌంటింగ్ సరళి చెబుతోంది అదేనా ?


కాంగ్రెస్ అభ్యర్థిని బలి పశువు చేశారు : గెల్లు శ్రీనివాస్


హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఓటమి తర్వాత టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ స్పందించారు. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ కు ఓటేసిన ఓటర్లకు పాదాభివందనం చేస్తున్నట్టు తెలిపారు. ఉపఎన్నికలో తన కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో హుజూరాబాద్‌ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ నైతిక విజయం సాధించిందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ ఏకమయ్యాయన్నారు. ఈటల గెలుపు కోసం కాంగ్రెస్‌ అభ్యర్థిని బలి పశువును చేశారని గెల్లు శ్రీనివాస్ అన్నారు.  ఓడిపోతే కుంగిపోమే.. గెలిస్తే పొంగిపోమని ఆయన స్పష్టం చేశారు. 2023లో హుజూరాబాద్‌ గడ్డపై గులాబీ జెండా ఎగురుతుందని గెల్లు జోస్యం చెప్పారు. హుజూరాబాద్‌లో గెలిచిన ఈటల రాజేందర్ కు శుభాకాంక్షలు తెలిపారు. 


Also Read: గెలుపు బావుటా ఎగరేసిన ఈటల.. ఏడోసారి ఎమ్మెల్యేగా విజయం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి