AP Telangana Top Headlines Today: అంతుచిక్కని బాలినేని అంతరంగం, మాజీ మంత్రి వ్యవహారశైలి పార్టీకి తలనొప్పిగా మారుతోందా?
 మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి  (Balineni Srinivas Reddy) వ్యవహారశైలి వైసీపీ (YSRCP) అధిష్ఠానానికి తలనొప్పిగా మారిందా ? బాలినేని పార్టీతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారా ? లేదంటే పార్టీనే ఆయన సేవలు వద్దని భావిస్తోందా ? సొంత పార్టీనే ధిక్కరించేలా ఎందుకు మాట్లాడుతున్నారు ? ఇదే ఇప్పుడు ప్రకాశం (Prakasam) జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని నెలలుగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు, వ్యవహారశైలి ఎవరికి అంతుచిక్కడం లేదు. మంత్రివర్గం నుంచి తప్పించినప్పటి నుంచి గుర్రుగా ఉన్నారు. ఆ తర్వాత రీజినల్ కోఆర్డినేటర్ పదవిని ఆయన వదులుకున్నారు. పార్టీలోనే ఉంటూనే, పార్టీ నేతలపై విమర్శలు చేస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


 రెడ్‌బుక్ పేరుతో బెదిరిస్తున్నారు - అరెస్టు చేస్తామని ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ !
రెడ్ బుక్‌ పేరుతో సీఐడీ అధికరులను జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారని .. ఆయనను అరెస్టు చేసేందుకు అవకాశం ఇవ్వాలని  సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  41ఏ నోటీసులో ఉన్న నిబంధనలను నారా లోకేష్ ఉల్లంఘించారని సీఐడీ తెలిపింది.  చంద్రబాబు కేసు దర్యాప్తు అధికారులను రెడ్‌బుక్‌ పేరుతో లోకేష్ బెదిరిస్తు్న్నారని  సీఐడీ తెలిపింది.  దర్యాప్తు అధికారులను జైలుకి పంపిస్తామన్న లోకేష్‌ ప్రకటనలపై సీఐడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఆ 2 కారణాలతో పెరిగిన రేవంత్ ఇమేజ్ - కేసీఆర్‌ మిస్సయిన కనెక్షన్లను కొత్త సీఎం అందుకున్నారా ?
 తెలంగాణలో బీఆర్ఎస్ పాలనకు, కాంగ్రెస్ పాలనకు స్పష్టమైన తేడాను ప్రజలు చూస్తున్నారు. కళ్ల ఎదురుగా ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం కన్నా ప్రజల్ని అమితంగా ఆకర్షిస్తోంది ప్రభుత్వం అందుబాటులోకి రావడం.  కింది స్థాయి ప్రజల నుంచి ఎమ్మెల్యేల వరకూ అందరి అభిప్రాయం ఇదే. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతి  రోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాదర్బార్ ను ప్రకటించారు. అదీ కూడా ముఖ్యమంత్రి అధికారిక నివాసం అయిన ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేశారు. ప్రజాభవన్‌గా పేరు మార్చి.. ప్రజలకు యాక్సెస్ ఇచ్చారు. అక్కడికే ప్రభుత్వాన్ని తీసుకెళ్లారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


పబ్స్‌, రెస్టారెంట్లు, ఫామ్‌హౌస్‌ యజమానులకు హైదరాబాద్‌ సీపీ శ్రీనివాస్ రెడ్డి హెచ్చరిక
హైదరాబాద్ (Hyderabad) తెలంగాణకు గుండెకాయ లాంటిది. అలాంటి భాగ్యనగరంలో నేరాలు పెరిగినట్లు పోలీసులు రికార్డులు చెబుతున్నాయి. 2021, 2022 సంవత్సరాలతో పోలిస్తే నేరాలు తగ్గడం సంగతి అటుంచితే, పెరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. హైదరాబాద్ కమిషనరేట్ వార్షిక నేర నివేదికను నూతన సీపీ కొత్త శ్రీనివాసరెడ్డి (Kothakota Srinivas Reddy)  విడుదల చేశారు. నూతన సంవత్సర వేడుకలను అర్ధరాత్రి ఒంటి గంట లోపు ముగించాలని సూచించారు. నిబంధనలను అధిగమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


వైసీపీ ఎమ్మెల్యేలకు ఫోన్ కాల్ టెన్షన్ - సీఎం క్యాంప్ ఆఫీస్‌ను కాల్ వస్తే చాలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఫోన్ కాల్ భయం పట్టుకుంది.  ఏ క్షణాన తాడేపల్లి నుంచి పిలుపు వస్తుందో అని బెంబేలెత్తిపోతున్నారు. ఎమ్మెల్యేలు ఇతరత్రా మామూలు పనుల మీద తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసుకు వచ్చినా సరే.. వారి పని అయిపోయిందన్న ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్ తో భేటీ కావాల్సిన అవసరం కూడా లేదు.. తాడేపల్లికి ఒక ఎమ్మెల్యే వచ్చారంటే చాలు.. అప్పుడే, ఆయనకు టికెట్ ఇవ్వడం లేదని.. ప్రత్యామ్నాయం చూస్తున్నారని, ఆయనను వేరే నియోజకవర్గానికి షిఫ్ట్ చేయబోతున్నారని రకరకాల ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. పూర్తి వివరాలు