Lowest Personal Loan Interest Rates: ఒక వ్యక్తి క్రెడిట్‌ స్కోర్‌ (Credit score) తక్కువగా ఉంటే.. బ్యాంక్‌లు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs) అతనికి అప్పు ఇవ్వవు. ఇటీవలి కాలంలో, మన దేశంలో వ్యక్తిగత రుణాలు తీసుకునే వాళ్ల సంఖ్య భారీగా పెరిగింది. బ్యాంక్‌లు, NBFCలు కూడా గతంలోలా కఠినంగా వ్యవహరించకుండా అన్‌ సెక్యూర్డ్‌ లోన్స్‌ జారీ చేస్తున్నాయి. డాక్యుమెంటేషన్‌ ప్రక్రియను కూడా ఈజీగా మార్చాయి.


పర్సనల్ లోన్‌ తీసుకునే వ్యక్తి శాలరీడ్‌ పర్సన్‌ అయితే.. అతని ID ప్రూఫ్‌, మూడు నెలల పే స్లిప్, మూడేళ్ల ITR వంటివి సమర్పించాలి. ఉద్యోగి కాకపోతే.. అతని ఆదాయ రుజువు, వృత్తికి సంబంధించిన వివరాలు, బ్యాంక్ స్టేట్‌మెంట్, గత మూడేళ్ల ITR సమర్పించాలి.


పర్సనల్‌ లోన్‌ మీద బ్యాంక్‌లు, NBFCలు కొంత మొత్తాన్ని ప్రాసెసింగ్‌ ఫీజ్‌ ‍‌(Processing Fee) రూపంలో వసూలు చేస్తాయి. లోన్‌ ఇచ్చే సంస్థను బట్టి ప్రాసెసింగ్ ఫీజ్‌ 0.5% - 2.5% పరిధిలో ఉంటుంది. లోన్ కోసం అప్లై చేసుకున్నప్పుడు దీనిని చెల్లించాలి లేదా తీసుకున్న లోన్‌ మొత్తం నుంచి ఫీజ్‌ డబ్బును తగ్గించి ఇస్తారు.


పర్సనల్‌ లోన్‌ మీద ప్రముఖ బ్యాంక్‌లు. NBFCలు వసూలు చేస్తున్న వడ్డీ రేట్లు:        


1. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (Bank of Maharashtra Personal Loan Interest Rate Today)
పర్సనల్‌ లోన్‌ మీద ఏడాదికి వడ్డీ రేటు ----- 10.00% నుంచి


2. బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank of India Personal Loan Interest Rate Today)
పర్సనల్‌ లోన్‌ మీద ఏడాదికి వడ్డీ రేటు ----- 10.25% నుంచి


3. యాక్సిస్ బ్యాంక్ (Axis Bank Personal Loan Interest Rate Today)
పర్సనల్‌ లోన్‌ మీద ఏడాదికి వడ్డీ రేటు -----10.49% నుంచి


4. IDFC ఫస్ట్ బ్యాంక్ ( IDFC First Bank Personal Loan Interest Rate Today)
పర్సనల్‌ లోన్‌ మీద ఏడాదికి వడ్డీ రేటు -----10.49% నుంచి


5. HDFC బ్యాంక్ (HDFC Bank Personal Loan Interest Rate Today)
పర్సనల్‌ లోన్‌ మీద ఏడాదికి వడ్డీ రేటు -----10.50% నుంచి


6. ICICI బ్యాంక్ (ICICI Bank Personal Loan Interest Rate Today)
పర్సనల్‌ లోన్‌ మీద ఏడాదికి వడ్డీ రేటు -----10.50% నుంచి


7. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (State Bank Personal Loan Interest Rate Today)
పర్సనల్‌ లోన్‌ మీద ఏడాదికి వడ్డీ రేటు -----10.55% నుంచి


8. కోటక్ మహీంద్ర బ్యాంక్ (Kotak Mahindra Bank Personal Loan Interest Rate Today)
పర్సనల్‌ లోన్‌ మీద ఏడాదికి వడ్డీ రేటు -----10.99% నుంచి


9. టాటా క్యాపిటల్ (Tata Capital Personal Loan Interest Rate Today)
పర్సనల్‌ లోన్‌ మీద ఏడాదికి వడ్డీ రేటు -----10.99% నుంచి


10. బజాజ్ ఫిన్‌సర్వ్ (Bajaj Finserve Personal Loan Interest Rate Today)
పర్సనల్‌ లోన్‌ మీద ఏడాదికి వడ్డీ రేటు -----11.00% నుంచి


మరో ఆసక్తికర కథనం: వరుసగా 5 రోజులు బ్యాంక్‌లు బంద్‌, ఈ ఏడాదిలో మిగిలిన 9 రోజుల్లో 7 హాలిడేస్‌