Indian Student Missing in New Jersey:
నాలుగేళ్ల క్రితం అదృశ్యం..
అమెరికాలోని న్యూజెర్సీలో భారత్‌కి చెందిన ఓ యువతి అదృశ్యమైంది. నాలుగేళ్ల క్రితం కనిపించకుండా పోయిన ఈ యువతి కోసం ఇంకా అన్వేషిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే FBI కీలక ప్రకటన చేసింది. ఈ యువతి ఆచూకీ తెలిపిన వారికి 10 వేల డాలర్లు నజరానాగా ఇస్తామని వెల్లడించింది. 2019 ఆగస్టు 29వ తేదీన చివరిసారి జెర్సీ సిటీలోని తన అపార్ట్‌మెంట్ నుంచి బయటకు వస్తూ కనిపించింది (Mayushi Bhagat Missing) మయూషి భగత్. మే 1వ తేదీన ఆమె కుటుంబ సభ్యులు మిస్సింగ్ కంప్లెయింట్ ఇచ్చారు. ఆమె అదృశ్యమైనప్పటి నుంచి జాడ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. కానీ ఇప్పటికీ ఆచూకీ దొరకలేదు. గతేడాది జులైలో Missing Persons జాబితాలో భగత్ పేరుని చేర్చింది. అప్పటి నుంచి ప్రజల సహకారమూ అడుగుతోంది. ఎవరికి సమాచారం తెలిసినా తమకు చెప్పాలని కోరుతోంది. స్టూడెంట్ వీసాపై అమెరికా వెళ్లిన మయూషి న్యూయార్క్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతోంది. ఇంగ్లీష్, హిందీతో పాటు ఉర్దూ కూడా బాగా మాట్లాడుతుందని ఆమె స్నేహితులు పోలీసులకు వివరించారు. ఎవరికి ఎలాంటి సమాచారం తెలిసినా FBI Newark లేదా జెర్సీ పోలీసులకు తెలియజేయాలని FBI ఇప్పటికే ప్రకటించింది. 2016లో F1 స్టూడెంట్ వీసాపై అమెరికాకి వెళ్లింది మయూషి. మోస్ట్ వాంటెడ్, కిడ్నాపింగ్ లిస్ట్‌లోనూ భగత్ పేరుని చేర్చింది FBI.
యూకేలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి జీఎస్ భాటియా మృతి చెందాడు. ఈస్ట్ లండన్‌లోని ఓ సరస్సులో అతడి మృతదేహం కనిపించింది. డిసెంబర్ 14వ తేదీ రాత్రి నుంచి భాటియా కనిపించకుండా పోయాడు. అప్పటి నుంచి అతని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. చివరకు ఓ లేక్‌లో శవమై తేలాడు. దాదాపు వారం రోజులుగా భాటియా జాడ కోసం విచారణ కొనసాగిస్తున్నారు. చాలా చోట్ల CC కెమెరా ఫుటేజ్‌ని పరిశీలించారు. ఫోన్ డేటానీ సేకరించారు. ఈ సమాచారం ఆధారంగా ఓ సరస్సులో తనిఖీలు చేపట్టారు. అందులోనే భాటియా డెడ్‌బాడీ దొరికింది. ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. ఇప్పటి వరకూ ఇది అనుమానాస్పద మృతి అనడానిక ఆధారాలు ఏమీ దొరకలేదని వెల్లడించారు. అయినా అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపడుతున్నట్టు తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అయితే...భాటియాకి సంబంధించిన ఏ సమాచారం తెలిసినా వెంటనే తమకు తెలియజేయాలని కోరారు. ఇప్పటికే భాటియా మృతి పట్ల సోషల్ మీడియాలో పోస్ట్‌లు వెల్లువెత్తుతున్నాయి. ఖలిస్థాన్ వివాదం ఉద్ధృమవుతున్న సమయంలో భారత్‌కి చెందిన ఓ సిక్కు విద్యార్థి ఇలా అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోవడం అలజడి సృష్టిస్తోంది. భాటియా మిస్సింగ్ కేసుని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ దృష్టికి తీసుకెళ్లారు బీజేపీ నేత మన్‌జిందర్ సింగ్ సిర్సా. భాటియా మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Also Read: కూటమి ప్రధాని అభ్యర్థిగా ఖర్గే! నితీశ్ కుమార్ అలక - ఫోన్ చేసిన బుజ్జగించిన రాహుల్