Naga Panchami Telugu Serial Today Episode
మోక్ష: నాగమణితో చనిపోయిన మనిషిని బతికించొచ్చా పంచమి.
పంచమి: నాగమణికి చాలా శక్తులు ఉన్నాయని తెలుసు. కానీ కరాళి ద్వారానే బతికించొచ్చు అనే విషయం తెలుసుకున్నాను. కానీ ఆ నాగమణిని భూలోకంలోకి తీసుకురావడం ఎంత వరకు సాధ్యమో నాకు తెలీదు మోక్ష బాబు.
మోక్ష: అవన్నీ జరుగుతాయి అని నేను బతుకుతాను అనే ఆశ నాకు లేదు పంచమి. కానీ నేను కోరుకునేది ఒక్కటే. నువ్వు తల్లివి అయితే నువ్వు ఇక్కడే ఉండిపోతావు. అది మన చేతిలో ఉన్న అవకాశం.
పంచమి: అది చిట్టచివరి అవకాశం మోక్షబాబు. ఈ లోపు మిమల్ని బతికించుకోవడానికి నా ప్రయత్నాలు నన్ను చేయనివ్వండి.
మోక్ష: నువ్వు ఏమైనా చేయు పంచమి కానీ నాకు వేరే పెళ్లి చేద్దామని మా అమ్మ నిర్ణయించుకోవడానికి ముందే మన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి.
పంచమి: మీ సంతోషమే నా సంతోషం మోక్షబాబు. నా పోరాటం అంతా మీకు అకాల మరణం సంభవించకుండా ఆపడానికే. నా వల్ల కానీ నాగ జాతి వల్లకానీ మీకు ఎలాంటి హాని జరగకుండా నేను హామీ తీసుకోగలిగితే అంతటితో నా పని ముగిసిపోయినట్లే మోక్ష బాబు. అంత వరకు నాకు సమయం ఇవ్వండి. నన్ను నమ్మండి.
ఇక ఉదయం పంచమి కిచెన్‌లో పనులు చేస్తుండగా.. పాము శబ్దాలు వస్తాయి. దీంతో బయటకు వస్తుంది. అక్కడ ఫణేంద్ర పాముని చూస్తుంది.
పంచమి: ఎందుకు నన్ను వెంబడిస్తున్నావ్ యువరాజా. ముక్కోటి ఏకాదశి వరకు నా భర్తను కాటేయనని చెప్పావు కదా. నాకు ఇప్పుడు ఎవరి రక్షణ అవసరం లేదు. నాకు నాగలోకాని సంబంధం లేదు అని తేల్చి చెప్పేసింది నాగదేవత.
ఫణేంద్ర: అందుకని తొందర పడి శాశ్వతంగా భూలోకంలో ఉండే నిర్ణయం తీసుకోకు.
పంచమి: ఆ మాట స్వయానా నాగదేవతే చెప్పింది ఇక ఇక్కడ నా పాట్లు ఏవో నేను పడతాను.
ఫణేంద్ర: పౌర్ణమి నాడు పాముగా మారకుండా శాశ్వతంగా ఇక్కడే ఉండాలి అంటే తల్లి కావాల్సి వస్తుంది. కానీ నీతో కలిసిన పిమ్మటే మోక్ష చనిపోతాడు అని మాత్రం మర్చిపోకు.
పంచమి: ముక్కోటి ఏకాదశి రోజున నువ్వే మోక్షని కాటేసి.. చంపేస్తావ్ అంటున్నావ్.. మరణం తప్పదు అన్నప్పుడు మా ప్రయోజనాలు మేము చూసుకుంటాం. ఇక మీతో మాకు పనిలేదు.
ఫణేంద్ర: నువ్వు రాకపోతే ఇక నాగలోకానికి రాణి అనేవారే ఉండరు. నీకోసం నేను నాగదేవతని వేడుకొని ప్రసన్నం చేసుకుంటాను నువ్వు మాత్రం రావాల్సిందే.
పంచమి: అది మాత్రం జరగదు యువరాజా. నా భర్తను బలి కోరుకునే ఆ నాగలోకం నాకు అవసరం లేదు. నాకు నా భర్తే అవసరం. నా తల్లి పగకు నేనే పగతీర్చుకోవాలి అని నాగలోకం నిర్ణయించింది. అది న్యాయమా.. అన్యాయమా.. అని అడిగే హక్కు కూడా నాకు లేనప్పుడు నాకు ఆ లోకంతో ఏం పని. తప్పును మన్నించడం మానవ జాతి గొప్పతనం. ప్రస్తుతం నేను మానవ రూపంలో ఉన్నాను నా భర్తని చంపాలి అనుకునే నాగలోకం అంటేనే నాక అసహ్యం వేస్తుంది.
ఫణేంద్ర: ఇష్టరూప జాతి నుంచి మానవ రూపంలో నీ భర్తను కాపాడుకోవడం ఆసాధ్యం.
పంచమి: నాగకన్యగా మారితే కాపాడుకోగలను అంటే ఇప్పుడే మారిపోతాను యువరాజా. నేను మోక్షబాబుకి మరణం లేకుండా చూడాలి. ఎలా అయినా తనని కాపాడుకుంటానని మాటిచ్చాను.
ఫణేంద్ర: అలాంటి అవకాశమే లేదు యువరాణి. మోక్షని కాటేస్తే తప్ప నాగలోకం వచ్చి నాగకన్యగా మారలేవు. అది కాక ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. నాగదేవత ఒప్పుకోవాలి.
పంచమి: నాగదేవతను వేడుకుంటాను యువరాజా. నాగకన్యగా మారితే నేను నా భర్తను కాపాడుకోగలనేమో చెప్పండి.
ఫణేంద్ర: లాభం లేదు యువరాణి. ఇష్టరూప నాగుల కాటుకి చనిపోయిన వ్యక్తి బతకాలి అంటే ఒక్క నాగమణితోనే సాధ్యం. నువ్వు పాముగా మారి కాటేసిన తర్వాత విషం లాగేసే అవకాశం కూడా ఉండదు. శరీరంలోని అవయవాలను నాగమణితో తాకిస్తే ఆ విషం పూర్తిగా పోయి జీవం పోయగలదు.
పంచమి: నాగమణిని భూలోకంలోకి తీసుకొచ్చే అవకాశం ఉందా
ఫణేంద్ర: నాగమణిని ఒక్క నాగ వంసస్తుల తప్ప మరెవరూ తాకలేరు. నీకు ఆ అవకాశం ఉంది. కానీ నువ్వు నాగలోకం రావాలి అంటే తెలిసిందే కదా. ఒక మానవుడి ప్రాణం కోసం ఇంతలా ఆలోచించడం అనవసరం యువరాణి.
పంచమి: నాకు అవసరం యువరాజా. అందుకోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధమైనదాన్ని. ఆ నాగమణిని తీసుకురావడానికి ఏం చేయాలో చెప్పండి. ఈ సాయం చేస్తే నేను నువ్వు చెప్పినట్లు ఉంటాను.
ఫణేంద్ర: మొదట నువ్వు మోక్షని చంపడానికి సిద్ధపడాలి. ఈ లోకం వదిలేసి శాశ్వతంగా నాగలోకంలో యువరాణిలా ఉండిపోవడానికి అంగీకరించాలి అప్పుడు నేను నీకు సాయం చేయగలనో లేదో ఆలోచిస్తాను.
పంచమి: నేను అన్నింటికీ ఒప్పుకొని నాగలోకం వచ్చిన తర్వాత నాగమణి తీసుకురాలేకపోతే. వస్తాను యువరాజా మోక్ష బాబు కోసం నేను ఏం చేయడానికి అయినా సిద్ధమే.
ఫణేంద్ర: మళ్లీ నీ నిర్ణయంలో ఏ మార్పు రాకూడదు. నువ్వు నాగలోకానికి వచ్చిరాణి పీఠం అధిరోహిస్తున్నావు. ఈ మాట మీద కట్టుబడి ఉండాలి.
పంచమి: ఉంటాను యువరాజా. నాగమణి తెచ్చి మోక్షని కాపాడగలను అనే నమ్మకం నాకు ఏర్పడాలి.
ఫణేంద్ర: అది అంత సులభం కాదు కానీ మార్గం చెప్తాను. మొదట నువ్వు మోక్షని కాటేసి.. నాతో నాగలోకం రావాలి. కనీసం రెండు రోజులు అయినా మోక్ష భౌతికకాయాన్ని ఇక్కడే చెడిపోకుండా భద్రపరిచుండాలి. నాగలోకంలో నువ్వు రాణి పీఠం ఎక్కిన తర్వాత మూడో కంటికి తెలీకుండా నాగమణి తెచ్చి మోక్షని బతికించి తిరగి యథాస్థానంలో నాగమణిని నాగలోకంలో పెట్టాలి. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా మోక్ష తిరిగి బతకడం కష్టం అలాగే నాగమణి విషయం నాగదేవతకి తెలిస్తే మన ఇద్దరికీ మరణ శిక్ష పడుతుంది. మరో ముఖ్యమైన విషయం నాగలోకానికి శక్తిని ప్రసాదించేది నాగమణి. తిరిగి దాన్ని నాగలోకానికి చేర్చకపోతే నాగలోకమే అంతమైపోంతుంది. అప్పుడు నాగజాతికి అంతకన్నా ద్రోహం మరొకటి ఉండదు.
పంచమి: మోక్షబాబుని కాపాడుకోవాలి అంటే నాకు మరో మార్గం లేదు యువరాజా నేను దేనికైనా సిద్ధమే. నేను శాశ్వతంగా తనకు దూరం అవ్వడానికి మోక్ష ఒప్పుకోరు. నేను ఈ విషయాన్ని దాచిపెట్టాలి.
ఫణేంద్ర: ఇక మోక్ష శరీరాన్ని ఓ నాగకన్య జాగ్రత్త పరుస్తుంది. తను ఏదో ఒక రకంగా ఈ ఇంట్లో ఉండేలా నువ్వే చూడు. తర్వాత పనులు అన్నీ వేగంగా జరిగిపోతాయి.
ఇక పంచమి ఓ అబ్బాయితో మాట్లాడుతుందని చిత్ర జ్వాలాను అక్కడికి తీసుకొస్తుంది. వచ్చి చూసే సరికి అక్కడ ఎవరూ ఉండరు. పాము వెంటపడటంతో ఇద్దరూ పరుగులు తీస్తారు. ఇక పంచమి ఫణేంద్ర మాటలు తలచుకుంటుంది. ఇక మోక్ష వస్తాడు. పంచమి మోక్షకు ధైర్యం చెప్తుంది. తనకు ఓ దారి దొరికిందని చెప్తుంది. తాను చెప్పినట్లు చేస్తే ఇద్దరం ఒడ్డున పడతామని పంచమి అంటుంది. నాగలోకం నుంచి నాగమణి తీసుకొచ్చి మీ ప్రాణాలు కాపాడుతానని పంచమి చెప్తుంది. అది జరగదని మోక్ష నవ్వు కుంటాడు. ఇక ఫణేంద్ర గురించి పంచమి మోక్షకు చెప్తుంది. ఇక ఫణేంద్ర తనని నాగలోకం తీసుకెళ్తాడని పంచమి చెప్తుంది. మరి నువ్వు తిరగి రాకపోతే అని మోక్ష అడుగుతాడు. అందుకు మోక్ష ఒప్పుకోడు. తనకు బిడ్డే కావాలని అడుగుతాడు. దీంతో ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: రైతుబిడ్డ కోసం పాటబిడ్డ న్యాయపోరాటం - అందుకే అలా జరిగిందన్న భోలే