YCP Leaders Phone Call Fear :  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఫోన్ కాల్ భయం పట్టుకుంది.  ఏ క్షణాన తాడేపల్లి నుంచి పిలుపు వస్తుందో అని బెంబేలెత్తిపోతున్నారు. ఎమ్మెల్యేలు ఇతరత్రా మామూలు పనుల మీద తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసుకు వచ్చినా సరే.. వారి పని అయిపోయిందన్న ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్ తో భేటీ కావాల్సిన అవసరం కూడా లేదు.. తాడేపల్లికి ఒక ఎమ్మెల్యే వచ్చారంటే చాలు.. అప్పుడే, ఆయనకు టికెట్ ఇవ్వడం లేదని.. ప్రత్యామ్నాయం చూస్తున్నారని, ఆయనను వేరే నియోజకవర్గానికి షిఫ్ట్ చేయబోతున్నారని రకరకాల ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. ఇదీ ప్రస్తుతం ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.


గెలుపు కష్టం అనుకుంటే చాలు ఫోన్ కాల్    


ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికలకు   సిద్ధం అవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మొహమాటానికి పోయి టికెట్లు ఇచ్చేదే లేదని ఆల్రెడీ పార్టీ వారందరికీ తేల్చిచెప్పేశారు. తాను సొంతంగా చేయించు కుంటున్న సర్వేలు, ఐప్యాక్ సర్వేలు, ఇంటెలిజెన్స్ నివేదికలమీద ఆధారపడి మాత్రమే నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడం ఒక్కటే లక్ష్యంగా కనిపిస్తోంది. ఆ క్రమంలో గెలుపు ఇబ్బంది కరంగా ఉంటుందని అనుకుంటున్న ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరినీ తాడేపల్లికి పిలిపించి మాట్లాడుతున్నారు. సర్ది చెబుతున్నారు. టిక్కెట్లు ఇచ్చే నేతలకు అయితే ఎలాంటి పిలుపులు ఇవ్వడం లేదు. కానీ నియోజకవర్గం మార్చడం లేదా.. టిక్కెట్ నిరాకరిస్తున్న వారినే పిలుస్తున్నారు. 


తాడేపల్లిలో ఎమ్మెల్యేలు కనిపిస్తే చాలు నియోజకవర్గాల్లో పట్టించుకోని క్యాడర్               


మరోవైపు ఇతర ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యే ఎవరైనా విజయవాడకు, సచివాలయానికి, తాడేపల్లికి వస్తే చాలు.. వారి గురించి ప్రచారం మొదలైపోతోంది. ఇతర పనుల నిమిత్తం వచ్చామని, నియోజకవర్గ పనుల బిల్లుల కోసం వచ్చామని రకరకాలుగా సర్దిచెప్పు కోవాల్సి వస్తోంది. ఏం చెప్పుకున్నా.. ప్రచారం మాత్రం ఆగడం లేదు. ఎన్నికలు ఇంకా నాలుగు నెలల దూరం ఉండగానే.. ఎమ్మెల్యేలకు తమ తమ నియోజకవర్గాల మీద ఫోకస్ పూర్తిగా తగ్గిపోయింది. అస్సలు పట్టించుకోవడం లేదు. ఈ టికెట్ టెన్షన్లలో పార్టీ పెద్దల ప్రసన్నం కోసం ఎదురుచూడడమే సరిపోతోంది. కేడర్ కూడా సైలెంట్ అయిపోతోంది. 


ఎవరికి టిక్కెట్ ఇస్తారనుకుంటే వారి వైపు మారిపోతున్న క్యాడర్


ఇక కేడర్ కూడా మా ఎమ్మెల్యేకి టికెట్ రాదు కొత్త వారికి ఇస్తారు అని ఊహాగానాలు ఎక్కువైపోవడంతో వారు ముందుకెళ్లలేని పరిస్థితి అయిపోతుంది ఇవ్వగలం ముగింపు సభతో జనసంద్రోహరంగా మారిన ఆ సభ ఇప్పుడు వైసీపీ కేడర్లోను అటు ఎమ్మెల్యేలలో భయాందోళనకు గురవుతుంది. ఎమ్మెల్యే కి ఫోన్ వచ్చిందంటే పర్సనల్గా మాట్లాడుతున్నారు అంటే చాలు ఊహాగానాలకి వెళ్ళిపోతున్నారు. ఇక ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఫోన్ మోగితే వెయిటింగ్ వచ్చిన ఒరేయ్ మన ఎమ్మెల్యే పని అయిపోయిందిరా అంటూ పుకార్లు చేస్తున్నాయి దీంతో ఎమ్మెల్యే అని బయటికి రావాలన్నా సరే అడుగడుగునా భయానికి  గురవుతున్నారు     .