అన్వేషించండి

Breaking News Live Telugu Updates: పుంగనూరు, అంగళ్లు కేసుల్లో టీడీపీ నేతలకు బెయిల్

Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు.

Key Events
Andhra Pradesh Telangana Telugu Breaking News Live Updates 21 September 2023 Breaking News Live Telugu Updates: పుంగనూరు, అంగళ్లు కేసుల్లో టీడీపీ నేతలకు బెయిల్
ప్రతీకాత్మక చిత్రం

Background

ఏపీలో నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నా కూడా టీడీపీ ఉత్సాహంగానే ఉంటుంది. గత సమావేశాలకు చంద్రబాబు హాజరు కాకపోయినా టీడీపీ నేతలు అసెంబ్లీలో హడావిడి చేశారు, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూశారు. కానీ ఈసారి పరిస్థితి వేరు. చంద్రబాబు జైలులో ఉన్నారు, లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. మరి అసెంబ్లీలో టీడీపీని నడిపించేది ఎవరు..? బాలయ్య అంతా తానై చూసుకుంటారనే చర్చ టీడీపీ వర్గాల్లో నడుస్తోంది. 

చంద్రబాబు అరెస్ట్ తర్వాత బాలయ్య రెండు రోజులు లీడ్ రోల్ పోషించారు. మంగళగిరి పార్టీ ఆఫీస్ లో బావ కుర్చీలో కూర్చుని మరీ రివ్యూ మీటింగ్ లు పెట్టారు. చంద్రబాబు అరెస్ట్ బాధతో మరణించిన వారి కుటుంబాలను తాను పరామర్శిస్తానని హామీ ఇచ్చారు. వారికి తాను అండగా ఉంటానన్నారు. జైలులో పవన్ ములాఖత్ సమయంలో కూడా బాలకృష్ణ అన్నీ తానై చూసుకున్నారు. కానీ హఠాత్తుగా ఆయన సీన్ లోనుంచి మాయమయ్యారు. రెండు మూడు రోజులుగా భువనేశ్వరి, బ్రాహ్మణి నిరసనలను ముందుండి నడిపిస్తున్నారు. రాజమండ్రిలోనే మకాం వేసి పార్టీ శ్రేణులకు ధైర్యం చెబుతున్నారు. పరామర్శలకు వచ్చేవారిని వారే రిసీవ్ చేసుకుంటున్నారు. మరి అసెంబ్లీలో టీడీపీ తరపున పోరాటం చేసేది ఎవరు అనేది ఇప్పుడు అసలు ప్రశ్న. లోకేష్ మాజీ ఎమ్మెల్సీ కావడంతో అసెంబ్లీకి రాలేరు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉన్నా కూడా ఆయన అంత ధీమాగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టగలరా అనే అనుమానాలున్నాయి. ఇప్పుడు అందరి చూపూ బాలయ్యపైనే ఉంది. అసెంబ్లీలో దబిడ దిబిడ ఆయన వల్లే సాధ్యమంటున్నారు. 

నందమూరి అభిమానులు కోరుకుంటున్నదేంటి..?
చంద్రబాబు అరెస్ట్ తర్వాత, నారా-నందమూరి ఫ్యామిలీల మధ్య చిచ్చు పెట్టేందుకు చాలామంది చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ నుంచి ఆ రెండు కుటుంబాల మధ్య గొడవలు సృష్టించేందుకు కొంతమంది వ్యూహాలు పన్నారు. టీడీపీ అనుకూల మీడియా బాలయ్యకు తగిన ప్రాధాన్యత ఇవ్వడంలేదని, వైపీసీ అనుకూల మీడియాలో సింపతీ చూపించడం ఇక్కడ విశేషం. ఒకవేళ నిజంగానే బాలయ్యకు ప్రాధాన్యత వచ్చినా వారు తట్టుకోలేని పరిస్థితి. అయితే టీడీపీలో మాత్రం అలాంటి వ్యవహారాలేవీ లేవంటున్నారు నేతలు. నారా అయినా, నందమూరి అయినా టీడీపీ పటిష్టత కోరుకుంటున్నామని చెబుతున్నారు. బాలయ్య ప్రస్తుతానికి పార్టీని ముందుండి నడిపించినా, చంద్రబాబు వచ్చాక పార్టీపై పెత్తనం ఆయనకే ఉంటుందని, అందులో అనుమాన పడాల్సిన అవసరం లేదంటున్నారు. 

వాస్తవానికి బాలయ్య కూడా పార్టీపై పెత్తనం కోరుకోవడంలేదు. అక్కడ ఉన్నది సొంత బావ, సొంత అల్లుడు. అలాంటి ఉమ్మడి కుటుంబంలో చిచ్చురేపడం ఆయన అభిమతం కూడా కాదు. అయితే ఇప్పుడు ఆయన షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. నాలుగు రోజులుగా రాజమండ్రిలో కనపడ్డంలేదు, అటు పార్టీ ఆఫీస్ కి కూడా రావడంలేదు. రేపటినుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాలకు బాలయ్య కచ్చితంగా హాజరవుతారని అంటున్నారు ఆ పార్టీ నేతలు. ఎమ్మెల్యేలను ఆయనే ముందుండి నడిపిస్తారని చెబుతున్నారు. అదే నిజమైతే నందమూరి అభిమానుల ఆనందం మరింత రెట్టింపవుతుంది. కష్టకాలంలో బాలయ్య సేవలు టీడీపీకి ఉపయోగపడినట్టు కూడా ఉంటాయి. 

12:20 PM (IST)  •  21 Sep 2023

ఐదు రోజులు అసెంబ్లీ సమావేశాలు- శుక్రవారం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుపై చర్చ 

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఐదు రోజుల పాటు నిర్వహించాలని బీఏసీ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశాన్ని టీడీపీ బహిష్కరించింది.   

11:11 AM (IST)  •  21 Sep 2023

మీసాలు తిప్పడంపై బాలకృష్ణకు స్పీకర్ హెచ్చరిక- వస్తువులు విరగొట్టిన శ్రీధర్‌రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు


టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం సీరియస్ అయ్యారు. ముఖ్యంగా బాలకృష్ణ ప్రవర్తన అభ్యంతరంగా ఉందని స్పీకర్ అభిప్రాయపడ్డారు. ఆయన మీసాలు మెలేయడంతోపాటు తొడలు కొట్టారని అన్నారు. అయితే ఇవన్నీ ఆయన మొదటి తప్పుగా భావించి క్షమిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. 

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
ABP Desam Top 10, 22 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 22 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
India vs Sri Lanka Colombo Test Updates: కుల్దీప్ కు ఉద్వాసన తప్పదా...! బౌలింగ్ కూర్పుపై టీమ్ మేనేజ్మెంట్ కసరత్తు
కుల్దీప్ కు ఉద్వాసన తప్పదా...! బౌలింగ్ కూర్పుపై టీమ్ మేనేజ్మెంట్ కసరత్తు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మ్
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మ్
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
Romantic Drama OTT : రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!
లక్ష రూపాయల్లోనే యమహా స్పోర్టీ స్కూటర్‌.. 4 వేరియంట్లలో ఉన్న ఫీచర్లేంటి?
Embed widget