Revanth Reddy: కుతుబ్ షాహీ టూంబ్స్‌ను సందర్శించిన రేవంత్ - వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన సీఎం
హైదరాబాద్ లోని కుతుబ్‌షాహీ హెరిటేజ్‌ పార్క్‌లో అగాఖాన్‌ ట్రస్ట్‌ ఫర్‌ కల్చర్‌ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుతుబ్‌షాహీ టూంబ్స్‌ను రేవంత్‌, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీతో కలిసి పరిశీలించారు. ఆ ఆవరణలో రేవంత్ రెడ్డి అక్కడ మొక్క నాటారు. 2013లో కుతుబ్‌షాహీ వారసత్వ సంపద పరిరక్షణ ప్రాజెక్టును అగాఖాన్‌ ఫౌండేషన్‌ చేపట్టింది. తెలంగాణ సాంస్కృతిక శాఖతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


సిగ్గు సిగ్గు జగన్! ఇంత పిరికితనం, చేతకానితనమా - వైఎస్ షర్మిల సంచలనం
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీకి హాజరు కాకపోవడంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన సభకు హాజరు కాకపోవడం పిరికితనం, చేతగానితనం, అహంకారం వల్లే అని అన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తా అనడం జగన్ అజ్ఞానానికి నిదర్శనమని అన్నారు. అసెంబ్లీకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాలాకోరుతనం అని అన్నారు. ఎక్స్‌లో షర్మిల తన సోదరుడు జగన్ ను విమర్శిస్తూ సుదీర్ఘ పోస్టు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఆర్టీసీలో మహిళలకు ఫ్రీ ప్రయాణంపై కసరత్తు, రేపు చంద్రబాబుతో జరిగే మీటింగ్‌లో నిర్ణయం
ఎన్నికల హామీలు ఒకొక్కటీ అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం...మహిళలకు ఇచ్చిన మరో కీలక హామీ అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఆర్టీసీ(RTC) బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై ఇప్పటికే అధ్యయనం చేసిన అధికారులు...సోమవారం సీఎం చంద్రబాబు(Chandra Babu) నిర్వహించనున్నట్లు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఉచిత ప్రయాణం అమలు చేస్తే ప్రభుత్వం నెలకు అదనంగా 250 కోట్ల రూపాయల భారం పడనుంది.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


హిందువులు బిచ్చమెత్తుకోవాల్నా? భాగ్యలక్ష్మీ గుడిని గోల్డెన్ టెంపుల్‌గా మార్చుతాం - బండి సంజయ్
రంజాన్ పండుగకు రూ.33 కోట్లు కేటాయిస్తరు. తబ్లిగీ జామాతే సంస్థకు రూ.2.4 కోట్లు ఇస్తరు... బోనాల పండుగ సందర్భంగా పాతబస్తీలోని దేవాలయాలకు రూ.5 లక్షలిస్తరా?  హిందువులేమైనా బిచ్చగాళ్లనుకుంటున్నరా?...మీ దగ్గర బిచ్చమెత్తుకోవాల్నా?’’ అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి రాగానే గల్లీగల్లీలో అధికారికంగా బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ప్రకటించారు.   పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్టు, స్టేషన్ ముందు తండ్రి, వైసీపీ నేతల నిరసనలు - కాసేపటికి విడుదల
 వైఎస్ఆర్ సీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు తిరుపతిలోని ఎస్వీయూ పోలీస్ స్టేషన్ కు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని తరలించారు. దీంతో వైసీపీ నాయకులు కూడా అక్కడికి చేరుకున్నారు. గత ఏపీ ఎన్నికల పోలింగ్‌ తర్వాత రోజు అప్పటి టీడీపీ చంద్రగిరి అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి