RTC Free Service: ఎన్నికల హామీలు ఒకొక్కటీ అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం...మహిళలకు ఇచ్చిన మరో కీలక హామీ అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఆర్టీసీ(RTC) బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై ఇప్పటికే అధ్యయనం చేసిన అధికారులు...సోమవారం సీఎం చంద్రబాబు(Chandra Babu) నిర్వహించనున్నట్లు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఉచిత ప్రయాణం అమలు చేస్తే ప్రభుత్వం నెలకు అదనంగా 250 కోట్ల రూపాయల భారం పడనుంది.
మహిళలకు ఉచిత ప్రయాణం
ఏపీఎస్ ఆర్టీసీ(APS RTC) బస్సుల్లో మహిళల(Womens)కు ఉచిత ప్రయాణంపై సోమవారం కీలక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandra Babu) అధ్యక్షతన సోమవారం ఆర్టీసీ ఉన్నతాధికారులతో కీల సమీక్ష నిర్వహించనున్నారు. మహిళలకు ఉచిత బస్సు(Free Bus) ప్రయాణంపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ పథకం అమలు చేస్తున్న కర్ణాటక(Karnataka), తెలంగాణ(Telangana) రాష్ట్రాల్లో పర్యటించిన ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు...రాష్ట్రంలో అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల రాష్ట్రానికి అదనంగా నెలకు 250 కోట్ల రూపాయల భారం పడనుంది. రాష్ట్రంలో నిత్యం సగటున35 నుంచి 37 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 40 శాతం మంది మహిళలు ఉన్నారనుకున్న రోజుకు 15 లక్షల మంది మహిళలా ప్రయాణికులే ఉంటారు.
తెలంగాణ, కర్ణాటకలో ఇప్పటికే విజయవంతంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు.అక్కడ మహిళలకు జీరో టిక్కెట్‌లు(Zero Tickes) చేస్తున్నారు. అంటే టిమ్ మిషన్ నుంచి జారీ చేసే టిక్కెట్‌లో జీరో టికెట్ వచ్చినా...మెషిన్‌లో మాత్రం ఆ టిక్కెట్ ధర ఫీడ్ అవుతుంది. ఆ టిక్కెట్లన్నీ ప్రభుత్వాన్ని పంపించి ఆర్టీసీ(RTC) రియింబర్స్‌మెంట్ చేసుకుంటోంది. ఏపీలోనూ ఇదే విధానం అమలు చేయాలని భావిస్తున్నారు. అయితే గతంలో తెలంగాణ, కర్ణాటకలో మహిళల ఆక్యుపెన్సీ రేషియా 70 శాతం మాత్రమే ఉండగా...ఇప్పుడు 95శాతానికి పెరిగింది. ఏపీలోనూ ఇదే విధంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఆర్టీసీపై నెలకు 250 కోట్లు భారం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులకు ఇప్పుడు ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తున్నందునా....ఆర్టీసీకి వచ్చే రాబడిలో 25శాతం అంటే 125 కోట్ల రూపాయలను ప్రభుత్వం తీసుకుంటోంది. కాబట్టి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తే ఆ 125 కోట్లకు తోడు మరో 125 కోట్లు కలిపి నెలనెలా ప్రభుత్వమే ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంటుంది.
ఏయే బస్సుల్లో అమలు అంటే..?
తెలంగాణ(Telangana)లో అయితే ఆ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లినా మహిళలు ఉచితంగానే ప్రయాణిస్తున్నారు. కానీ ఏపీ(AP)లో ఉచిత ప్రయాణం ఎంత పరిధి వరకు అమలు చేయాలి, ఏయే సర్వీసుల్లో అమలు చేయాలన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. సీఎం(CM) వద్ద జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణలో పల్లెవెలుగు(Palle Velugu), అల్ట్రా పల్లెవెలుగు(Altra Pallevelugu), ఎక్స్‌ప్రెస్(Express)లు వరకు రాష్ట్రవ్యాప్తంగా రాయితీ ఇవ్వనున్నారు. హైదరాబాద్(Hyderabad)లో సిటీలో ఆర్డినరీతోపాటు మెట్రో ఎక్స్‌ప్రెస్‌లోనూ ఉచిత ప్రయాణమే అమలు అవుతోంది. కర్ణాటకలోనూ ఇదే విధానం కొనసాగుతుండగా...తమిళనాడు(Tamilanadu)లో మాత్రం చెన్నై, కోయంబత్తూరు నగరాల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నారు. ఏపీలోనూ పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో అమలు చేసే అవకాశం ఉంది. సిటీ బస్సుల విషయానికి వస్తే విజయవాడ(Vijayawada), విశాఖ(Visaka)లో మాత్రమే సిటీ బస్సులు తిరుగుతున్నాయి. ఈ రెండు నగరాల్లోనూ ఉచిత ప్రయాణం అమలు చేసే అవకాశం ఉంది.