New Governors To 10 States: కేంద్ర ప్రభుత్వం 10 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. ఈ మేరకు శనివారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఉత్తర్వులు జారీ చేశారు. ఏడుగురిని కొత్తగా నియమించగా.. ముగ్గురిని ఓ చోటి నుంచి మరో చోటుకు బదిలీ చేసింది. త్రిపుర మాజీ డిప్యూటీ సీఎం జిష్ణుదేవ్ శర్మ (66) (Jisnudev Varma) తెలంగాణ నూతన గవ్నరర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తోన్న సీపీ రాధాకృష్ణన్‌ను మహారాష్ట్ర గవర్నర్‌గా నియమించింది.
జిష్ణుదేవ్ శర్మ నేపథ్యం..
రాజ కుటుంబానికి చెందిన జిష్ణుదేవ్ వర్మ 1957, ఆగస్ట్ 15న జన్మించారు. 1990ల ప్రారంభంలో బీజేపీలో చేరారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 2018 - 23 మధ్య త్రిపుర రెండో ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. అయోధ్య రామ జన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగానూ సేవలందించారు.
9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..
- ఝార్ఖండ్ గవర్నర్‌గా పని చేస్తూ తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తోన్న సీపీ రాధాకృష్ణన్‌ను కేంద్రం మహారాష్ట్రకు బదిలీ చేసింది. ప్రస్తుతం ఇక్కడ గవర్నర్‌గా ఉన్న రమేష్ బైస్‌ను తప్పించింది.
- రాజస్థాన్ బీజేపీ సీనియర్ నేత ఓం ప్రకాశ్ మాథుర్‌ను సిక్కిం గవర్నర్‌గా నియమించింది. ప్రస్తుతం ఇక్కడ గవర్నర్‌గా ఉన్న లక్షణ్ ప్రసాద్ ఆచార్య అస్సాం గవర్నర్‌గా బదిలీ అయ్యారు. ఆయనకు మణిపూర్ గవర్నర్‌గా కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా, ప్రస్తుతం మణిపూర్ గవర్నర్‌గా ఉన్న అనసూయ ఉయికేను తప్పించింది.
- అలాగే, రాజస్థాన్ గవర్నర్‌గా మహారాష్ట్ర మాజీ స్పీకర్ హరిభావ్ కిషన్‌రావ్ బాగ్డే నియమితులయ్యారు. ఇక్కడ గవర్నర్‌గా ఉన్న సీనియర్ నేత కల్‌రాజ్ మిశ్రాను తప్పించారు.
- యూపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ఝార్ఖండ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈయన బరేలీ నుంచి వరుసగా 1989 నుంచి వరుసగా 2019 వరకూ (2009 - 2014 వరకూ మినహాయించి) గెలుపొందుతూ వచ్చారు.
- తెలంగాణ బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డిని త్రిపుర గవర్నర్‌గా నియమించింది.
- ఛత్తీస్‌గఢ్ ప్రస్తుత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పదవీ కాలం పూర్తి కాగా.. అస్సాం మాజీ ఎంపీ రమెన్ డేకాను ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమించింది.
- కర్ణాటక మాజీ మంత్రి సీహెచ్ విజయశంకర్ మేఘాలయ గవర్నర్‌గా నియమించింది. ఇక్కడ గవర్నర్‌గా ఉన్న ఫగు చౌహాన్‌ను తప్పించింది.
- అస్సాం గవర్నర్‌గా గులాబ్ చంద్ కటిరాయను పంజాబ్ గవర్నర్‌గా, కేంద్ర పాలిత ప్రాంతం చండీగడ్ అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. కాగా, ఇప్పటివరకూ ఈ బాధ్యతలు నిర్వహించిన పంజాబ్ గవర్నర్ బన్వారీలాల్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు.
- పుదుచ్చేరి లెఫ్ఠినెంట్ గవర్నర్‌గా కె.కైలాసనాథన్ నియమితులయ్యారు. ఈయన 1979వ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ప్రధాని మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన సీఎంలకూ ఆయన ప్రధాన ముఖ్య కార్యదర్శిగానూ వ్యవహరించారు. మొత్తం 11 సార్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈయన పదవీ కాలాన్ని పొడిగించగా.. ఈ ఏడాది జూన్ 30తో పదవీకాలం పూర్తైంది. తాజాగా, ఆయన్ను పుదుచ్చేరి గవర్నర్‌గా నియమించింది.
Also Read: Telangana Politics : బీఆర్ఎస్ఎల్పీ విలీనంలో రేవంత్ ఫెయిల్ - ఇక చేరికలు లేనట్లేనా ?