డబ్బులు కట్టి తెచ్చుకొనే పాస్‌ను తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే.. కట్టిన డబ్బులు వేస్ట్ అవుతాయి. దీంతో చాలామంది ఆ పాస్‌లో డబ్బుల పూర్తయ్యే వరకు అవసరలేని ప్రయాణాలు కూడా చేస్తుంటారు. మరి, ఉచితంగా బస్ పాస్ దొరికితే? అవసరమైనప్పుడే దాన్ని వాడుకుంటారు. లేదా పాస్ ఉంది కదా అనే ధైర్యంతో విహార యాత్రలు కూడా చేసేస్తారు. కుర్రకారుకు ఆ అవకాశం లభిస్తే.. రెక్కలు వచ్చినట్లే. అదే వృద్ధులైతే.. తీర్థయాత్రలకు బయల్దేరతారు. లేకపోత.. ఈ వయస్సులో బస్సులెక్కి ఏ ప్రయాణిస్తాంలే.. అనుకుంటూ ఇంట్లోనే కూర్చుంటారు. అయితే, ఈ బామ్మ మాత్రం ఆ టైపు కాదు. ఉచిత బస్సు పాస్‌ను ఎలా సద్వినియోగం చేసుకోవాలనేది ఈమె వద్దే నేర్చుకోవాలి. ఎందుకంటే.. ఈమె ఏకంగా 3,540 కిమీలు షికారు చేసింది.
యూకేకు చెందిన ఆ బామ్మ పేరు షెన్నీ ఇబ్బాట్. వయస్సు 75 ఏళ్లు. ఆమె వృద్దురాలు కావడంతో అక్కడి ప్రభుత్వం ఆమెకు ఉచిత పెన్షనర్ పాస్ సదుపాయం కల్పించింది. దీంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. దాన్ని ఎలాగైనా సరే వాడేసుకోవాలనే ఆలోచనతో కత్తిలాంటి ప్లాన్ వేసింది. బాల్యం నుంచి తాను ఇంగ్లాండ్‌లో చూడాలనుకున్న ప్రాంతాలను చుట్టేయాలని అనుకుంది. ఎటువంటి ఖర్చు లేకుండా తన కోరిక తీర్చుకోవాలని అనుకుంది.
Also Read: డామ్ ఇట్.. శృంగారానికి దూరమైతే ఇన్ని దారుణమైన సమస్యలా?
ప్రభుత్వం ఇచ్చిన ఉచిత బస్ పాస్‌తో ఆమె ఆరు వారాల ట్రిప్‌ను ప్లాన్ చేసుకుంది. ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లేందుకు వేర్వేరు బస్సులు మారేది. అలా రోజుకు ఎనిమిది గంటలు ప్రయాణాల్లోనే గడిపేది. దాదాపు 20 కిమీలు ఓపెన్-టాప్ బస్సులో కూడా ప్రయాణించింది. అలా ఆమె సుమారు 120 బస్సులను మారుతూ.. 3,540 కిమీలు తిరిగేసింది. అయితే, ఇంగ్లాండ్ దాడి వేరే దేశాల్లోకి ఎంటరైనప్పుడు మాత్రం ఆమె టికెట్లు కొనాల్సి వచ్చేది.
Also Read: ‘ఏక్ మినీ కథ’.. పాపం, ఎంతో ఖర్చుపెట్టి ‘అది’ పెంచుకున్నాడు, కానీ..
వాస్తవానికి ఈ యాత్రను ఆమె మార్చి 2020కి ప్లాన్ చేశారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఆమె దానిని వాయిదా వేసుకోవల్సి వచ్చింది. అయితే, ఈమె ఈ ప్రయాణాలు తన సంతోషం కోసమే చేసిందని అనుకోవడం పొరపాటే. వెస్ట్ సస్సెక్స్‌లోని సెయింట్ విల్ఫ్రిడ్ హాస్పిస్ అనే చారిటీ కోసం డబ్బును సేకరించడానికే ఆమె ఇంగ్లాండ్ ఈ ప్రయాణాలు చేసింది. 2016లో ఆమె భర్త ఓ వ్యాధితో మరణించాడు. అప్పటి నుంచి ఆమె ఆ చారిటీ సేవలు అందిస్తోంది.
తన ప్రయాణాలు గురించి షెన్నీ మాట్లాడుతూ.. ‘‘ప్రయాణాలైతే ధైర్యంగా చేశాను. కానీ, నిద్రపోవడానికి, ఆహారం తీసుకోడానికి కాస్త ఇబ్బంది ఉండేది. ఎవరైనా సాయం చేస్తే.. దాన్ని లాటరీగా భావించేందాన్ని. షెన్నీ తన ప్రయాణాన్ని సెప్టెంబరు 6న ప్రారంభించింది... అక్టోబరు 16న ముగించింది.
Also Read: ‘కిమ్’ కర్తవ్యం?.. ఉత్తర కొరియా నియంత భార్యకు ఇన్ని రూల్సా? పిల్లలను కనే విషయంలోనూ..
Also Read: సిగ్గు సిగ్గు.. స్టేజ్ మీదే అభిమాని ముఖంపై మూత్రం పోసిన లేడీ సింగర్
Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..
Also Read: ప్రియుడు మాట్లాడటం లేదని పోలీసులకు ప్రియురాలు ఫిర్యాదు.. పెళ్లి చేసి తిక్క
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి