స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా 'పుష్ప'. దీనికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇదివరకు వీరుముగ్గురు కలిసి పని చేసిన సినిమాలు ఆడియో పరంగా భారీ విజయాలను అనుకున్నాయి. అందుకే.. ఈ సినిమా పాటల విషయంలో ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలన్నీ కూడా ట్రెండింగా నిలిచాయి. ఇప్పుడు సినిమాలో ఐటెం సాంగ్ కి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది.
ఈ పాట ఎంతో స్పెషల్ గా ఉండాలని ప్లాన్ చేశారు. సమంతను రంగంలోకి దించారు. దీనికోసం ఆమెకి భారీ రెమ్యునరేషన్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. దేవిశ్రీప్రసాద్ ట్యూన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయని టాక్. ఈ ట్యూన్ కి తగ్గట్లుగా మాస్ స్టెప్స్ ని కంపోజ్ చేస్తున్నారట. ఈ ఒక్క పాట కోసం మొత్తం ఐదుగురు కొరియోగ్రాఫర్లు పని చేసినట్లు సమాచారం. ముందుగా జానీ మాస్టర్ ను కొరియోగ్రాఫర్ గా తీసుకున్నారు.
'రంగస్థలం'లో ఐటెం సాంగ్ కూడా ఆయనే కొరియోగ్రఫీ చేయడంతో సుకుమార్ మరోసారి పిలిచి అవకాశం ఇచ్చారు. కానీ జానీ మాస్టర్ తన బిజీ షెడ్యూల్స్ కారణంగా 'పుష్ప' ఐటెం సాంగ్ నుంచి తప్పుకున్నారు. దీంతో ఆయన స్థానంలోకి శేఖర్ మాస్టర్ ను తీసుకొచ్చారు. కానీ ఆయన కంపోజ్ చేసిన స్టెప్స్ బన్నీను తృప్తిపరచలేకపోయాయి. వెంటనే బాలీవుడ్ డాన్స్ మాస్టర్ గణేష్ ఆచార్యను రంగంలోకి దించారు. ఇప్పటికే 'పుష్ప'లో 'దాక్కో దాక్కో మేక' పాటకు గణేష్ కొరియోగ్రఫీ చేశారు.
ఐటెం సాంగ్ ను కూడా బన్నీ ఆయన చేతిలోనే పెట్టాడు. అంతేకాదు.. తన దగ్గర ఉన్న మరో ఇద్దరు కొరియోగ్రాఫర్స్ ని కూడా ఇన్వాల్వ్ చేయించాడట బన్నీ. వాళ్ల ఇన్ పుట్స్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పాట ఆడియన్స్ కు ఎప్పటికీ గుర్తుండిపోవాలనేది బన్నీ తపన. అందుకే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మరి ఈ సాంగ్ వెండితెరపై ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి!
Also Read: వెన్నుపోటు అంటేనే కళ్లల్లో నీళ్లొస్తున్నాయి... బాలకృష్ణ 'అన్ స్టాపబుల్' టాక్
Also Read: భీమ్... భీమ్... కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ కొత్త పోస్టర్ చూశారా?
Also Read: రామారావుగా థియేటర్లలోకి రవితేజ వచ్చేది ఎప్పుడంటే?
Also Read: నేను పెడుతున్న స్టోరీస్ చూసి 'ఎన్నారైలు అందర్నీ జనరలైజ్ చేయకే ల....' అని వాగక్కర్లేదు - చిన్మయి
Also Read: అమ్మాయిలను ఎప్పుడూ అలా చూడలేదా? ఇతర మహిళలకు లేనిది ఏమైనా నాకుందా? - పాయల్ బోల్డ్ రియాక్షన్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి