Healthy Habits to Reduce Heart Disease Risk : వయసుతో సంబంధం లేకుండా గుండె సమస్యలు అందరినీ ఇబ్బంది పెడుతున్నాయి. ఏ రీజన్ వల్ల.. ఎప్పుడు గుండె ట్రిగ్గర్ అవుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. కానీ కొన్ని రెగ్యూలర్ టిప్స్‌ను ఫాలో అయితే గుండె సమస్యలను కంట్రోల్ చేయవచ్చంటున్నారు నిపుణులు. మగవారైనా.. ఆడవారైనా ఈ సింపుల్ టిప్స్‌ను ఫాలో అవ్వాలని సూచిస్తున్నారు. ఇంతకీ జీవన శైలిలో ఎలాంటి మార్పులు చేయాలి? ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బ్యాలెన్స్డ్ డైట్..
శారీరకంగా, మానసికంగా హెల్తీగా ఉండాలంటే లైఫ్ స్టైల్లో ముందుగా చేయాల్సిన మార్పు ఫుడ్దే. మనం తీసుకునే ఆహారం మన జీవితంలో అతిపెద్ద రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఈ ఒక్క విషయంలో చేసే మార్పులు పూర్తి ఆరోగ్యంపై మంచి ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యంగా ఉండేందుకు సమతుల్యమైన ఆహారం తీసుకోవాలంటున్నారు నిపుణులు. పండ్లు, కూరగాయలు, మల్టీ గ్రైయిన్స్, లీన్ ప్రోటీన్స్ డైట్లో ఉండేలా చూసుకోవాలని చెప్తున్నారు. అలాగే ప్రాసెస్ చేసిన ఫుడ్స్, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు, స్వీట్స్‌ని డైట్లో నుంచి తీసేస్తే చాలా మంచిదని సూచిస్తున్నారు.
కొలెస్ట్రాల్..
శరీరంలో కొలెస్ట్రాల్ ఉంటే గుండె సమస్యలు కొని తెచ్చుకున్నట్టే. అందుకే కొలెస్ట్రాల్‌ని కంట్రోల్లో ఉంచుకోవాలంటున్నారు నిపుణులు. ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటే అది గుండెను బ్లాక్ చేసి.. శరీరంలోని వివిధ భాగాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. దీనిని తగ్గించుకునేందుకు రెగ్యూలర్‌గా వ్యాయామం చేయడంతో పాటు.. ఫ్యాచురేటడ్ డైట్ ఫాలో అవ్వాలి. ఇవి కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసి గుండెను హెల్తీగా ఉంచుతాయి.
వ్యాయామం..
రోజూ కనీసం అరగంటైనా వ్యాయామం చేయాలి. లేదంటే ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. కార్డియో చేస్తే మరీ మంచిది. సైకిల్, వాకింగ్, స్విమ్మింగ్, రన్నింగ్ చేస్తూ ఉంటే గుండెకు మెరుగైన రక్తప్రసరణ అందుతుంది. దీనివల్ల గుండె సమస్యలు దూరమవుతాయి. వీటితో కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్లో ఉంటుంది.
స్మోకింగ్ అలవాటు ఉందా?
స్మోకింగ్ అలవాటు ఉండేవారికి క్యాన్సర్‌తో పాటు.. గుండె సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. పొగాకు ఉపయోగించేవారిలో గుండె సమస్యలు ఎక్కువగా ఉంటాయని పలు అధ్యయనాలు ఇప్పటికే తేల్చాయి. కాబట్టి వీలైనంత త్వరగా స్మోకింగ్ మానేస్తే మంచిది. దీనివల్ల హార్ట్ ఎటాక్, గుండె సంబంధిత సమస్యలు దూరమవుతాయి.
మందు తగ్గించాలట..
మద్యం ఎక్కువగా తాగే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త మీరు దానిని వీలైనంత త్వరగా మానేయండి. లేదంటే దానిని కంట్రోల్ చేయండి. లేదంటే మద్యం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇది గుండె సమస్యలను రెట్టింపు చేస్తుంది. కాబట్టి వీలైనంత త్వరగా దీనిని మానేయాలంటున్నారు. మహిళలు వారానికో పెగ్.. పురుషులు రెండు పెగ్స్ తీసుకోవచ్చట. అంతకుమించి మాత్రం వద్దని చెప్తున్నారు.
ఒత్తిడి ఉంటే..
ఒత్తిడి ఎక్కువ ఉంటే గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. ఎందుకంటే ఒత్తిడి వల్ల రక్తపోటు ఎక్కువై హార్ట్ సమస్యలు వస్తాయట. ఒత్తిడితో హార్ట్ ఎటాక్ వచ్చి ఎందరో ప్రాణాలు కూడా వదిలేస్తున్నారు. అందుకే ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలు ఫాలో అవ్వాలంటున్నారు. డీప్ బ్రీతింగ్, యోగా, మెడిటేషన్ రెగ్యూలర్‌గా చేస్తే ఒత్తిడి దూరమవుతుందట.
బరువు తగ్గాల్సిందే..
అధిక బరువు వివిధ ఆరోగ్య సమస్యలను తీసుకువస్తుంది. అందుకే బరువును తగ్గించుకోవాలి. ముఖ్యంగా బరువు ఎక్కువగా ఉంటే గుండె ఆరోగ్యానికే ప్రమాదం. హెల్తీ డైట్, రెగ్యూలర్ వ్యాయామం.. నిద్రను ఫాలో అయితే బరువును కంట్రోల్ చేసుకోవచ్చు. నిపుణుల సలహాలు ఫాలో అవుతూ బరువును తగ్గించుకోవాలంటున్నారు.
నిద్ర సమస్యలు
రోజూ 8 గంటలు కనీసం 7 గంటలు నిద్ర ఉండాలి. రాత్రి నిద్ర ఎంత బాగా ఉంటే.. గుండె సమస్యలు అంత దూరమవుతాయి. ఎంత తక్కువ ఉంటే గుండె సమస్యలు అంత తీవ్రమవుతాయి. పైగా నిద్ర అనేది ఇప్పటివరకున్న అన్ని అంశాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేస్తుంది. అందుకే నిద్రను అస్సలు విస్మరించవద్దని చెప్తున్నారు నిపుణులు.
ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే టిప్సే. నీటిని తాగుతూ.. హైడ్రేటెడ్‌గా ఉండాలి. మధుమేహం, రక్తపోటు సమస్యలు ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. సమయానికి మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటే గుండె హెల్తీగా ఉంటుందంటున్నారు నిపుణులు. మీ లైఫ్‌లో ఈ మార్పులు చేసి చూడండి. కచ్చితంగా మీ పూర్తి ఆరోగ్యం మెరుగుపడుతుంది.