ఫుడ్ వ్లాగింగ్ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. ఆ వ్లాగర్ల వల్లే ఎన్నో కొత్త వంటకాలు తెలుస్తున్నాయి. అలాగే మంచి వంటగాళ్లు కూడా ప్రపంచానికి పరిచయం అవుతున్నారు. తాజాగా ‘నాన్ వెజ్ ఫుడీ’ అనే ఫుడ్ వ్లాగర్ జైపూర్లోని శైలేష్ అనే చాలా టాలెంటెడ్ షెఫ్ గురించి అందరికీ తెలిసేలా చేశారు. ఇతని గొప్పతనం ఏంటంటే... గరిటె లేకుండానే వంటలు చేసేస్తాడు. వేడివేడి నూనెలో చేయి పెట్టి వండేస్తాడు. సలసల కాగుతున్న నూనెలో చికెన్ లెగ్ ఫ్రై ను చేత్తోనే వేయించి తీసేస్తాడు. ఇదంతా వీడియో తీసి ఇన్ స్టాలో పోస్టు చేశారు నాన్‌వెజ్ ఫుడీ వ్లాగర్. ఈ వీడియో ఇప్పుడు ఇన్ స్టాలో ట్రెండవుతోంది. నూనె చుక్క పడితేనే బొబ్బలెక్కిపోతుంది చర్మం. అలాంటిది ఏకంగా సలసల కాగుతున్న నూనెలో చేయిపెట్టి చికెన్ పీస్ లను తీసి పక్కన పెడుతున్నా అతనికీ ఏమీ కాకపోవడం చాలా వింతగా ఉంది.
ఇప్పటికే ఈ వీడియోకు అరవై వేల మంది లైకులు చేశారు. ఎన్నో షేర్లు అయ్యాయి. జైపూర్లోని రోడ్డుపక్కన ‘అలీ చికెన్ సెంటర్’లో పనిచేస్తున్నాడు శైలేష్. అక్కడ తినడానికి చుట్టుపక్కల నుంచి చాలా మంది ఆహారప్రియులు అక్కడికి వస్తారు. వారందరికీ అప్పటికప్పుడు చికెన్ లెగ్ పీస్ వేయించి, ఉత్త చేత్తోనే నూనెలోంచి తీసి అందిస్తాడు శైలేష్. ఈ వీడియో చూసిన వారికి ‘అతనికి చేతులు కాలవా?’ అనే సందేహం వస్తోంది. శైలేష్ మాత్రం తనకి ఈ పని అలవాటేనని తన చేతులకు ఏమీ కాదని చెబుతున్నాడు. ఇప్పుడతని వీడియో వైరల్ గా మారింది.
Also read: కాకరకాయను వీళ్లు తినకూడదు... తింటే సమస్యలు తప్పవు
Also read: సముద్రపు చేపలే ఆరోగ్యానికి మంచివంటున్న అధ్యయనాలు... తింటే ఎన్ని లాభాలో
Also read: పాదాలకు వెండి పట్టీలే ఎందుకు ధరించాలి? బంగారపువి ఎందుకు ధరించకూడదు?
Also read: పిల్లలకు రోజుకో ఉడికించిన గుడ్డు తినిపించండి... ఆరోగ్యానికి ఢోకా ఉండదు
Also read: మనసు స్థిరంగా లేదా, ఆందోళనగా అనిపిస్తోందా... వీటిని తినండి