ఓ చేదు తీగజాతి మొక్క కాకర. పట్టణాల్లోనూ, పల్లెల్లోనూ కూడా కాకరకాయలు కాసేస్తాయి. ఇవి కాస్త చేదుగా ఉన్నా కూడా వేయించినా, బెల్లం వేసి పులుసు పెట్టినా చాలా రుచిగా ఉంటాయి. కాకరను బాగా ఇష్టంగా తినేది మధుమేహ వ్యాధిగ్రస్తులు మాత్రమే. వైద్యులు కూడా కాకర తింటే చాలా మంచిదని చెబుతారు. కాకరరసం తాగమని ప్రోత్సహిస్తారు. అధిక బరువు సమస్య ఉన్నవారు తప్పకుండా తినాల్సిన కూరగాయ ఇది. అయితే కాకరకాయని కొంతమంది మాత్రం తినకూడదు. వీళ్లు తింటే కొన్ని సమస్యలు రావచ్చు. కాకరకాయలు ఎవరు? ఏ సమయాల్లో తినకూడదంటే...


1. గర్భిణులు కాకరకాయలను తినకూడదు. వాటిలో మెమోకరిన్ అనే సమ్మేళనం ఉంటుంది. దీనివల్ల అబార్షన్ అయ్యే అవకాశం ఉంది. అయిదు నెలల లోపు గర్భిణిలు కాకరకాయలను తినకూడదు. వీటివల్ల డయేరియా, వాంతులు, కడుపునొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది. ఎన్నో అధ్యయనాలు ఈ విషయాన్ని నిజమని తేల్చాయి. 
2. అలాగే పిల్లలు పుట్టేందుకు ప్రయత్నిస్తున్న వారు, దాని కోసం మందులు వాడుతున్న దంపతులు కూడా కాకరకాయకు దూరంగా ఉండడం మంచిది. లేకుంటే ఆ మందులు సమర్థవంతంగా పనిచేయకపోవచ్చు. 
3. మహిళలు కూడా రుతుస్రావం సమయంలో ఈ కూరగాయకు దూరంగా ఉండాలి. లేకుండా అధికంగా రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. 
4. ఆపరేషన్లు చేయించుకున్న వారు కూడా కాకరకాయకు దూరంగా ఉంటే మంచిది. సర్జరీ జరిగిన రెండు వారాల తరువాత మళ్లీ కాకరకాయ తినడం ప్రారంభించవచ్చు. అలాగే సర్జరీకి రెండు వారాల ముందు నుంచే దీన్ని తినడం మానేయాలి. 
5. రక్తంలో చక్కెర స్థాయులు తక్కువగా ఉన్నవారు కూడా కాకరకాయకు దూరంగా ఉంటే మంచిది. 
6. కాలేయ సమస్యల బాధపడుతున్నవారు కూడా ఈ కూరగాయకు దూరంగా ఉండడం మంచిది. లేకుండా కాలేయం వద్ద ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. 



ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.


Also read: సముద్రపు చేపలే ఆరోగ్యానికి మంచివంటున్న అధ్యయనాలు... తింటే ఎన్ని లాభాలో
Also read: పాదాలకు వెండి పట్టీలే ఎందుకు ధరించాలి? బంగారపువి ఎందుకు ధరించకూడదు?
Also read: పిల్లలకు రోజుకో ఉడికించిన గుడ్డు తినిపించండి... ఆరోగ్యానికి ఢోకా ఉండదు
Also read: మనసు స్థిరంగా లేదా, ఆందోళనగా అనిపిస్తోందా... వీటిని తినండి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండ