Soups to Burn Belly Fat : డైట్ చేసినా.. జిమ్ చేసినా.. కొందరు బరువు తగ్గుతారు కానీ.. పొట్ట మాత్రం తగ్గించలేరు. మీరు కూడా పొట్టను తగ్గించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారా? అయితే మీరు ఈ సూప్స్ ట్రై చేయండి. ఇంట్లో దొరికే రెగ్యులర్​ పదార్థాలతో ఈజీగా చేసుకోవచ్చు. వీటిని ఎలా చేసుకోవాలి.. అవి బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో ఎలా హెల్ప్ చేస్తాయో చూసేద్దాం.

Continues below advertisement

సూప్ ఎందుకు బెల్లీ ఫ్యాట్ తగ్గిస్తుంది?

సూప్ తాగడం వల్ల పొట్ట త్వరగా నిండిపోతుంది. దీంతో ఎక్కువ తినే అలవాటు తగ్గుతుంది. వేడి వేడి సూప్ మెటబాలిజం పెంచుతుంది. కూరగాయలు, మసాలాలు కలిసి శరీరంలో కొవ్వు కరగడాన్ని వేగవంతం చేస్తాయి. రాత్రి భోజనానికి బదులు సూప్ తాగడం మంచి అలవాటు అని నిపుణులు చెప్తున్నారు. మరి ఏ సూప్స్ బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి హెల్ప్ చేస్తాయో.. వాటి రెసిపీలు ఏంటో తెలుసుకుందాం. 

పసుపు అల్లం సూప్

చిన్న అల్లం ముక్క, అరటీస్పూన్ పసుపు, మిరియాలు 5 లేదా 6 నిమ్మకాయ రసం, రుచికి తగినంత ఉప్పు రెండు గ్లాసుల నీళ్లతో ఈ సూప్ తయారు చేసుకోవచ్చు. ముందుగా నీళ్లు మరిగించి అల్లం తురుము, పసుపు, నల్ల మిరియాల పొడి వేసి 5 నిమిషాలు మరగనివ్వాలి. దించిన తర్వాత నిమ్మకాయ రసం పిండి తాగాలి.

Continues below advertisement

అల్లంలోని జింజరాల్, పసుపులో కర్కుమిన్ కొవ్వు కరగడాన్ని వేగవంతం చేస్తాయి. నల్ల మిరియాలు మెటబాలిజం ఫ్యాట్ బర్న్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. 

టమాటో సూప్

4 పండిన టమాటాలు, 4 వెల్లుల్లి రెబ్బలు, అర టీస్పూన్ జీలకర్ర, చిన్న అల్లం ముక్క, కొద్దిగా కొత్తిమీర, బ్లాక్ పెప్పర్ అర టీస్పూన్, రుచికి తగినంత ఉప్పుతో టమాటో సూప్ చేసుకోవచ్చు. ముందుగా నీళ్లలో టమాటాలు, వెల్లుల్లి, అల్లం కలిపి మరిగించాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వడకట్టాలి. దానిని వేడి చేసి జీలకర్ర, నల్ల మిరియాల పొడి, ఉప్పు వేసి పైన కొత్తిమీర చల్లుకుని తాగాలి. 

టమాటాలోని లైకోపిన్ పొట్ట చుట్టూ ఉండే విసెరల్ ఫ్యాట్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లి మెటబాలిజమ్ బూస్టర్. దీనిని రాత్రుళ్లు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. 

పాలకూర పెసరపప్పు సూప్ 

నిండిన ఈ సూప్ చేయడం కోసం ఒక కట్ట పాలకూర, అరకప్పు పెసర పప్పు, 3 రెబ్బలు వెల్లుల్లి, అర టీస్పూన్ జీలకర్ర, బ్లాక్ పెప్పర్ అర టీస్పూన్, కొద్దిగా నిమ్మకాయ రసం, రుచికి తగినంత ఉప్పువేసి చేసుకోవచ్చు. ముందుగా పెసర పప్పు ఉడికించాలి. 

పాలకూర, వెల్లుల్లి కలిపి చేసుకోవాలి. రెండూ కలిపి మిక్సీలో వేసి సూప్ కన్సిస్టెన్సీకి తీసుకురావాలి. జీలకర్ర, మిరియాల పొడి, నిమ్మకాయ రసం వేసి సర్వ్ చేయాలి. పాలకూరలో ఫైబర్ పొట్ట నిండినట్టు అనిపిస్తుంది. పెసర పప్పు ప్రొటీన్ కండరాలు కాపాడుతూ ఫ్యాట్ తగ్గిస్తుంది.

క్యారెట్ కొత్తిమీర సూప్ 

ఈజీగా చేసుకోగలిగే సూప్స్​లలో క్యారెట్ కొత్తిమీర సూప్ ఒకటి. 3 క్యారెట్లు, ఒక కట్ట కొత్తిమీర, 1 ఉల్లిపాయ, 3 వెల్లుల్లి రెబ్బలు, చిన్న ముక్క అల్లం, బ్లాక్ పెప్పర్ అర టీస్పూన్, ఉప్పు రుచికి తగినంత తీసుకోవాలి. 

క్యారెట్లు, ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం కలిపి ఉడికించాలి. చల్లారిన తర్వాత కొత్తిమీరతో కలిపి బ్లెండ్ చేయాలి. వేడి చేసి మిరియాల పొడి, ఉప్పు వేసి తాగాలి. క్యారెట్‌లో బీటా కెరోటిన్, ఫైబర్ కొవ్వు అరికట్టడంలో సహాయపడుతుంది. కొత్తిమీర శరీరం నుంచి టాక్సిన్స్ బయటకు పంపుతుంది.

వెల్లుల్లి మిరియాల సూప్ 

10 వెల్లుల్లి రెబ్బలు, 10 నల్ల మిరియాలు, అర టీస్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, నిమ్మరసం, ఉప్పు, నీళ్లతో సూప్ చేసుకోవచ్చు. వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర కలిపి మరిగించాలి. వడకట్టి నిమ్మకాయ రసం, కరివేపాకు వేసి వేడిగా తాగాలి.

వెల్లుల్లిలోని అల్లిసిన్ అనే సమ్మేళనం బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో అత్యంత ప్రభావవంతం. మిరియాలు థర్మోజెనిక్ ఎఫెక్ట్ వల్ల కొవ్వు కాలుస్తాయి.

ఈ సూప్స్ మీరు బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి ట్రై చేయాలనుకుంటే.. రాత్రి 7 గంటలకు ముందే తాగడం బెస్ట్. నూనె, నెయ్యి వేయకుండా చేస్తేనే ఫ్యాట్ బర్నింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. రోజూ కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగండి. సూప్‌తో పాటు రోజూ 30 నిమిషాలు నడిస్తే ఫలితాలు వేగంగా కనిపిస్తాయి.

మరిన్ని టేస్టీ రెసిపీల కోసం దీనిని క్లిక్ చేయండి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.