Health Benefits with Curry Leaves : ప్రతి ఇంట్లో కరివేపాకు లేని వంటలు ఉండవనే చెప్పాలి. కూరలో కరివేపాకు అని తీసిపారేస్తారు కానీ.. కచ్చితంగా కూరలో దానిని వేస్తారు. ఎందుకంటే దానిసారం కర్రీలో ఉంటుంది.. మంచి ఫ్లేవర్‌ని ఇస్తుంది కాబట్టి. అలాగే దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా దీనిని జుట్టు పోషణ, పెరుగుదలకోసం ఎక్కువమంది తీసుకుంటారు. కానీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించడంలో కరివేపాకు ముందు ఉంటుంది.
కరివేపాకులోని పోషకాలివే
కరివేపాకులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఐరన్, కాల్షియం, ఫాస్పరస్ వంటి కనిజాలతో పాటు విటమిన్ ఎ, బి, సి, ఇ సమృద్ధిగా ఉంటాయి. ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, కార్బజోల్ ఆల్కలాయిడ్స్ వంటి బయోయాక్టివ్ కాంపౌండ్లతో నిండి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. అందుకే దీనిని ఉదయాన్నే తీసుకుంటే మంచిదంటున్నారు. ఇంతకీ దీనిని పరగడుపున తింటే కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
జీర్ణ సమస్యలు దూరం
కరివేపాకు జీర్ణసమస్యలను తగ్గించి.. గట్ హెల్త్‌ని ప్రమోట్ చేస్తుంది. వీటిలోని ఎంజైమ్స్ కడుపులో మిగిలిన ఉన్న ఆహారాన్ని త్వరగా జీర్ణమయ్యేలా చేస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా కరివేపాకులోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలను తగ్గిస్తాయి.
ఇమ్యూనిటీ, స్కిన్ హెల్త్
రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీరాడికల్స్ నుంచి కాపాడి ఇమ్యూనిటీని మెరుగుపరుస్తాయి. ఆక్సిడెటివ్ స్ట్రెస్, కడుపులో మంట, ఇన్ఫ్లమేషన్ను తగ్గేలా చేస్తాయి. ఆర్థ్రరైటిస్ సమస్యలను యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు దూరం చేస్తాయి. స్కిన్ ఇరిటేషన్ను తగ్గించి.. పింపుల్స్ సమస్యను దూరం చేస్తాయి. స్కిన్ హెల్త్‌ని ప్రమోట్ చేస్తాయి.
గుండె ఆరోగ్యానికై..
కరివేపాకును పరగడుపునే తీసుకుంటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. దీనివల్ల గుండె జబ్బులు దూరమవుతాయి. అలాగే రక్తంలోని షుగర్ కంట్రోల్ అవుతుంది. కరివేపాకులోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు బ్లడ్‌లోని షుగర్‌ని పెరగకుండా అదుపులో ఉంచుతాయి.
మరిన్ని ప్రయోజనాలు..
ఉదయాన్నే వీటిని తినడం వల్ల ఫ్రెష్ బ్రీత్ మీ సొంతమవుతుంది. నోటి దుర్వాసన ఉన్నవారు దీనిని రెగ్యులర్‌గా ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే కంటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. యాంటీఆక్సిడెంట్లు కంటి చూపు మందగించకుండా.. వయసు పెరిగే కొద్ది సమస్యలు రాకుండా హెల్ప్ చేస్తాయి. టైప్ 2 డయాబెటిస్, ఇతర నొప్పులు, జుట్టు పెరుగుదల, అనేమియా, బరువు తగ్గడంలో ఇవి మంచి ఫలితాలు ఇస్తాయి.
ఎన్ని తీసుకోవచ్చంటే..
రోజుకు 5 నుంచి 7 కరివేపాకులను నమిలి తినొచ్చు. లేతవి తీసుకుంటే ఘాటు తక్కువగా ఉంటుంది. ఫ్రెష్ ఆకులు అయితే మరీ మంచిది. లేదంటే కరివేపాకును నీటిలో వేసి హెర్బల్ టీగా తీసుకోవచ్చు. ఆమ్లెట్, టోస్, స్మూతీలు వంటి బ్రేక్‌ఫాస్ట్‌లలో దీనిని వేసుకుని లాగించేయవచ్చు. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ అందుతాయి. అలాగే డిష్ రుచి పెరుగుతుంది. వీటిని డైట్లో చేర్చుకుంటే కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మంచి ఫలితాలుంటాయి.
Also Read : ఆరోగ్య ప్రయోజనాలకై, బరువు తగ్గడం కోసం 14 రోజులు ఈ డైట్ ఫాలో అయిపోండి.. మీల్ ప్లాన్ ఇదే