Sri Viswavasu Nama Samvatsaram Ugadi 2025 Date : 2025 మార్చి 30 ఆదివారం ఉగాది


2024లో క్రోధి నామ సంవత్సరంలో ఉన్నాం...


2025 మార్చి 30 నుంచి విశ్వావసు నామ సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాం... (Sri Viswavasu Nama Samvatsara Ugadi Festival 2025) 


విశ్వావసు నామ సంవత్సరం గతంలో 1965 -1966 లో వచ్చింది..


చైత్రమాసి జగద్బ్రహ్మ సపర్ణ పథమే అహని
వత్సరాదౌ వసంతాదౌ రసరాద్యే తథైవచ


బ్రహ్మకల్పం ప్రారంభమైన రోజు ప్రభవ. మొదటి ఋతువు వసంతం. మొదటి నెల చైత్రం. మొదటి తిథి పాడ్యమి. మొదటి వారం ఆదివారం. ఆ రోజే సృష్టి ప్రారంభమైంది. చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయవేళకు పాడ్యమి తిథి ఉన్నరోజునే ఉగాదిగా జరుపుకుంటారు.


ఉగస్య ఆదిః ఉగాదిః (Ugadi 2025)


ఉగ అంటే నక్షత్ర గమనం  -  దీనికి ఆరంభమే ఉగాది అని అర్థం. 


బ్రహ్మకు పగలు అంటే మన లెక్కల ప్రకారం 432,00,00,000 సంవత్సరాలు..రాత్రికూడా అంతే.


అంటే బ్రహ్మదేవుడికి ఒకరోజు అంటే…864,00,00,000 సంవత్సరాలు


360 రోజులు పూర్తి చేస్తే బ్రహ్మకు ఒక సంవత్సరం అయినట్లు లెక్క


3 లక్షల 11 వేల 40 కోట్ల సంవత్సరాలు పూర్తిచేస్తే ఒక్క రోజు కింద లెక్క..


ఇలా వందేళ్లు బ్రహ్మదేవుడి ఆయుష్షు
 
ఇప్పటివరకు ఆరుగురు బ్రహ్మలు సృష్టికార్యాలు పూర్తిచేశారు


ప్రస్తుతం ఏడో బ్రహ్మ  ద్వితీయపరార్థంలో ఉన్నాడు. అంటే ప్రస్తుతం ఆయన వయస్సు 51 సంవత్సరాలు.


ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరం  కలియుగంలో ఉన్నాం.


మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకుడనే రాక్షసుడిని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు ఉగాది


శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజుకూడా ఇదే


 వరాహమిహిరుడు పంచాగాన్ని జాతికి అంకితం చేసినది ఉగాదిరోజే. 


తెలుగు సంవత్సరాలు మొత్తం 60..వాటిలో 39వది విశ్వావసు నామ సంవత్సరం


1. ప్రభవ, 2. విభవ, 3. శుక్ల 4. ప్రమోదూత, 5. ప్రజోత్పత్తి, 6. ఆంగీరస, 7. శ్రీముఖ, 8. భవ, 9. యువ


10 ధాత, 11. ఈశ్వర, 12. బహుధాన్య, 13. ప్రమాథి, 14. విక్రయ, 15. వృక్ష, 16. చిత్రభాను, 17. స్వభాను


18. తారణ, 19. పార్థివ, 20. వ్యయ, 21. సర్వజిత్, 22. సర్వధారి, 23. విరోధి, 24. వికృతి, 25. ఖర, 26. నందన


27. విజయ, 28. జయ, 29. మన్మథ, 30. దుర్ముఖి, 31. హేవలంభి, 32. విలంబి, 33. వికారి, 34. శార్వరి


35. ప్లవ, 36. శుభకృత్, 37. శోభకృత్, 38. క్రోధి, 39. విశ్వావసు, 40. పరాభవ, 41. ప్లవంగ, 42. కీలక, 43. సౌమ్య


44. సాధారణ, 45. విరోధికృత్, 46. పరీధావి, 47. ప్రమాదీచ, 48. ఆనంద, 49. రాక్షస, 50. నల, 51. పింగళ


52. కాళయుక్త, 53. సిద్ధార్థి, 54. రౌద్రి, 55. దుర్మతి, 56. దుందుబి, 57. రుధిరోద్గారి, 58. రక్తాక్షి, 59. క్రోధన, 60. అక్షయ


సంవత్సరాలకు ఈ పేర్లు పెట్టడం వెనుక విభిన్న వాదనలు ఉన్నాయి. శ్రీకృష్ణుడికి 16,100మంది భార్యల్లో సందీపని అనే రాజకుమారికి 60మంది సంతానం. వారిపేర్లే ఇవి అంటారు. మరో కథనం ప్రకారం నారదుడికి పుట్టిన సంతానం పేర్లు ఇవి అని చెబుతారు. దక్షప్రజాపతి కుమార్తెల పేర్లుకూడా ఇవేనని ఇంకో కథనం.


Also Read: స్నానం ఎన్నిరకాలు.. నిత్యం చేసే స్నానానికి, దివ్య స్నానానికి ఏంటి వ్యత్యాసం!


ఈ పండుగను తెలుగువారు చాంద్రమానాన్ని అనుసరించి జరుపుకుంటారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు బెంగాల్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాల్లోనూ ఉగాది జరుపుకుంటారు. కర్ణాటకలో 'ఉగాది',  మహారాష్ట్రలో 'గుడిపాడ్వా',  తమిళులు 'పుత్తాండు',  మలయాళీలు 'విషు' , సిక్కులు 'వైశాఖీ' , బెంగాలీలు 'పొయ్‌లా బైశాఖ్' పేరుతో జరుపుకుంటారు
 
ఈ ఉగాది అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని..అన్నీ దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆశిద్దాం..


Also Read: కేదార్ నాథ్ ఆలయం తెరిచే డేట్ ఇదే .. శివరాత్రి సందర్భంగా ప్రకటించిన బద్రీనాథ్ - కేదార్నాథ్ బోర్డ్