ఫిబ్రవరి 27 రాశిఫలాలు
మేష రాశి
ఈ రోజు మీ వైవాహిక జీవితం చాలా శృంగారభరితంగా ఉంటుంది. ఉద్యోగులు కొత్త బాధ్యతలు పొందుతారు. రిస్క్ పెట్టుబడులు ప్రయోజనకరంగా ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారంలో పురోగతి సాధించే అవకాశం ఉంది. యువత ప్రేమ ప్రతిపాదనలు సఫలం అవుతాయి.
వృషభ రాశి
ఈ రోజు మీరు సహోద్యోగుల నుంచి సహాయం పొందుతారు. ఈ రోజు చాలా సమయం స్వీయ -నిర్ణయాధికారంలో గడుపుతారు. ముఖ్యమైన సమస్యలకు సంబంధించి చర్చిస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించేవారు టైమ్ తీసుకోండి. వైవాహిక సంబంధంలో ఉండే వివాదాలు సమసిపోతాయి.
మిథున రాశి
ఈ రోజు ఖర్చులు తగ్గిస్తారు. మీకు కొత్త శక్తి కమ్యూనికేషన్ ఉంటుంది. కొంత కృషి తర్వాత మాత్రమే విజయం సాధిస్తారు. మీ మనసులో మాటలు అపరిచితులతో పంచుకోవద్దు. చేయాల్సిన పనిపై పూర్తిస్థాయిలో శ్రద్ధ పెట్టలేరు. మీ భవిష్యత్ కోసం ప్లాన్ చేస్తారు.
Also Read: తిరుమల కొండెక్కే ముందు తప్పనిసరిగా చదువుకోవాల్సిన 3 శ్లోకాలు..లేదంటే ఆ దోషం తప్పదా!
కర్కాటక రాశి
మీ ప్రసంగాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది. పనికిరాని పనులపై ఆసక్తి చూపిస్తారు. పిల్లల పెంపకంపై శ్రద్ధ వహించండి. ఆన్‌లైన్ చెల్లింపుల సమయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి.
సింహ రాశి
కొత్త పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే అనుభవజ్ఞులైన సభ్యుల నుంచి అభిప్రాయం తీసుకోవాలి. వ్యాపారులకు రోజు చాలా మంచిది. మీ ఉత్పత్తుల నాణ్యతపై శ్రద్ధ వహించండి. ప్రేమ వ్యవహారాలలో తీవ్రత పెరుగుతుంది. ఉద్యోగులకు సాధారణంగా ఉంటుంది
కన్యా రాశి
ఈ రోజు మీ గౌరవం తగ్గుతుంది. ఉద్యోగులు సీనియర్ అధికారులతో అనవసర వాదనలు పెట్టుకోవద్దు. నూతన వ్యాపార భాగస్వామ్యాన్ని కలిగి ఉండేందుకు అవకాశాలుంటాయి. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు జాగ్రత్తగా వ్యవహరించాలి.
తులా రాశి
ఈ రోజు మీ కార్యాచరణపై దృష్టి పెట్టండి. సాంకేతిక విషయాలపై అధ్యయనం చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.
Also Read: నవగ్రహాలను ఎలా పూజించాలి.. ఏ రాశివారు ఎన్ని వత్తులతో దీపం వెలిగించాలి!
వృశ్చిక రాశి
ఈ రోజు మీ గౌరవం పెరుగుతుంది. నూతన వ్యాపారాన్ని ప్రారంభించండి. దీర్ఘకాలిక లక్ష్యాలు ప్లాన్ చేసుకుంటారు. ఎవరూ అడగకుండా ఎటువంటి సలహాలు చెప్పొద్దు. గొంతు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడతారు.
ధనస్సు రాశి
ఈ రోజు మీరు వ్యాపారంలో మంచి ప్రయోజనం పొందుతారు. రోజంతా బిజీగా ఉంటారు. గందరగోళ విషయాలను పరిష్కరించడానికి ప్రయత్నించండి. జీవిత భాగస్వామి సలహా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆకస్మిక డబ్బు ప్రయోజనం పొందవచ్చు.
మకర రాశి
ఈ రోజంతా ఆనందంగా ఉంటారు. ఆర్థిక విషయాలలో నిర్లక్ష్యంగా ఉండకండి. మీ విశ్వాసం తగ్గుతుంది. ఒత్తిడి మిమ్మల్ని ఆధిపత్యం చేస్తుంది. అప్పులు ఇవ్వొద్దు. పొట్టకు సంబంధించిన అనారోగ్య సమస్యలు రావొచ్చు.
Also Read: స్నానం ఎన్నిరకాలు.. నిత్యం చేసే స్నానానికి, దివ్య స్నానానికి ఏంటి వ్యత్యాసం!
కుంభ రాశి
ఈ రాశివారి వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. రక్తపోటు రోగులు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశం ఉంది. నూతన ఆస్తులు కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తారు. అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తిచేస్తారు. పాత స్నేహితుల నుంచి సహాయం పొందుతారు.
మీన రాశి
ఈ రోజు మీకు ఏ పనిపట్లా ఏకాగ్రత ఉండదు..అయినప్పటికీ చాలా పనులు ఒకేసారి చేయవలసి ఉంటుంది. పిల్లల విషయంలో సంతోషంగా ఉంటారు. స్నేహితులను నమ్మొద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.