Spirituality:  బంగారం, వెండి , ఇత్తడి లేదంటే మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తారు. నిత్యం కాకపోయినా పండుగలు, ప్రత్యేక రోజుల్లో వెండి కుందుల్లో దీపం వెలిగించే వారి సంఖ్య ఎక్కువే. అయితే వెండి ప్రమిదల్లో దీపారాధన వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి? ఏ రాశివారు ఎన్ని వత్తులు వెలగించాలో చూద్దాం..


వెండి కుందుల్లో నేతితో కానీ, కొబ్బరి నూనెతో, నువ్వుల నూనె, పొద్దుతిరుగుడు నూనెతో దీపారాధన చేస్తే ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతారు. వినాయకుడు, లక్ష్మీనారాయణుడు, లలితా త్రిపుర సుందరీదేవి, రాజరాజేశ్వరీ అమ్మవారికి, గాయత్రీ మాతకు వెండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి.


Also Read: స్నానం ఎన్నిరకాలు.. నిత్యం చేసే స్నానానికి, దివ్య స్నానానికి ఏంటి వ్యత్యాసం!


వెండి కుందుల్లో దీపారధన చేసి ఏ దేవుడిని ఆరాధిస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందంటే..


శ్రీ మహాగణపతి - సకల కార్యాల్లో అడ్డంకులు తొలిగి చేపట్టిన పనులు పూర్తవుతాయి


సూర్యుడు - శత్రునివారణ, ఐశ్వర్యాభివృద్ధి


చంద్రుడు - తేజస్సు, ఆరోగ్యం
 
కుజుడు - రక్తానికి సంబంధించిన వ్యాధులు, ఆలోచనల తీవ్రత నుంచి ఉపశణనం


బుధుడు - మంచి బుద్ధి కోసం
 
గురుడు - పొట్టకు సంబంధించిన వ్యాధులు తగ్గేందుకు
 
శుక్రుడు - మధుమేహ వ్యాధి నివారణకోసం
 
శని - అనుకోని కష్టాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తగ్గేందుకు
 
రాహువు - సిరి సంపదలు కలిగేందుకు


కేతువు - నేర్చుకున్న విద్యలో ఉన్నతి కోసం
 
శ్రీ సరస్వతి - విద్య, జ్ఞానం లభించేందుకు
 
శ్రీ మహాలక్ష్మీ - దారిద్య్రం తొలిగిపోయి ఐశ్వర్యం కలిగేందుకు
 
దుర్గాదేవి - శత్రుబాధలు తొలగిపోయేందుకు
 
గంగాదేవి - సకల పాపాలు తొలగిపోయి మోక్షం కోసం
 
తులసీదేవి - సౌభాగ్యం, దాంపత్య సుఖం
 
శివపార్వతులు - దాంపత్యజీవితంలో సంతోషం కోసం
 
శ్రీ లక్ష్మీనారాయణులు - ముక్తి కోసం
 
శ్రీరాముడు - కుటుంబంలో సఖ్యత కోసం
 
భైరవుడు - మూర్ఛ వ్యాధి నుంచి ఉపశమనం కోసం


Also Read:  ఒకటి 'మహా శ్మశానం' , మరొకటి 'మనో శ్మశానం' - ఈ క్షేత్రాల్లో అడుగుపెట్టాలంటే శివానుగ్రహం ఉండాల్సిందే!


ద్వాదశ రాశుల్లో ఏ రాశివారు వెండి కుందుల్లో ఎన్ని వత్తులు వెలిగించాలి


మేష రాశి - మూడు వత్తులు


వృషభ రాశి - నాలుగు వత్తులు


మిధున రాశి - ఏడు వత్తులు
 
కర్కాటక రాశి - మూడు వత్తులు
 
సింహ రాశి - ఐదు వత్తులు
 
కన్యా రాశి - నాలుగు వత్తులు
 
తులా రాశి - ఆరు వత్తులు
 
వృశ్చిక రాశి - ఐదు వత్తులు
 
ధనుస్సు రాశి - మూడు వత్తులు  


మకర రాశి - ఏడు వత్తులు 


కుంభ రాశి - నాలుగు వత్తులు 


మీన రాశి - ఐదు వత్తులు


శ్లోకం
అహింసా ప్రథమం పుష్పం, పుష్ప మింద్రియ నిగ్రహః
సర్వ భూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః
శాంతి:పుష్పం, తపః పుష్పం, ధ్యానం పుష్పం తధైవచ
సత్యమష్ట విధం పుష్పం విష్ణో:ప్రీతికరం భవేత్ 


అహింస, ఇంద్రియ నిగ్రహం, సర్వ భూత దయ, ఓర్పు, శాంతి, పరమాత్మ కోసం తపించుట, పరమాత్మ ధ్యానంలోనే ఉండడం, సత్యం మాత్రమే మాట్లాడడం..ఈ 8 విధాలైన పూలతో భగవంతుడిని అనుగ్రహిస్తే మీరు కోరుకున్నది వెనువెంటనే నెరవేరుతుంది.


Also Read: అఘోరాలు, నాగసాధువులకు మాయమయ్యే శక్తి ఉందా.. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా వెళ్లిపోతున్నారు!


గమనిక: పండితులు చెప్పన వివరాలు, కొన్ని ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించిన వివరాలు ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వశించాలి, అనుసరించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం. మీ జాతకంలో గ్రహాల సంచారం ఆధారంగా కూడా మీరు అనుసరించాల్సిన విధులు ఆధారపడి ఉంటాయి.