ఫిబ్రవరి 15 రాశిఫలాలు


మేష రాశి


తొందరపాటు వ్యవహారాలవల్ల నష్టపోతారు. ఆహారంలో అవకతవకలు కారణంగా పొట్టకు సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటారు.  ప్రత్యర్థులపై పై చేయి సాధిస్తారు. ఉద్యోగం, వ్యాపారంలో మంచి ఫలితాలు పొందుతారు. 


వృషభ రాశి


ఈ రాశివారు కెరీర్‌లో అద్భుతమైన అవకాశం పొందే అవకాశం ఉంది. కొత్త ఆదాయ వనరులు అభివృద్ధి చెందుతాయి. మీ సామర్థ్యం, ప్రతిభ మెరుగు పర్చుకునేందుకు ప్రయత్నించండి. అన్ని పనులు సజావుగా పూర్తిచేస్తారు.


మిథున రాశి


ఈ రోజు మీరున్న రంగంలో అదనపు సమయం కేటాయించాల్సి ఉంటుంది. అనవసర పోటీకి దిగకండి. వ్యాపారంలో మార్పులు చేర్పులు చేయొద్దు. ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. కుటుంబంలో కొన్ని సమస్యలుంటాయి.


Also Read: ఆలయం మొత్తం రంధ్రాలే.. బృహదీశ్వరాలయంలో దాగి ఉన్న రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!


కర్కాటక రాశి


మీ వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది.మీరు సమాజంలో కీర్తి పొందుతారు. ఇది మీ విశ్వాసాన్ని పెంచుతుంది. వినోద సంబంధిత కార్యకలాపాలలో డబ్బు ఖర్చు చేస్తారు. జ్ఞానులతో పరిచయాలు ఏర్పడతాయి. పర్యాటక ప్రదేశానికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. 


సింహ రాశి


ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. చట్టపరమైన వివాదాలు పరిష్కారం అవుతాయి. శని సంచారం మీకు మంచి చేస్తుంది. ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించాలి. సమయానికి కొన్ని పనులు పూర్తికాకపోవడం వల్ల అసహనంగా ఫీలవుతారు. ఓ శుభకార్యానికి హాడరవుతారు.


కన్యా రాశి


ఈ రోజు కుటుంబ సభ్యులకు మంచి సమయం కేటాయిస్తారు. ఇతరుల నమ్మకంతో ఉండకండి. ఇంట్లో పెళ్లీడుకొచ్చిన పిల్లల వివాహానికి సంబంధించి ఆందోళన ఉంటుంది. మీ పనిలో పై అధికారుల జోక్యం ఉంటుంది. విమర్శలకు కుంగిపోవద్దు. 


తులా రాశి


ఈ రోజు మీరు పనిలో కొన్ని సవాళ్లు  ఎదుర్కొంటారు. నీతి కారణంగా మీరు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబంలో భంగం కలిగించే వాతావరణం ఉంటుంది. పొట్టకు సంబంధించిన చికాకులు ఉంటాయి. వ్యాపారంలో ఖర్చులు పెరుగుతాయి. 


Also Read: స్నానం ఎన్నిరకాలు.. నిత్యం చేసే స్నానానికి, దివ్య స్నానానికి ఏంటి వ్యత్యాసం!


వృశ్చక రాశి


మీరున్న రంగంలో మంచి ఫలితాలు సాధిస్తారు.  కొన్నాళ్లుగా కొనసాగుతున్న బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. రోజంతా సంతోషంగా ఉంటారు. పెద్దలను గౌరవించండి. అధిక పని కారణంగా మీరు కష్టపడాలి. కుటుంబంలో శుభకార్యం నిర్వహిస్తారు. 


ధనస్సు రాశి


మారుమూల ప్రదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఉద్యోగంలో వివాదాలు సమసిపోతాయి. పెద్దలకు కుటుంబంలో మద్దతు లభిస్తుంది. డబ్బు లావాదేవీల  విషయంలో ఇబ్బంది ఉంటుంది. ఆరోగ్యం గురించి నిర్లక్ష్యం చేయకండి. ప్రమాదకర పని జాగ్రత్తగా చేయండి.


మకర రాశి


ఈ రోజు వ్యాపారవేత్తలకు చాలా మంచి రోజు. మీ ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు బదిలీలకు సంబంధించిన సమాచారం వింటారు.  వ్యాపార సంబంధాలలో తీవ్రత పెరుగుతుంది. కొత్త ప్రేమ సంబంధాలు అభివృద్ధి చెందుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. తల్లిదండ్రులకు ఆశీర్వాదం లభిస్తుంది.


కుంభ రాశి


ఈ రోజు విద్యార్థులు పరీక్షలకోసం కష్టపడాల్సి ఉంటుంది. సౌకర్యాలు తగ్గుతాయి. జ్వరం, జలుబు ఇబ్బందిపెడతాయి. మీ సామర్థ్యాలను విశ్వసించండి. మానసిక అలసట ఉంటుంది. ఈ రోజు విశ్రాంతికి సమయం కేటాయించడం మంచిది.


మీన రాశి


ఈ రోజు వ్యాపారం గురించి శుభవార్త వచ్చే అవకాశం ఉంది. సమీప స్థలానికి ప్రయాణం చేస్తారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తుల ఖ్యాతి పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలకు శుభసమయం.  


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  


Also Read: శివరాత్రులు ఎన్ని .. భోళా శంకరుడికి మహా శివరాత్రి ఎందుకు మరింత ప్రత్యేకం - శివయ్యకు ఏ అలంకారం ఇష్టం!