ఏడాదిలో వచ్చే శివరాత్రులు మొత్తం అయిదు
@ నిత్య శివరాత్రి
@ పక్ష శివరాత్రి
@ మాసశివరాత్రి
@ మహాశివరాత్రి
@ యోగశివరాత్రి
వీటిలో పరమేశ్వరుడి అత్యంత ప్రీతికరమైన పర్వదినం మహాశివరాత్రి. మార్గశిరమాసం బహుళ చతుర్థి , ఆరుద్ర నక్షత్రం రోజున శివుడు లింగోద్భవం జరిగింది. అందుకే ఈ రోజు శివుడిని లింగరూపంలో ఆరాధిస్తారు. ఉపవాసం, జాగరణ , శివనామస్మరణ ఈరోజు అత్యంత పుణ్యఫలం.ఈ రోజు శివప్రతిష్ట, శివకల్యాణం చేస్తే మరింత ఫలితం లభిస్తుంది.
Also Read: ఫిబ్రవరి 26 or 27.. మహా శివరాత్రి ఎప్పుడు - మిగిలిన దేవుళ్ల కన్నా శివుడు ఎందుకు ప్రత్యేకం!
మహాశివరాత్రి రోజు ఎవరైతే తనను పూజిస్తారో వారు కుమారస్వామికన్నా తనకు ఇష్టులవుతారని శివుడు స్వయంగా చెప్పినట్టు శివపరాణంలో ఉంది. త్రయోదశి రోజు నుంచి ఉపవాస నియమాలు పాటించి చతుర్థశి మొత్తం ఉపవాసం, జాగరణ చేయాలి. శివరాత్రి మర్నాడు ఉదయం స్నానమాచరించి శివపూజ చేసి ఉపవాసాన్ని విరమించాలి.
పరమేశ్వరుడి 64 స్వరూపాలలో లింగరూపం ముఖ్యమైనది. అర్థరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయమని పురాణాలలో ఉంది. అందుకే ఈ రోజు జాగరణ చేసి మాహాలింగ దర్శనం చేసుకుంటారు.
చిన్నా, పెద్దా, స్త్రీలు, పురుషులు అనే వ్యత్యాసం లేకుండా ఉపవాసం, జాగరణ చేసే పర్వదినమే మహాశివరాత్రి. ప్రపంచమంతా శివమయం అని తెలియడేయడమే ఈ నియమాల వెనుకున్న ఆంతర్యం
మహా శివరాత్రి రోజు పరమేశ్వరుడి అలంకారాలు ఎన్నో విధాలుగా చేస్తారు. అయితే అన్ని రూపాల్లో విభూధి ధారణ చేస్తే అత్యంత సంతోషిస్తాడట శివుడు. ఎందుకంటే విభూది అంటే పూర్తిగా అగ్నిలో కాలిన శుద్ధమైన వస్తువు. శివుడు ఒంటినిండా విభూది అద్దుకుంటాడు. శివుడు మెచ్చే రెండో అలంకారం రుద్రాక్ష ధారణ. పరమేశ్వరుడి మూడో కన్నుగా చెప్పే రుద్రాక్షలంటే ఆయనకెంతో ప్రీతి.
Also Read: మౌని అమావాస్యరోజు రాజస్నానం ఇలా చేయాలి - కుంభమేళాలో ఈరోజు అత్యంత ప్రత్యేకం!
పంచాక్షరి జపం చేస్తే చాలు భోళాశంకరుడు కరిగిపోతాడు.
రంగురంగుల పూలతో అవసరం లేదు..ఒకే ఒక బిల్వదళం శివలింగంపై వేస్తే చాలు కరుణించేస్తాడు
శివరాత్రి రోజు ప్రదోష సమయంలో శివనామస్మరణ, శివదర్శనం చేస్తే చేస్తే విశేష ఫలితం లభిస్తుంది
పరమ శాంతినిచ్చేది శివనామస్మరణకు అందరూ అర్హులే.
ఉప మాపేపిశత్తమః కృష్ణం వ్యవక్తమస్థిత్!
ఉష ఋణేవ యాతయ!!
రాత్రి అంటే ఆనందదాయిని అన్నింటికి ఆశ్రయం ఇవ్వగలది అని అర్థం. అందుకే మహాశివరాత్రి వ్రతాన్ని రాత్రిపూట జరుపుకుంటారు. అందులోనూ కృష్ణపక్షం చతుర్దశి రోజు వచ్చిన రాత్రికి ఓ ప్రత్యేకత ఉంది. చతుర్దశి రోజు ఎవరైతే శివపూజను చేస్తారో, ఆ రాత్రి జాగరణ పాటిస్తారో వారికి మళ్లీ భూమ్మీద జన్మించే అవకాశం రాదు..అంటే జీవన్ముక్తుడు అవుతాడని అర్థం. అంత మహిమాన్వితమైనది శివపూజ
శివంతు పూజయత్వా యోజా గర్తిచ చతుర్దిశీం!
మాతుః పయోధర రసం నపిబేత్ స కదాచన!!
శివరాత్రి అంత గొప్పది కాబట్టే గరుడ, స్కంద, పద్మ అగ్ని పురాణాల్లో దీని గురంచి ప్రత్యేకంగా ప్రశంసించడం జరిగింది. చెప్పే విధానంలో వ్యత్యాసం ఉండచ్చేమో కానీ విషయం మాత్రం ఒకటే. శివరాత్రి రోజు ఎవరైతే ఉపవాసం, జాగరణ చేసి బిల్వ పత్రాలతో పూజ చేస్తారో వారికి నరకబాధలు ఉండవు. శివుడు ఆనందాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తాడు.
ఈ ఏడాది మహా శివరాత్రి ఫిబ్రవరి 26 న వచ్చింది....
Also Read: జ్యోతిర్లింగాలను ఒకే ట్రిప్లో ఎలా కవర్ చేయొచ్చో తెలుసా? హైదరాబాద్ నుంచి ఇలా స్టార్ట్ అయిపోండి