Pilgrimage to 12 Jyotirlingas : ఇండియాలో మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. వీటిని దర్శించుకోవాలని భక్తులు చూస్తూ ఉంటారు. అలా మీరు జ్యోతిర్లింగాలు చూడాలని, దర్శించుకోవాలని అనుకుంటున్నారా? అది కూడా ఒకటే ట్రిప్​లో అన్ని కవర్ చేయాలనుకుంటున్నారా? అయితే మీకు ఇది హెల్ప్ అవుతుంది. అసలు జ్యోతిర్లింగాలు ఎక్కడున్నాయి? వాటిని ఎలా చేరుకోవాలి? హైదరాబాద్ నుంచి ట్రిప్ ఎలా స్టార్ట్ చేయాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.


12 జ్యోతిర్లింగాలు - వాటి పేర్లు


సోమనాథుడు, మల్లీకార్జునుడు, మహాకాళుడు, ఓంకారేశ్వరుడు, వైద్య నాథుడు, భీమ శంకరుడు, రామేశ్వరుడు, నాగేశ్వరుడు, విశ్వనాథుడు, త్రయంబకేశ్వరుడు, కేదారేశ్వరుడు, ఘృష్ణేశ్వరుడు.


రూట్ మ్యాప్ ఎలా ఉండాలంటే..


మీరు హైదారాబాద్ నుంచి వీటిని కవర్ చేయాలనుకుంటే.. ఇవి ఉండే ప్రాంతాలు తెలుసుకుని.. వాటి ప్రకారం మీ ట్రిప్ ప్లాన్ చేసుకోండి. హైదరాబాద్ నుంచి వెళ్లాలనుకుంటే.. ముందుగా మీరు మల్లికార్జున జ్యోతిర్లింగం దర్శించుకోవచ్చు. అనంతరం తమిళనాడులోని రామేశ్వరం జ్యోతిర్లింగం దర్శించుకోవచ్చు. తర్వాత మహారాష్ట్రలో మూడు జ్యోతిర్లింగాలు ఉంటాయి. భీమాశంకర్, త్రయంబకేశ్వర, ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగాలు చూడొచ్చు. మధ్యప్రదేశ్​లో ఓంకారేశ్వర్, మహాకాలేశ్వర్ చూడొచ్చు. అనంతరం గుజరాత్ వెళ్లి అక్కడ సోమనాథ్, నాగేశ్వర్ జ్యోతిర్లింగాలు రెండూ కవర్ చేయొచ్చు. ఉత్తరఖాండ్​లో కేథారనాథ్ ఉంటుంది. ఉత్తర ప్రదేశ్​లో కాశీ విశ్వనాథ్. జార్ఖండ్​లో బైద్యనాథ్​ని చూడొచ్చు.  


మల్లికార్జున జ్యోతిర్లింగం..


మీరు హైదరాబాద్ నుంచి మల్లికార్జున జ్యోతిర్లింగమున్న శ్రీశైలంకి ఎలా వెళ్లాలంటే.. మీరు ఏ ప్రదేశంలో ఉన్నా.. ఎంజీబీఎస్ బస్ స్టాప్​కి వెళ్లండి. అక్కడ ఉదయం నుంచి శ్రీశైలంకి బస్సులు అందుబాటులో ఉంటాయి. జర్నీ సమయంలో 3 నుంచి 6 గంటలు ఉంటుంది. అక్కడ స్టే చేసేది లేనిది మీ ఇష్టం. టెంపుల్​కి వెళ్లి జ్యోతిర్లింగాన్ని దర్శించుకోండి. అనంతరం రామేశ్వరానికి స్టార్ట్ అయితే మంచిది. 


రామేశ్వరం జ్యోతిర్లింగం 


శ్రీశైలం బస్ స్టాప్ నుంచి మార్కాపురంకి టికెట్ తీసుకోవాలి. సాయంత్రం 6 లోపు మార్కాపురం స్టేషన్​కి వెళ్లేలా చూసుకోండి. ఎందుకంటే.. రోజుకు ఒకటే ట్రైన్ ఉంటుంది. అది కూడా తిరుపతి వరకే. శ్రీశైలం నుంచి వెళ్లాలంటే ఇదే బెటర్ రూట్. 6.40 మార్కాపూర్ నుంచి ట్రైన్ స్టార్ట్ అవుతుంది. తెల్లారుజాము 4 గంటలకు తిరుపతి రీచ్ అవుతారు. ఇక్కడి నుంచి రామేశ్వరానికి డైరక్ట్ ట్రైన్ కావాలనుకుంటే.. సోమవారం, గురువారం, శుక్రవారం, శనివారం మాత్రం ట్రైన్ సౌకర్యం ఉంటుంది. అవి కూడా ఉదయం 6.10కి, 11.55కి ఉంటాయి. రామేశ్వరంలో మండపం అనే స్టేషన్ వరకు వెళ్లాలి. అక్కడి నుంచి ఆటోలో వెళ్లాలి. లేదంటే తిరుపతి నుంచి చెన్నై ఎగ్మోర్ వెళ్తే అక్కడినుంచి రామేశ్వరంకి వెళ్లొచ్చు. 


భీమాశంకర్, త్రయంబకేశ్వర, ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగాలు


రామేశ్వరం నుంచి భీమాశంకర్​కి వెళ్లాలనుకుంటే..  మధురై జంక్షన్​కి వెళ్లాలి. అక్కడి నుంచి పూణే వెళ్లడానికి ఏ ట్రైన్ ఉంటే దానిని ఎక్కాలి. పూణె నుంచి వాక్డేవాడి బస్​స్టాప్​కి వెళ్లాలి. అక్కడి నుంచి భీమాశంకర్​కి వెళ్లొచ్చు. దర్శనం తర్వాత రిటర్న్ అయిపోవాలి. ఎందకంటే అక్కడ స్టేయింగ్ ఆప్షన్స్ ఎక్కువగా ఉండవు. 


భీమాశంకర్​ నుంచి మంచర్​కి వెళ్లాలి. అక్కడి నుంచి నాసిక్​. నాసిక్ నుంచి త్రియంబకేశ్వరం వెళ్లే బస్ ఎక్కాలి. అక్కడ దర్శనం చేసుకోవాలి. అక్కడి నుంచి మళ్లీ నాసిక్ వెళ్లి.. అక్కడి నుంచి ఛత్రపతి సామ్​వాజి నగర్​కి వెళ్లాలి. అక్కడ నుంచి నేరుగా ఘృష్ణేశ్వర టెంపుల్​కి తీసుకెళ్తారు. దర్శనం తర్వాత ఓంకారేశ్వర్ టెంపుల్​కి వెళ్లాలి. 


ఓంకారేశ్వర్, మహాకాలేశ్వర్ జ్యోతిర్లింగాలు


మధ్యప్రదేశ్​లోని ఓంకారేశ్వర్​కి వెళ్లేందుకు.. మహావీర్ చౌక్ అనే ప్లేస్​కి వెళ్లాలి. అక్కడి నుంచి.. ఇండోర్​కి వెళ్లాలి. అక్కడి నుంచి క్రిస్టల్ ఐటీపార్క్​ దగ్గర దిగాలి. అక్కడ నుంచి ఓంకారేశ్వర్ వెళ్లే బస్సు ఎక్కాలి. అక్కడి నుంచి నది ప్రయాణం చేయాలి. ఫ్రెష్ అయిన తర్వాత బ్రిడ్జ్​ లేదా బోట్​లో వెళ్లొచ్చు. ఓంకారేశ్వరుడి దర్శనం తర్వాత ఉజ్జయినికి బయలుదేరాలి. ఓంకారేశ్వర్​ నుంచి హోటల్ ప్రెసిడెంట్​ దగ్గర దిగాలి. అక్కడ ఉజ్జయిని టెంపుల్​లో మహాకాలేశ్వర్ దర్శనం చేసుకోవాలి. 


సోమనాథ్, నాగేశ్వర్ జ్యోతిర్లింగాలు 


ఉజ్జయిని నుంచి వెరావల్​కి ట్రైన్​లో వెళ్లాలి. స్టేషన్ బయట బస్సులు ఉంటాయి. అవి డైరక్ట్ టెంపుల్ దగ్గరికి తీసుకెళ్తాయి. లేదంటే ఆటోలో కూడా సోమనాథ్ టెంపుల్​కి వెళ్లొచ్చు. దర్శనం తర్వాత నాగేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్లాలి. దీనికోసం మీరు వెరావెల్ స్టేషన్​కి వెళ్లి.. అక్కడి నుంచి ద్వారక వెళ్లాలి. అక్కడి నుంచి నాగేశ్వర్​కి ఆటోలో లేదా టూర్ బస్​కి వెళ్లొచ్చు. 


కేదారనాథ్


కేదరానాథ్​కి వెళ్లేందుకు ద్వారక నుంచి ఢిల్లీకి ట్రైన్ జర్నీ చేయాలి. అక్కడి నుంచి రిషికేష్ వెళ్లేందుకు బస్ ఎక్కాలి. ఢిల్లీ నుంచి హరిద్వార్​కి కూడా ట్రైన్ జర్నీ చేయొచ్చు. రిషికేష్​, హరిద్వార్ ఈ రెండిటీలో ఎక్కడి దిగినా.. సోన్​ప్రయాగ్ వెళ్లాలి. ఉదయం 11లోపు మాత్రమే బస్సులు అందుబాటులో ఉంటాయి. సోనుప్రయాగ్​లో దిగిన తర్వాత ఎంత లేట్ అయినా.. గౌరికూన వెళ్లిపోతే మంచిదని చెప్తున్నారు. రెస్ట్ తీసుకుని.. ట్రెక్ స్టార్ట్ చేసి.. దర్శనం చేసుకుని రిటర్న్ అయిపోవచ్చు. అనంతర ఢిల్లీ చేరుకుని.. అక్కడి నుంచి కాశీ బయలుదేరొచ్చు. 


కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం


ఢిల్లీ నుంచి కాశీకి వెళ్లేందుకు ఢిల్లీ నుంచి వారణాసికి ట్రైన్​ జర్నీ చేయాలి. కాశికి వెళ్లిన తర్వాత అక్కడ కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి. 


బైద్యనాథ్ జ్యోతిర్లింగం


వారణాసి నుంచి జసిద్ జంక్షన్ వెళ్లాలి. అక్కడి నుంచి బైద్యనాథ్  టెంపుల్​కి వెళ్లి జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి. 


ఇలా ఒకే ట్రిప్​లో 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవచ్చు. అయితే ఇది కేవలం ఎలా ట్రావెల్ చేయాలో చెప్పే సమాచారం మాత్రమే. బడ్జెట్, ఎక్కడ స్టే చేయాలి వంటివి దీనిలో మెన్షన్ చేయలేదు. మీరు జ్యోతిర్లింగాలు ఒకే ట్రిప్​లో కవర్​ చేయాలనుకున్నప్పుడు ఇది మీకు బాగా హెల్ప్ అవుతుంది. అలాగే కేదార్​నాథ్ టెంపుల్ ఎప్పుడు తెరిచి ఉంటుందో తెలుసుకుని.. దాని ప్రకారం మీ ట్రిప్​ని ప్లాన్​ చేసుకోవాలి.



Also Read : సోలో ట్రిప్​కి వెళ్లాలనుకుంటే ఇండియాలో బెస్ట్ ప్లేస్​లు ఇవే.. ఈ ఏడాదైనా వెళ్లొచ్చేయండి