Pattudala Trailer Review: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ రీసెంట్‌గా దుబాయ్ 24 హెచ్ రేస్‌లో స్వయంగా పాల్గొని మూడో స్థానం సొంతం చేసుకుని దేశవ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకున్నారు. రేసింగ్, సైట్ సీయింగ్ అంటే ఇష్టపడే అజిత్.. దానికోసం ఎంత వరకైనా వెళతాడనే విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. అలా చేయడం వల్ల జ్ఞానం పెరుగుతుందని కూడా ఇటీవల అజిత్ సెలవిచ్చాడు. ఇక రేస్‌లో విజయం అనంతరం మరోసారి అజిత్ పేరు ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. కారణం.. ఆయన నటిస్తున్న ‘విడాముయర్చి’ ట్రైలర్. తెలుగులో ‘పట్టుదల’ పేరుతో విడుదల కాబోతోన్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని గురువారం మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉందంటే..
‘‘అజర్ బైజాన్‌లోని ఒక ఎడారి ప్రాంతంలో అదిరిపోయే చేజింగ్ సీన్‌తో మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం హాలీవుడ్ రేంజ్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇవ్వడంతో పాటు.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. కారు డ్రైవింగ్ చేస్తూ.. సాల్ట్ అండ్ పెప్పెర్ లుక్‌లో ఎంట్రీ ఇచ్చిన అజిత్, ఆ వెంటనే కూల్ లుక్‌లో మారిపోయి త్రిషతో కనిపించారు. త్రిషతో జాయ్‌ఫుల్ మూమెంట్స్‌లో కనిపిస్తూనే సడెన్‌గా ఏదో కోల్పోయిన వాడిగా కనిపించి.. ఈ సినిమాలో ఎటువంటి డ్రామా ఉండబోతుందో క్లారిటీ ఇచ్చేశారు. ‘నాకు ఈ జనరేషన్ గురించి పెద్దగా తెలియదు.. కానీ మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాచ్ పాడయితే రిపేర్ చేయిస్తాం.. టీవీ పాడయితే రిపేర్ చేయిస్తాం.. తీసి పారేయమ్ కదా’ అనే డైలాగ్ వారిద్దరి మధ్య బ్రేకప్‌ని తెలియజేస్తుంది. ఆ వెంటనే యాక్షన్ కింగ్ అర్జున్, రెజీనా అదిరిపోయే ఎంట్రీ. అర్జున్ స్టైలిష్ లుక్‌తో పాటు జైలు ఖైదీగా కనిపించి, తను కూడా ఈ సినిమాకు చాలా ముఖ్యమనే విషయాన్ని తెలియజేశారు.
ఇక ఆ తర్వాత రేసీ స్క్రీన్‌ప్లేతో ఈ ట్రైలర్ నడిచింది. అజర్ బైజాన్‌లో నేరాలు జరగడం చాలా తక్కువ అని పోలీస్ ఆఫీసర్ డైలాగ్ చెబుతున్నప్పుడే, అక్కడొక హత్య జరిగినట్లుగా చూపించారు. దానికి కారణమైన వారు వీరే అనేలా రెండు కొత్త పాత్రలను పరిచయం చేశారు. అజిత్-రెజీనా సంభాషణ, ఆ తర్వాత వచ్చే కొన్ని సీన్లు.. ఇదొక క్రైమ్ ఇన్విస్టిగేషన్ స్టోరీ అనే విషయాన్ని తెలిపితే.. ఆ క్షణం నుండి ట్రైలర్ ఎండింగ్ వరకు కంటి రెప్ప కూడా వేయనీయకుండా దర్శకుడు ఈ ట్రైలర్‌ని నడిపించారు. ముఖ్యంగా విజువల్స్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అన్నీ కూడా హాలీవుడ్ రేంజ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను, ఫ్రెష్ ఫీల్‌ని ఇస్తూ.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. ఓవరాల్‌గా అయితే.. ఈసారి అజిత్ కుమార్‌కు హిట్ పక్కా అనేలా ఈ ట్రైలర్ ఉందని చెప్పుకోవచ్చు. ట్రైలర్‌తో పాటు ఈ సినిమా విడుదల తేదీని కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు.
వాస్తవానికి ఈ సినిమా ఈ సంక్రాంతికే విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల చివరి నిమిషంలో వాయిదా వేశారు. ఇక ట్రైలర్‌లో చెప్పిన ప్రకారం ఈ సినిమా ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకానుంది. అజిత్‌కుమార్, లైకా ప్రొడక్షన్స్ కలయికలో మగిళ్ తిరుమేని దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. త్రిష, అర్జున్, రెజీనా, ఆరవ్, నిఖిల్ వంటి వారు ఇతర పాత్రలలో నటిస్తున్న ఈ చిత్ర శాటిలైట్ హక్కులను సన్ టీవీ సొంతం చేసుకోగా, ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. సోనీ మ్యూజిక్ ద్వారా ఆడియో మార్కెట్‌లోకి విడుదల కానుంది.
Also Read : సైఫ్ అలీ ఖాన్ ఫిట్నెస్, డైట్ టిప్స్.. యాభై దాటిన ఫిట్‌గా ఉండడానికి ఇవే రీజన్