Saif Ali Khan Diet and Fitness Tips : సైఫ్​ అలీ ఖాన్​పై దాడి జరిగిందనే విషయం సినీ ఇండస్ట్రీలో కలకలం రేపింది. దాదాపు ఏడు చోట్ల అఘంతకుడు పొడిచినట్లు ప్రాథమిక సమాచారం అందింది. రెండు చోట్ల తీవ్రగాయాలయ్యాయని కూడా చెప్తున్నారు. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం సైఫ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని అఫీషియల్​గా చెప్తున్నారు. అన్ని గాయాలైనా కూడా సైఫ్​ అవుట్ ఆఫ్ డేంజర్​ అవ్వడానికి అతను ఫాలో అయ్యే డైట్, ఫిట్​నెస్ రోటీనే కారణం. ఎందుకంటే యాభై ఏళ్ల తర్వాత ఇలాంటి ఘటనలు ఏమైనా జరిగితే శరీరం తీసుకోవడం కష్టమవుతుంది. కానీ సైఫ్ స్టెబుల్​గా ఉండడానికి ఆయన ఫాలో అయ్యే ఫిట్​నెస్ రొటీనే కారణం.  


నటుడిగా 1993లో సినీ కెరీర్​ను ప్రారంభించారు. నటుడిగా ముప్పై ఏళ్ల కెరీర్ దాటినా ఇప్పటికి తన లుక్, ఛార్మ్​తో సినిమాలు చేస్తున్నారు సైఫ్. హీరోగానే కాకుండా నటుడిగా, విలన్​గా కూడా తనదైన మార్క్​ వేస్తున్నారు సైఫ్. తన లుక్స్ మాత్రమే కాదు ఫిట్​నెస్ విషయంలో కూడా గోల్స్ సెట్ చేస్తున్నారు. ఇంతకీ ఈ హీరో ఫాలో అయ్యే ఫిట్​నెస్ రొటీన్ ఏంటో? డైట్​లో ఏమేమి తీసుకుంటారు వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


సైఫ్ అలీ ఖాన్ డైట్


సైఫ్ తన డైట్​లో బ్యాలెన్స్డ్​ మీల్స్ ఉండేలా చూసుకుంటాడు. లీన్ ప్రోటీన్స్ ఉండేలా చూసుకుంటాడు. దానిలో భాగంగా చికెన్, చేపలు తీసుకుంటారు. ఇవి కండరాలను పెంచడంలో హెల్ప్ చేసి.. మజిల్ లాస్​ కాకుండా ఫిట్​గా ఉండడంలో హెల్ప్ చేస్తాయి. 


హెల్తీ ఫ్యాట్స్


సైఫ్ అలీ ఖాన్ తన డైట్​లో హెల్తీ ఫ్యాట్స్ ఉండేలా చూసుకుంటారు. ఆలివ్ ఆయిల్, నట్స్, అవకాడో వంటివాటిలో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. వయసు పెరిగే కొద్ది కండర రాశి తగ్గుతుంది. అలా జరగకుండా.. వ్యాయామం, ఇలాంటి హెల్తీ ఫ్యాట్స్​తో కండరాలను బిల్డ్ చేయవచ్చు. ఇవి బ్రెయిన్ హెల్త్​కి కూడా మంచివి. 


క్లీన్ ఫుడ్ 


ప్యాక్ చేసిన, అన్​హెల్తీ ఫుడ్​కి సైఫ్​ పూర్తిగా దూరంగా ఉంటారట. ఫ్రెష్​గా వండిన ఫుడ్స్, తాజా కాయగూరలు, పండ్లు వంటివాటిని తన డైట్​లో ఉండేలా ప్లాన్ చేసుకుంటారు సైఫ్.


ఫాస్టింగ్


సైఫ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తారు. దీనిలో భాగంగా కేవలం 8 గంటలు మాత్రమే ఆయన ఫుడ్ తీసుకుంటారు. 16 గంటలు ఫాస్టింగ్ చేస్తారు. దీనివల్ల శరీరంలోని ఫ్యాట్ కరిగి.. మజిల్ లాస్​ కాకుండా శక్తిని అందిస్తుందట. 


ఈ ఎనిమిది గంటల విండ్​లో సైఫ్ చిన్న చిన్న మీల్స్ తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల ఆకలి తక్కువ వేస్తుంది. మెటబాలీజం కూడా మెరుగవుతుంది. అంతేకాకుండా ఎక్కువ డ్రైన్ అయిన ఫీల్ రాకుండా ఉంటుంది. అలాగే నీటిని ఎక్కువగా తీసుకుంటారట సైఫ్. ఇది మొత్తం ఆరోగ్యంతో పాటు చర్మాన్ని మెరుగుపరుస్తుంది.  


ఫిట్​నెస్ రొటీన్


సైఫ్ స్ట్రైంత్ ట్రైనింగ్ తీసుకుంటారు. ఇవి బరువు పెరగకుండా.. మజిల్​ని దృఢంగా చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఫ్లెక్సిబుల్, ఫంక్షనల్ వర్క్​అవుట్స్ చేస్తారు సైఫ్. యోగా, పిలేట్స్ రెగ్యులర్​గా చేస్తూ ఉంటారట. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి.. ఫ్యాట్​ని బర్న్ చేయడానికి కార్డియో చేస్తారు.


డైట్, ఫిట్​నెస్ విషయంలో ఈ రొటీన్​ని సైఫ్ కచ్చితంగా ఫాలో అవుతారట. దీనిని ఫిట్​గా ఉండాలనుకునే ఎవరైనా ఫాలో అవ్వొచ్చు. వయసు పెరిగినా.. మంచి లుక్​, హెల్త్​తో ఉండడంలో ఈ రొటీన్ హెల్ప్ చేస్తుంది. 



Also Read : ఇంటి భోజనంతో బరువును ఇలా ఈజీగా తగ్గొచ్చు.. బెల్లీ ఫ్యాట్​ని వేగంగా తగ్గించే ఫుడ్స్ ఇవే​