ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. బన్నీ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న 'పుష్ప 2' ఎక్స్టెంటెడ్ వెర్షన్ పై చిత్రం బృందం తాజాగా అఫీషియల్ గా అప్డేట్ ఇచ్చింది. ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా తగ్గించిన టికెట్ ధరలను హైలెట్ చేస్తూ, ఎప్పటి నుంచి ఈ ఎక్స్టెంటెడ్ వెర్షన్ అందుబాటులోకి రాబోతోంది అనే విషయాన్ని ప్రకటించారు.
సినిమా లవర్స్ డే సందర్భంగా ఎక్స్టెంటెడ్ వెర్షన్
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ 'పుష్ప 2'. డిసెంబర్ 5న రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డులను షేక్ చేసిన సంగతి తెలిసిందే. కలెక్షన్ల పరంగా బాక్స్ ఆఫీస్ మోత మోగించి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. రష్మిక మందన్న ఇందులో హీరోయిన్ గా నటించగా, శ్రీలీల ఐటమ్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందించగా, మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించారు. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ జోరు ఇంకా తగ్గలేదు. సంక్రాంతి కానుకగా మూడు పెద్ద సినిమాలు థియేటర్లలోకి వచ్చినప్పటికీ 'పుష్ప 2' సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది.
చాలా రోజుల నుంచి ఇండియన్ సినిమాలోనే ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన 'పుష్ప 2' రీలోడెడ్ వెర్షన్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా నిర్మాతలు రీలోడెడ్ వెర్షన్ లో ముందున్న రన్ టైంకి 20 నిమిషాలు ఫుటేజ్ ని యాడ్ చేసి, జనవరి 17 నుంచి థియేటర్లలోకి తీసుకురాబోతున్నామంటూ తాజాగా ప్రకటించారు. అది కూడా సినిమా లవర్స్ డే రోజున ప్రత్యేకంగా ఈ మూవీ టికెట్ ధరలు తగ్గించి స్పెషల్ షోలు వెయ్యబోతున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ మేరకు ప్రత్యేకంగా రిలీజ్ చేసిన పోస్టర్లో సింగిల్ స్క్రీన్ లలో 'పుష్ప 2' రీలోడెడ్ వెర్షన్ టికెట్ ధర రూ.112, మల్టీప్లెక్స్ లో రూ.150 ఉండబోతుందని వెల్లడించారు. దీంతో పుష్పరాజ్ మరోసారి సంక్రాంతి సినిమాలతో పోటీకి సిద్ధమవుతున్నాడు. మరి ఈసారి ఎక్స్టెంటెడ్ వెర్షన్ ద్వారా పుష్పరాజ్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.
Also Read: 'దేవర' విలన్ సైఫ్ అలీ ఖాన్ మీద దాడి... బలమైన కత్తిపోట్లు, తీవ్ర గాయాలతో ఆసుపత్రికి
అల్లు ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్
ఇదిలా ఉండగా అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. ఈ మేరకు అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి... పిల్లలు అయాన్, అర్హతో కలిసి ఉన్న ఫోటోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇక ఆ ఫోటోలో అల్లు అర్జున్ తెల్లటి కుర్తా పైజామా ధరించి సరికొత్త లుక్ లో దర్శనం ఇవ్వగా, స్నేహ రెడ్డి బ్లాక్ కలర్ చీరలో సింపుల్ గా కనిపించింది. ఈ పోస్ట్ కి స్నేహ "సంక్రాంతి శుభాకాంక్షలు 2025" అనే క్యాప్షన్ ఇచ్చింది. మొత్తానికి అల్లు ఫ్యామిలీ సంధ్య థియేటర్ వివాదం నుంచి బయటపడి, సంక్రాంతిని సంతోషంగా జరుపుకున్నట్టుగా కనిపిస్తోంది.