Brahmanandam : నా లెగసి కంటిన్యూ చేసే వారసుల్లో వెన్నెల కిషోర్ ఒకడు - బ్రహ్మానందం
Brahmanandam About His Legacy : వెన్నెల కిషోర్ తన కామెడీ నట వారసుల్లో ఒకడని హాస్యబ్రహ్మా బ్రహ్మానందం ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన నటిస్తున్న బ్రహ్మానందం టీజర్ ఈవెంట్ లో ఇలా చెప్పారు.

Brahmanandam About Vennela Kishore : హాస్యబ్రహ్మ, కామెడీ కింగ్ ‘పద్మశ్రీ’ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. తండ్రికొడుకులైన వీరిద్దరు తెరపై తాత మనవడిగా సందడి చేయబోతున్నారు. వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. ప్రియ వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో గౌతమ్ రాజా బ్రహ్మనందం అనే పాత్రలో నటిస్తుండగా.. అతడికి తాతగా బ్రహ్మానందం కనిపించనున్నారు. ఫిబ్రవరి 14న ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేసింది టీం. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా టీజర్ లాంచ్ ఈవెంట్ లో బ్రహ్మానందం మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వెన్నెల కిషోర్ పై ఆయన చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అనంతరం ఆయన మాట్లాడుతూ బ్రహ్మానందం టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ఈ మేరకు బ్రహ్మానందం మాట్లాడుతూ.. బ్రహ్మానందం చిత్రంలో అందరు చాలా బాగా నటించారు. అందరిలో హిడెన్ టాలెంట్ ఉంది. ప్రతి ఒక్కరు గొప్పగా నటించారు. ముఖ్యంగా వెన్నెల కిషోర్ నటన చాలా అద్భుతంగా ఉంది. తన నటన చూసి సెట్లో నేను నవ్వుతూనే ఉన్నారు. ఒక సీన్ లో వెన్నెల కిషోర్ యాక్టింగ్ గురించి చెప్పారు. చచ్చిపోతాను నేను.. చచ్చిపోవడానికి వెళ్తున్నాను నేను అంటాడు. వెళ్లు అన్నట్టు మేం చూస్తాం. లేదులే సైలెంట్ గా రూంకి వెళ్లి పడుకుంటాను.. అక్కడ సీను.. బహుశా దానికి ఆరు టేకులు తీసుకున్నాం. ఎందుకంటే ప్రతి షాట్ లో నేను నవ్వుతూనే ఉన్నాను. అంత బాగా యాక్ట్ చేశాడు. నా తర్వాత నా లెగసిని కంటిన్యూ చేసే వారసుల్లో వెన్నెల కిషోర్ ఒకడు’ అని అన్నారు. ఆ తర్వాత మాట్లాడుతూ ఇలా కిషోర్ పక్కన ఉండి, కిషోర్ గురించి మాట్లాడటం తనకు చాలా గర్వంగా ఉందని, ఎందుకంటే ఒకప్పుడు కిషోర్ తన డైరెక్టర్ అని చమత్కరించారు. ఆయన మాటలకు అక్కడ ఉన్నవారంత నవ్వులు పూయించారు.
ఇదే ఈ వెంట్ లో వెన్నెల కిషోర్ మాట్లాడుతూ.. బ్రహ్మానందం గారితో నటించడం ఆనందంగా ఉందన్నారు. బ్రహ్మానందం వంటి మంచి సినిమాలో తనకు నటించే అవకాశం ఇచ్చిన నిర్మాతలు, డైరెక్టర్ కి థ్యాంక్స్ చెప్పారు. ‘అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకు చూస్తే చాలు.. ఈ సినిమా ఎలా ఉంటుందో చెప్పడానికి బ్రహ్మానందం అనే టైటిల్ చాలు. బ్రహ్మానందం అంటేనే కింగ్ ఆఫ్ కామెడీ, ఆయనతో షూటింగ్ అంటే చాలా సరదాగా ఉంటుందన్నారు. ఇక ఇండస్ట్రీ తనకు చాలా ఇచ్చిందని, రాహుల్ రవీంద్రన్, రాజా గౌతమ్ తనని ఎప్పుడూ ఇన్ స్పైర్ చేస్తూనే ఉన్నారన్నారు. ఈ సినిమాలో తన కామెడీ ప్రేక్షకుల నచ్చితే ఆ క్రెడిట్ రాహుల్, నిఖిల్ దే అని చెప్పుకొచ్చారు.
Also Read : సైఫ్ అలీ ఖాన్ ఫిట్నెస్, డైట్ టిప్స్.. యాభై దాటిన ఫిట్‌గా ఉండడానికి ఇవే రీజన్