రేవంత్ భీమల (Revanth Pavan Sai Subhash Bhimala)... తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లలో ఈ బుడ్డోడు చేస్తున్న సందడి మామూలుగా లేదు. విక్టరీ వెంకటేష్ (Venkatesh) కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన హ్యాట్రిక్ హిట్ 'సంక్రాంతికి వస్తున్నాం' విడుదల తర్వాత రేవంత్ పాపులర్ అయ్యాడు. ఆడియన్స్ అందరూ అతని నటన గురించి గొప్పగా చెబుతున్నారు. ఏపీ ఎన్నికల్లో ఈ రేవంత్ ప్రచారం చేశాడని తెలుసా?
సైకిల్ గుర్తుకు, గాజు గ్లాసుకు ఓటు వేయండి...
ఇంటింటికి తిరిగి ప్రచారం చేసిన రేవంత్ భీమల!
ఇప్పుడు రేవంత్ భీమల (Revanth Bhimala) గురించి తెలుగు ప్రేక్షకులు చాలామందికి తెలుసు. ఇక 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా చూసిన జనాలు అయితే అతడికి అభిమానాలు అయిపోయారు. అయితే... రేవంత్ ఎవరి అభిమాని అనేది తెలుసా? రాజకీయ పరంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమికి!
ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్, జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసుకు ఓటు వేయమని ఇంటింటికీ తిరుగుతూ రేవంత్ భీమల ప్రచారం చేశాడు. సోషల్ మీడియాలోని తన అకౌంట్లలో ఆ వీడియో షేర్ చేశాడు. అయితే... ఇప్పుడు ఆ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.
బుల్లి రాజుగా అదరగొట్టిన రేవంత్ భీమల!
వెంకటేష్ కామెడీ కోసం థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు, దగ్గుబాటి అభిమానులు అందరూ థియేటర్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు రేవంత్ అభిమానిగా కూడా మారిపోయారు. ఆ స్థాయిలో బుల్లి రాజు పాత్రలో రేవంత్ అదరగొట్టాడు.
Also Read: 'సంక్రాంతికి వస్తున్నాం'పై మహేష్ బాబు రివ్యూ... పెద్దోడి సినిమా గురించి చిన్నోడు ఏమన్నాడంటే?
తండ్రిని ఎవరైనా చులకన చేసి మాట్లాడినా... లేదంటే తక్కువ చేసి తిట్టినా... కోపంతో ఊగిపోయి తిట్ల దండకం అందుకునే చిన్నారి ముదురు పాత్రలో రేవంత్ బీమల నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఊరి జనాలందరూ కలిసి ఇంటికి వచ్చినప్పుడు బుల్లి రాజు ఫైర్ కావడం గానీ, అదే విధంగా AV అంటే ఏమిటి? అంటూ నూకరాజును అడిగే సీన్ గానీ... ఒక్కటి ఏమిటి? బుల్లి రాజు చేసిన ప్రతి సీన్ థియేటర్లలో టెన్ థౌజండ్ వాలా కంటే గట్టిగా పేలింది.
'సంక్రాంతికి వస్తున్నాం' విజయం తర్వాత మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ఓ సినిమా చేసేందుకు దర్శకుడు అనిల్ రావిపూడి రెడీ అవుతున్నారు. అందులోనూ రేవంత్ భీమలకు ఒక క్యారెక్టర్ ఉంటుందని ప్రచారం మొదలైంది. అన్నట్టు ఈ బుడ్డోడు పేరు రేవంత్ పవన్ సాయి సుభాష్ భీమల.