సంక్రాంతి సందర్భంగా విడుదలైన సినిమాలలో సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న మొదటి సినిమాగా 'సంక్రాంతికి వస్తున్నాం' నిలబడింది. ఇప్పుడీ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) చూశారు. మరి సినిమాకు ఆయన ఇచ్చిన రివ్యూ ఏమిటో తెలుసా?
పక్కా పండుగ సినిమా... వెంకీ మామ టెర్రిఫిక్!
''సంక్రాంతికి వస్తున్నాం' సినిమా చూశా. ఎంజాయ్ చేశాను. పక్కా పండుగ సినిమా ఇది. వెంకటేష్ గారు అదరగొట్టేశారు అంతే. నా దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi)ని చూస్తే చాలా సంతోషంగానూ, గర్వంగానూ ఉంది. అతను వరుసుగా బ్లాక్ బస్టర్ సినిమాలు ఇస్తున్నాడు. హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి తమ తమ పాత్రల్లో సూపర్ గా చేశారు. బాల నటుడు బుల్లి రాజు తన నటనతో అదరగొట్టాడు. క్రికెట్ భాషలో చెప్పాలంటే ఆ చిన్నారి కొట్టిన సిక్సర్ గ్రౌండ్ అవతల పడింది. సినిమా యూనిట్ అందరికీ నా కంగ్రాట్యులేషన్స్'' అని మహేష్ బాబు ట్వీట్ చేశారు. ఆయనకు 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్ర బృందం థాంక్స్ చెప్పింది.
Also Read: కెరీర్‌లో ఒక్క ప్లాప్ కూడా చూడని బ్లాక్ బస్టర్ పొంగల్ డైరెక్టర్... అనిల్ రావిపూడి సక్సెస్ మంత్ర ఇదే
విక్టరీ వెంకటేష్, మహేష్ బాబు మధ్య మంచి అనుబంధం ఉంది. వాళ్ళిద్దరూ కలిసి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో నటించారు. చిన్నోడు - పెద్దోడుగా వాళ్ళిద్దరూ చేసిన సందడి తెలుగు ప్రేక్షకులు అంత త్వరగా ఎలా మరిచిపోతారు? ఆ సినిమాలో మాత్రమే కాదు... నిజ జీవితంలోనూ వాళ్ళిద్దరి మధ్య అంత అనుబంధం ఉంది కాబట్టి ఈ రోజు ఇలా పెద్దోడు సినిమా సక్సెస్ కావడంతో చిన్నోడు సంతోషం వ్యక్తం చేశాడు. అంతే కాదు... అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' సినిమా చేశారు. ఆ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. ఆ రెండు సినిమాలకు దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. మహేష్ హీరోగా నటించిన 'మహర్షి' సినిమాలోని దిల్ రాజు నిర్మాణ భాగస్వామ్యం ఉంది. అది సంగతి.