Top destinations for solo travelers in India : ఈ మధ్యకాలంలో జనాలు ప్రశాంతత కోసం ట్రిప్స్​కి వెళ్తున్నారు. కుదిరితే ఫ్యామిలీ, ఫ్రెండ్స్​తో వెళ్తారు. కానీ వారు ఎవరూ రాకపోయినా సోలోగా ట్రిప్​కి వెళ్లాలనేది న్యూ ఇయర్ విష్​లలో ఒకటిగా మారిపోయింది. మీరు కూడా ఇలా జర్నీ చేయాలనుకుంటే.. ఇండియాలో ఏవి ప్రాంతాలు సోలో ట్రిప్​కి అనువైనవో? అక్కడ ఎలాంటి ఎక్స్​పీరియన్స్​ పొందొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 


సంస్కృతి గురించి తెలుసుకోవాలన్నా.. ప్రకృతిని ఆస్వాదించాలన్నా.. కొత్త పరిచయాలు, కొత్త అనుభవాలు అన్ని ట్రావెల్​తో వస్తాయి. సెల్ఫ్ డిస్కవరీ, అడ్వెంచర్స్, ఆధ్యాత్మిక ప్రయాణాలు చేయాలనుకునేవారికి ఇండియాలో ఎన్నో బెస్ట్ ప్లేస్​లు ఉన్నాయి. సోలోగా ట్రిప్​కి వెళ్లాలనుకునేవారికి ఇవి అనువైనవి. ఇంతకీ ఆప్రాంతాలు ఏంటంటే.. 


హంపి (అడ్వెంచర్స్​ కోసం) Hampi


అడ్వెంచర్స్, ఫ్రీడమ్ వంటి ఫీల్​ని పొందాలనుకుంటే మీరు హంపి ట్రై చేయవచ్చు. కర్ణాటకలోని విజయనగర జిల్లాలో ఇది ఉంది. హైదరాబాద్​ నుంచి 8 గంటల జర్నీలో మీరు ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. ఇక్కడ బ్యాక్​ప్యాకర్ కమ్యూనిటీ మీకు అడ్వెంచర్, స్వేచ్ఛ వంటి అనుభవాన్ని ఇస్తుంది. పైగా ఈ ప్రాంతం సోలో ట్రిప్​కి వెళ్లాలనుకునేవారికి అనువైనది. 


కసోల్ (ట్రెక్కింగ్​కి బెస్ట్) Kasol


హిమాచల్ ప్రదేశ్​లోని కుల్లూలోని కసోల్ సోల్ ట్రిప్​కి అనువైనది. ఇక్కడికి చాలామంది సోలో హైకర్స్, ట్రెక్కెర్స్​ వస్తారు. ఈ ప్రాంతం ట్రెక్కింగ్​కు అనువైనది. అంతేకాకుండా ప్రశాంతమైన వాతావరణం మీకు హాయిని, ప్రశాంతతను అందిస్తుంది. 


పాండిచ్చేరి (Pondicherry)


పాండిచ్చేరి సోలో ట్రావెల్ చేసేవారికి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఎక్స్​పీరియన్స్ ఇస్తుంది. ఇక్కడ మీరు ఫ్రెంచ్ స్ట్రీట్, పాండీ బీచ్​, మ్యూజియం వంటి ఎన్నో ప్లేస్​లు చూడొచ్చు. నచ్చిన వాటర్ గేమ్స్ ఆడుకోవచ్చు. హైదరాబాద్​ నుంచి తక్కువ బడ్జెట్​లో ఎలా ట్రావెల్ చేయొచ్చో.. దాని పూర్తి డిటైల్స్ ఏంటో తెలుసుకోవాలంటే.. ఈ కింద లింక్​ ఓపెన్ చేసి చెక్ చేయవచ్చు. 


Also Read : హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే


వర్కలా (Varkala)


బీచ్​లంటే ఇష్టముంటే మీకు కేరళలోని వర్కలా బీచ్ బెస్ట్ ఆప్షన్. అరెబియా సముద్రం, బ్యూటీఫుల్ లొకేషన్లు, ఆయుర్వేద చికిత్సలు మీకు మంచి రిలీఫ్​ని ఇస్తాయి. ప్రశాంతంతను కోరుకునేవారికి ఇది కచ్చితంగా బెస్ట్ ఎక్స్​పీరియన్స్ ఇస్తుంది. 


మనాలి (థ్రిల్ విత్ చిల్) Manali


థ్రిల్లింగ్ ఎక్స్​పీరియన్స్, కొత్త సంస్కృతిని ఎక్స్​ప్లోర్ చేయడం, చల్లని వాతావరణంతో కూడిన ఎక్స్​పీరియన్స్​ని సొంతం చేసుకోవాలనుకుంటే మనాలికి వెళ్లొచ్చు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో వెళ్లినా.. సోలోగా వెళ్లినా మీరు బ్యూటీఫుల్ ఎక్స్​పీరియన్స్​తో రిటర్న్ అవుతారు. 


Also Read : అమ్మాయిలు సోలోగా ట్రిప్​కి వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఇవి మీకోసమే


జైసల్మేర్ (అథెంటిక్ ఎక్స్​పీరియన్స్) Jaisalmer


రాజస్థాన్​లో జైసల్మేర్ మీకు అథెంటిక్ ఎక్స్​పీరియన్స్ ఇస్తుంది. అడ్వెంచర్స్​ అంటే ఇష్టముండి.. సోలోగా ట్రావెల్​ చేయాలనుకునేవారు ఇక్కడ ఎడారికి వెళ్లొచ్చు. ఒంటె సఫారీలు, స్థానిక సంస్కృతి మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. మరపురాని అథెంటిక్ ఎక్స్​పీరియన్స్ కోసం మీరు జైసల్మేర్ వెళ్లొచ్చు. 


వారణాసి (ఆధ్యాత్మికం) Varanasi


మీకు ఆధ్యాత్మికం, దేవుడు, పూజలపై ఆసక్తి ఉంటే వారణాసి సోలోగా వెళ్లొచ్చు. ఫ్యామిలీతో వెళ్లినా సోలోగా వెళ్లినా మీకు మంచి ఎక్స్​పీరియన్స్ సొంతమవుతుంది. గంగానది స్నానాలు, హారతులు మీకు మంచి ఆధ్యాత్మిక అనుభవాన్ని ఇస్తాయి. వారణాసి వెళ్లి వస్తే మీరు లైఫ్​ని చూసే దృక్పథం మారిపోతుందట. 


మరి ఇంకేమి ఆలస్యం మీరు కూడా ఈ ప్రదేశాలను 2025లో చుట్టేయండి. ప్రతి ప్రాంతం దేనికదే ప్రత్యేకం. అక్కడి వెళ్లి.. ఎక్స్​పీరియన్స్ చేస్తేనే దాని అందం, ఆనందం, ఆహ్లాదం తెలుస్తుంది. మీరు ఎక్స్​ప్లోర్ చేయాలనుకోవాలే గానీ.. ఏ ప్రాంతమైనా మీకు మంచి అనుభవాన్నే ఇస్తుంది. కొత్త సంవత్సరం ట్రావెల్ చేయడమే మీ లక్ష్యమైతే.. మీ దగ్గర్లోని ప్రాంతాలను కూడా సోలోగా విజిట్ చేయవచ్చు. 



Also Read : ఇండియాలోని బెస్ట్, బ్యూటీఫుల్ బీచ్​లు ఇవే.. న్యూ ఇయర్​ 2025లో ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ట్రిప్ ప్లాన్ చేసేసుకోండి