Solo Female Travel in India : కొందరికి ఇళ్లల్లో ఫ్రెండ్స్​తో ట్రిప్స్​ అంటేనే నో చెప్పేస్తారు. అలాంటిది సోలో ట్రిప్ అంటే ఇంక అంతే సంగతులు. కానీ ఒత్తిడికి బాయ్ చెప్పి.. ఒంటరిగా ఎటైనా సోలో ట్రిప్​కి వెళ్లాలనుకోవడం సహజమే. ఈ సోలో ట్రిప్స్ అబ్బాయిలకు కాస్త ఈజీనే. కానీ అమ్మాయిలు ఇలాంటి సోలో ట్రిప్స్​కి ప్లాన్​ చేసుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వీటివల్ల మీలో కాన్ఫిడెన్స్ పెరగడమే కాకుండా.. మీ ట్రిప్​లో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉంటాయి. ఇంతకీ సోలోగా ట్రావెల్ చేయాలనుకునే అమ్మాయిలు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో ఇప్పుడు చూసేద్దాం. 


ట్రిప్​కి వెళ్లేముందు..


ట్రిప్​కి వెళ్లేముందు కొన్ని అంశాల గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా మీరు వెళ్లాలనుకుంటున్న ప్రదేశం గురించి తెలుసుకోవాలి. అక్కడ మీరు ఎలాంటి డ్రెస్​లు వేసుకోవచ్చు లాంటివే కాకుండా.. అక్కడి చట్టాలు ఏంటి? అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అనేవి చెక్  చేసుకోవాలి. 


ముందే బుక్ చేసుకోవాలి.. 


అమ్మాయిలు సోలోగా ట్రావెల్ చేసేప్పుడు అప్పటికప్పుడు కాకుండా.. ట్రావెల్​ బుకింగ్స్​తో పాటు.. అక్కడ స్టే చేసేందుకు కూడా హోటల్స్​ ముందే బుక్ చేసుకోవాలి. లోకల్​గా తిరిగేందుకు కూడా ట్రాన్స్​పోర్ట్​ ఉండేలా చూసుకోవాలి. కుదిరితే వీటన్నింటిని అందించే ప్యాకేజ్​లు ఉంటాయి. వాటిని కూడా ట్రై చేయవచ్చు. 


వాటిని షేర్ చేసుకుంటే.. 


మీరు ట్రిప్​కి వెళ్లే ముందు మీ ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్​తో మీరు వెళ్తోన్న ప్లేస్​ గురించి.. మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయవచ్చో.. స్టే చేస్తున్న హోటల్స్ గురించిన ఇన్​ఫర్మేషన్​ షేర్ చేసుకోవాలి. మీరు బయటకు వెళ్లేప్పుడు లైవ్ లొకేషన్ వంటివి షేర్ చేసుకుంటే మంచిది. 


తీసుకోవాల్సిన జాగ్రత్తలు


సోలోగా ట్రావెల్ చేసేప్పుడు కంఫర్ట్​బుల్​గా ఉండే డ్రెస్​లు ఎంచుకోవాలి. ఫోన్​లో మునిగిపోకుండా.. చుట్టు పరిసరాలను అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మిమ్మల్ని డైవర్ట్ చేసే వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది. హోటల్స్​ని బుక్ చేసుకునే ముందు అవి సేఫ్టీనా కాదో చూసుకోవాలి. గోల్డ్, మనీ వంటివాటిని లాకర్స్​లో పెట్టుకోవాలి. ఒంటరిగా రాత్రుళ్లు ప్రయాణం చేయకపోవడమే మంచిది. చేయాల్సి వస్తే మీకు సేఫ్టీ అనిపించే వాటిలోనే ప్రయాణం చేయండి. మీ వారికి కనెక్ట్ అయి ఉండేలా లోకల్ సిమ్స్, పోర్టబుల్ వైఫై హాట్ స్పాట్స్, పవర్ బ్యాంక్స్ ఉండేలా చూసుకోవాలి. 


ఇండియాలో ట్రావెల్ చేయాలనుకుంటే.. 


మీరు ఇండియాలోని కొన్ని ప్రాంతాలకు వెళ్లేప్పుడు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. ఢిల్లీలోని ఛాందిని చౌక్ వంటి ప్రదేశాల్లో వెళ్లేప్పుడు జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాటికి వెళ్లినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముంబైలోని నిర్మానుష్య ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లకపోవడమే మంచిది. రాజస్థాన్​లో టూరిజం పేరుతో ఎక్కువ స్కామ్​లు జరుగుతాయి. నార్త్ ఈస్ట్​లో ట్రావెల్ చేసేప్పుడు అక్కడ గొడవలు, అల్లర్లు ఏమైనా జరుగుతున్నాయో తెలుసుకోవాలి. ఏ ప్రాంతానికి వెళ్లిన అపరిచితులతో మాట్లాడేప్పుడు జాగ్రత్తగా ఉండాలి.


ఈ విషయాలపై ఫోకస్ చేయండి.. 


బేసిక్ హిందీ అనేది ఇండియాలో ట్రావెల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. లోకల్ కల్చర్​ గురించి తెలుసుకోండి. మీ దగ్గర పెప్పర్ స్ప్రే ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోండి. పీరియడ్ సైకిల్పై దృష్టి పెట్టాలి. లోకల్ డ్రెస్​ కోడ్​ని ఫాలో అయితే మంచిది. స్కిన్ రివిలీంగ్ లేకుండా చూసుకోవడమే మంచిది. హైడ్రెటెడ్​గా ఉండాలి. సన్ స్క్రీన్​ని కూడా ఉపయోగించాలి. 


Also Read : బడ్జెట్ ఫ్రెండ్లీ గోవా ట్రిప్.. క్రిస్మస్ సమయంలో వెళ్తే మరీ మంచిది.. ఎందుకంటే?


ఇండియన్ గవర్నమెంట్ టూరిస్ట్ హెల్ప్ లైన్ నెంబర్ 1363, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ హెల్ప్ లైన్ 011-23237166 నెంబర్లు, పోలీస్​ నెంబర్లు ఫోన్​లో ఉండేలా చూసుకోండి. సోలో ట్రిప్​కి వెళ్లాలనుకునే అమ్మాయిలు సోలో ఫిమేల్ ట్రావెలర్ కమ్యూనిటీల్లో చేరవచ్చు. 



Also Read : మెడిటేషన్​తో బరువు కూడా తగ్గొచ్చట.. కానీ ఈ టిప్స్ ఫాలో అయితే ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉంటాయట