Meditation for Weight loss : మెడిటేషన్ అనేది మన మెదడును.. శరీరాన్ని కనెక్ట్ చేసే.. ఓ అద్భుతమైన ప్రక్రియ. ఇది ఒత్తిడిని తగ్గించడం.. కాన్సంట్రేషన్ని పెంచడం వంటివి చేస్తుంది. అయితే ఎక్కువమందికి తెలియని విషయం ఏంటంటే.. మెడిటేషన్‌తో కూడా బరువు తగ్గొచ్చట. అయితే బరువు తగ్గాలి అనుకున్నప్పుడు కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవ్వాలి. అప్పుడే రిజల్ట్స్ ఎఫెక్టివ్‌గా ఉంటాయంటున్నారు. ఇంతకీ ఆ టెక్నిక్స్ ఏంటి? మెడిటేషన్‌తో నిజంగానే బరువు తగ్గొచ్చా? మెడిటేషన్‌కి వెయిట్ లాస్కి ఉన్న లింక్ ఏంటి వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం.
కూర్చొన్న ప్లేస్లోనే.. కళ్లు మూసుకుని.. బరువును తగ్గించే సత్తా మెడిటేషన్కే ఉంది. బయటకు వెళ్లే అవకాశం లేనివారికి.. వర్క్‌లో బిజీగా ఉండేవారికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అయితే మెడిటేషన్ చేసేప్పుడు కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలు.. కచ్చితంగా బరువు తగ్గొచ్చని చెప్తున్నారు నిపుణులు. ఇది మీరు హెల్తీ లైఫ్‌ని లీడ్ చేయడానికి హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు. మరి ఎలా మెడిటేట్ చేస్తే బరువు తగ్గొచ్చో.. మెడిటేషన్‌తో బరువును తగ్గించే టిప్స్ ఏంటో చూసేద్దాం.
బరువు తగ్గేందుకు ఇలా మేడిటేషన్ చేయాలి..
మిమ్మల్ని డిస్టర్బ్ చేసే వాతావరణం లేకుండా చూసుకోవాలి. ఇంట్లో మీరు ప్రశాంతంగా ఉండగలిగే రూమ్ ఎంచుకోవాలి. లేదంటే పార్క్, మెడిటేషన్ స్టూడియోలను కూడా మీరు ఎంచుకోవచ్చు. కంఫర్ట్బుల్ పొజిషన్లో కూర్చోవాలి. మీ నడుమును వంచేయకుండా స్ట్రైయిట్‌గా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల శరీరంపై ఒత్తిడి పెరగదు. ఈ పొజిషన్లో ఉన్న తర్వాత.. ముక్కు ద్వారా.. స్లోగా డీప్ బ్రీత్లు తీసుకోవాలి. ఇప్పుడు స్లోగా నోటి ద్వారా బ్రీత్‌ని వదలాలి. శ్వాసపై ధ్యాస ఉంచాలి.
బ్రీత్ మీ శరీరంలోకి ఎలా వెళ్తుంది. శరీరం బయటకి ఎలా వెళ్తుందనే దానిపై ఫోకస్ చేయాలి. ఏమైనా ఆలోచనలు డిస్టర్బ్ చేస్తుంటే.. వాటిపైకి దృష్టి వెళ్లకుండా.. బ్రీత్పై ఫోకస్ చేస్తూ ఉండాలి. మీకు నచ్చిన ప్రదేశాన్ని.. నచ్చిన సన్నివేశాన్ని.. అందమైన ఫారెస్ట్, లేదా బీచ్‌ని దృష్టికి తెచ్చుకోవాలి. అక్కడ మీరు ఉన్నట్టు ఊహించుకోవాలి. ఇలా చేయడం వల్ల మీరు రిలాక్స్ అవుతారు.
మెడిటేషన్ స్టార్ట్ చేయాలనుకుంటే..
మెడిటేషన్‌ను ప్రారంభించాలనుకుంటే.. తక్కువ సమయం నుంచి.. ఎక్కువ సమయానికి వెళ్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మీరు మెడిటేషన్లో కంఫర్ట్‌బుల్‌గా ఉంటారు. రోజుకు కనీసం పది నుంచి 20 నిమిషాలు మెడిటేషన్లో ఉండేలా చూసుకోండి. ఏమి తింటున్నారు? ఏమి పని చేస్తున్నారనే దానిపై దృష్టి పెట్టండి. ఇలా చేయడం వల్ల మీరు శారీరకంగా, మానసికంగా హెల్తీగా ఉంటారు.
ఒత్తిడిని తగ్గించి..
శరీరంలో ఒత్తిడి ఎక్కువైనప్పుడు.. అవి శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని పెంచుతాయి. ఇవి బెల్లీ ఫ్యాట్‌ని పెరిగేలా చేస్తాయి. దీనివల్ల బరువు ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. అయితే మెడిటేషన్‌తో ఒత్తిడి దూరమవుతుంది. ఒత్తిడి ఎక్కువగా తీసుకునేవారు బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పలు అధ్యయనాలు ఇప్పటికే తెలిపాయి.
అలాగే ఒత్తిడిని తగ్గించుకోకుండా ఎంత కష్టపడినా.. బరువు తగ్గడం కష్టంగా ఉంటుంది. మెడిటేషన్ వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఇది శరీరంలో చెడు కొవ్వు పేరుకుపోకుండా హెల్ప్ చేస్తుంది. పైగా స్ట్రెస్ ఎక్కువగా ఉండేవారు ఎక్కువగా ఫుడ్స్ తింటూ ఉంటారు. ఇవి కూడా బరువు పెరిగేలా చేస్తాయి. మేడిటేషన్ అన్ హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్‌ని దూరం చేస్తుంది.
మైండ్‌ఫుల్‌నెస్..
శరీరానికి ఏమి ఇవ్వాలి.. ఏమి ఇవ్వకూడదనే విషయాన్ని మెడిటేషన్ ఆలోచించేలా చేస్తుంది. చాలామంది తాము తీసుకునే ఫుడ్‌పై అస్సలు దృష్టి పెట్టరు. సమయానికి ఏది దొరికితే అది తినేస్తారు. అలా దొరికే ఫుడ్స్ వల్ల క్రేవింగ్స్ ఎక్కువ అవుతాయి. ఇది మీరు అన్ హెల్తీ లైఫ్‌ని లీడ్ చేసేలా చేస్తాయి. ఒబెసిటీ, బరువు వంటి సమస్యలను పెంచుతాయి. కానీ మెడిటేషన్ వల్ల మీరు శరీరానికి ఏమి ఇవ్వాలి. ఏమి ఇవ్వకూడదనేది తెలుస్తుంది. దీనివల్ల ఫుడ్ కంట్రోల్ అవుతుంది బరువు తగ్గుతారు.
నిద్రను మెరుగుపరిచి..
సరైన నిద్ర లేకుంటే బరువు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కేవలం బరువే కాకుండా ఇతర ప్రాణాంతక సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. కనీసం రోజుకు 8 గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి. ఈ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అయిన వాళ్లు రోజూ మెడిటేషన్ చేస్తే.. మెరుగైన నిద్ర వారి సొంతమవుతుంది. దీనివల్ల బరువు పెరగరు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. నిద్రలో బాడీ రీసెట్ అయ్యి.. మిమ్మల్ని హెల్తీగా ఉండేలా చేస్తుంది. మెడిటేషన్‌తో ఒత్తిడి, యాంగ్జైటీ కూడా తగ్గుతుంది కాబట్టి మెరుగైన నిద్ర మీ సొంతమవుతుంది.
ఆ విషయంలో..
చాలామందికి బరువు తగ్గాలని ఉన్నా.. సరైన మోటీవేషన్ లేక ఆ ఆలోచనను విరమించుకుంటారు. కానీ మెడిటేషన్ మిమ్మల్ని బరువు తగ్గాలనే లక్ష్యంపై దృష్టి పెట్టేలా చేస్తుంది. మీరు చేయాలనుకునే వాటిపై ఫోకస్ చేయగలుగుతారు. ఎలాంటి డిస్ట్రాక్షన్స్ ఉండవు. జిమ్‌కి వెళ్లేందుకు మీకు వేరే మోటీవేషన్ అవసరం ఉండదు. మీరే.. రెగ్యూలర్‌గా బరువు తగ్గడంపై దృష్టి పెట్టగలుగుతారు.
ఇవే కాకుండా మెడిటేషన్ గట్ హెల్త్‌ని కూడా ప్రమోట్ చేస్తుంది. దీనివల్ల తీసుకున్న ఆహారం జీర్ణమై.. శరీరంలో కొలెస్ట్రాల్‌గా పేరుకుపోకుండా ఉంటుంది. ఇవన్నీ బరువు తగ్గేలా శరీరాన్ని ప్రోత్సాహిస్తాయి.
Also Read : ఈ సర్జరీతో మగవారు ఆడవారిగా, ఆడవారు మగవారిగా మారొచ్చట.. లింగమార్పిడితో జరిగే మార్పులు, సైడ్ ఎఫెక్ట్లు ఇవే