HRT (Hormone Replacement Therapy) Surgery : మగవారు ఆడవారుగా మారడాన్ని.. ఆడవారు మగవారిగా మారడాన్ని లింగమార్పిడి విధానం అంటారు. హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ సర్జరీ ద్వారా ఈ లింగమార్పిడి అనేది జరుగుతుంది. దీనినే జెండర్ కన్ఫర్మేషన్ సర్జరీ (Gender Confirmation Surgery) అని కూడా అంటారు. దీని ద్వారా ఓ జెండర్ నుంచి మరో జెండర్‌కి మారిపోతుంటారు. అసలు ఈ సర్జరీ ప్రాసెస్ ఏంటి? ఫిజికల్‌గా జరిగే మార్పులేంటి? సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయా? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వివిధ కారణాల వల్ల కొందరు తమ జెండర్‌ని మార్చుకోవాలనుకుంటారు. తమ శరీరంలో జరిగే మార్పులను గుర్తించి.. మగవారు ఆడవారిగా.. ఆడవారు మగవారిగా మారుతూ ఉంటారు. అయితే ఈ సమయంలో హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ చేయించుకుని.. లింగమార్పిడి చేసుకుంటారు. అయితే ఈ సర్జరీ అనుకున్నంత సులభమేమి కాదట. దానిని చేయించుకునే ముందు.. చేయించుకున్న తర్వాత కూడా కొన్ని ఫాలో అవ్వాలి అంటున్నారు. అలాగే దాని వల్ల కొన్ని ప్రాణాంతకమైన సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయట. ఇంతకీ ఈ సర్జరీ ప్రాసెస్ ఏంటి?
హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ..
ముఖ్యంగా శరీరంలో విడుదలయ్యే కొన్ని హార్మోన్లలో మార్పులు చేస్తారు. మగవారు ఆడవారిగా మారాలనుకుని చేయించుకునే సర్జరీలో ఈస్ట్రోజన్ని రిప్లేస్మెంట్ చేస్తారు. టెస్టోస్టిరాన్ విడుదల కాకుండా బ్లాక్ చేస్తారు. ఫీమేల్ నుంచి మేల్‌గా మారేవారిలో టెస్టోస్టిరాన్‌ను రిప్లేస్ చేస్తారు. యాంటీ ఈస్ట్రోజెన్స్ ఇస్తారు. దీనివల్ల ఈస్ట్రోజన్ విడుదల కాకుండా ఉంటుంది.
సర్జరీల్లో రకాలు ఇవే
హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ సర్జరీలో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. వాటిలో ఒకటి మేల్ టూ ఫీమేల్ (Male-to-Female) ఉంటుంది. దీనిలో భాగంగా.. కృతిమ యోనిని క్రియేట్ చేస్తారు. బ్రెస్ట్ ఆగ్యూమెన్టేషన్ చేస్తారు. ముఖంలో ఆడవారి కళ ఉట్టిపడేలా సర్జరీ చేస్తారు. హెయిర్ ట్రాన్స్ప్లేంటేషన్ కూడా జరుగుతుంది. ఈ సర్జరీ వల్ల మగవారు పూర్తిగా అమ్మాయిగా మారుతారు.
రెండో రకం ఫీమేల్ టూ మేల్ (Female-to-Male) ఆడవారు మగవారిగా మారాలనుకుంటే కూడా ఈ సర్జరీ చేయించుకోవచ్చు. ఫాల్లోప్లాస్టీ ద్వారా కృత్రిమ అంగాన్ని క్రియేట్ చేస్తారు. మెటోడిప్లాస్టీ కూడా దీనిలో భాగమే. చెస్ట్ రీ కన్స్ట్రక్షన్ చేస్తారు. యూట్రస్ని తీసేస్తారు. ఈ సర్జరీ తర్వాత ఆడవారు పూర్తిగా మగవారిగా కనిపిస్తారు.
ఇవి పాస్ అయితే సర్జరీనే..
మానసికంగా దృఢంగా ఉన్నారో లేదో చెక్ చేస్తారు. హార్మోన్ థెరపీ ఇస్తారు. దాదాపు సంవత్సరం పాటు ఈ థెరపీ ఉంటుంది. కావాలనుకుంటున్న జెండర్ లైఫ్‌ని లీడ్ చేయాల్సి ఉంటుంది. మెడికల్ క్లియరెన్స్ కూడా ఉండాలి.
సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు
సర్జరీ తర్వాత హాస్పటల్లో ఉండేందుకు ప్రిపేర్ అవ్వాలి. నొప్పిని భరించగలిగాలి. గాయాలు మానేందుకు కేర్ తీసుకోవాలి. ఫిజికల్ థెరపీ కచ్చితంగా తీసుకోవాలి.
సైడ్ ఎఫెక్ట్స్ ఇవే
ఈ సర్జరీ చేయించుకుంటే కొన్ని రిస్క్‌లు, కాంప్లికేషన్స్ ఉంటాయి. బ్లీడింగ్ ఉంటుంది. ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. నరాల సమస్యలు. హార్మోనల్ మార్పులు. ఇలా కొన్ని సమస్యలు ఇబ్బంది పెడతాయి. అయితే ఇవి అందరిలోనూ ఉండకపోవచ్చు. సర్జరీ తర్వాత రికవరీ అయ్యేందుకు పూర్తి సమయం తీసుకోవాలి.
Also Read : సింగిల్‌గా ఉంటే మంచిదా? కాదా? దానివల్ల కలిగే నష్టాలు, లాభాలు ఇవే