Glass Skin Care Routine : ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా స్కిన్​ డల్​గా మారుతూ ఉంటుంది. ఇలా జరగడానికి వివిధ కారణాలు ఉంటాయి. కాలుష్యం, ఆరోగ్య సమస్యలు, డైట్​ ఇలా చాలా అంశాలు స్కిన్​ని ప్రభావితం చేస్తాయి. కొందరికి మాత్రం గ్లాస్​ స్కిన్ ఉంటుంది. కొరియన్స్ స్కిన్ కూడా ఇలాగే గ్లోయింగ్​గా, గ్లాస్​ స్కిన్​ ఉంటుంది. మరి వీరు చర్మం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఈ లుక్​ కోసం ఫాలో అవ్వాల్సిన బ్యూటీ టిప్స్ ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


గ్లాస్ స్కిన్ కావాలనుకుంటే కచ్చితంగా స్కిన్ కేర్ రోటీన్​ని ఫాలో అవ్వాలి. దీనితో పాటు.. హెల్తీ లైఫ్ స్టైల్, ఆరోగ్యకరమైన అలవాట్లు.. మరీ ముఖ్యంగా సహనం ఉండాలని చెప్తున్నారు నిపుణులు. ఎందుకంటే ఇది ఒక్కరోజులో వచ్చేది కాదు. మీరు రెగ్యూలర్​గా, ఎలాంటి కామ, ఫుల్ స్టాప్ లేకుండా పైన చెప్పిన సూచనలు ఫాలో అయితే గ్లాస్​ స్కిన్ మీ సొంతమవుతుంది. మరి ఎలాంటి స్కిన్​ కేర్ ఫాలో అవ్వాలి? ఎలాంటి టిప్స్​తో స్కిన్ గ్లాస్​ లుక్ ఇస్తుంది?


స్కిన్ కేర్ రోటీన్


చర్మాన్ని రెగ్యూలర్​గా క్లెన్స్ చేయాలి. ఆయిల్ బేస్డ్ క్లెన్సర్​ను, ఫోమ్ బేస్డ్ క్లెన్సర్​తో డబుల్ క్లెన్స్ చేయాలి. ఇది పగలు చేయడం వీలు కాకుంటే రాత్రుళ్లు అయినా ఫాలో అవ్వాలి. అలాగే స్కిన్​ ఎక్స్​ఫోలియేట్ చేస్తూ ఉండాలి. ఆల్ఫా హైడ్రోక్సీ యాసిడ్స్​ ఉండే ఎక్స్​ఫోలియేటర్​తో వారానికి మూడు సార్లు స్కిన్​ని శుభ్రం చేసుకోవాలి. ముఖం వాష్ చేసిన వెంటనే టోనర్​ని ఉపయోగించాలి. ఇది చర్మంలో pH వాల్యూ తగ్గకుండా చేస్తుంది. 


గ్లాస్ స్కిన్​ కోసం ఎసెన్స్​లు ఏమైనా ఉపయోగించవచ్చు. లేకుంటే టోనర్ తర్వాత సీరస్​ని ముఖానికి అప్లై చేయాలి. విటమిన్ సి, నియాసినమైడ్, రెటీనోల్ సీరమ్స్ స్కిన్​కి మంచి ప్రయోజనాలు అందిస్తాయి. స్కిన్​పై పింపుల్స్ ఉన్నప్పుడు విటమిన్ సి సీరమ్ అప్లై చేయకపోవడమే మంచిది. అలాగే సీరస్ అప్లై చేసిన తర్వాత మాయిశ్చరైజర్​ను రాయాలి. డ్రై స్కిన్ ఉన్నవారు ఈ స్టెప్​ని అస్సలు మిస్ చేయకూడదు. దీనివల్ల స్కిన్​ హైడ్రేటింగ్​గా మారుతుంది. సన్​స్క్రీన్​ని బయటకు వెళ్లినా.. వెళ్లకున్నా కచ్చితంగా అప్లై చేయాలి. SPF 30+ ఉండే సన్​స్క్రీన్​ మంచివి. 


కచ్చితంగా ఫాలో అవ్వాల్సిన టిప్స్


రోజుకు కచ్చితంగా 8 గ్లాసుల నీటిని తాగాలి. దీనివల్ల స్కిన్​ హైడ్రేటింగ్​గా ఉంటుంది. అలాగే రోజుకు 7 నుంచి 8 గంటల నిద్ర ఉండాలి. ఇది మంచి స్కిన్​ని ప్రమోట్ చేస్తుంది. యాంటీఆక్సిడెంట్లు ఉండే ఫుడ్స్​ని డైట్​లో కలిపి తీసుకోవాలి. బెర్రీలు, ఆకుకూరలు, నట్స్​ని డైట్​లో చేర్చుకోవాలి. ఇవి హెల్తీ స్కిన్​ని ప్రమోట్ చేస్తాయి. అలాగే రెగ్యూలర్​గా వ్యాయామం చేస్తే ముఖంలో గ్లో వస్తుంది. రక్తప్రసరణ మెరుగవ్వడం వల్ల స్కిన్​లో గ్లో వచ్చి గ్లాస్​ స్కిన్​ని ప్రమోట్ చేస్తుంది. 



ఒత్తిడి ఎక్కువగా తీసుకుంటే మీరు ఎంత మంచి రోటీన్​ను ఫాలో అయినా వేస్టే. కాబట్టి మెడిటేషన్, యోగ రెగ్యూలర్​గా చేస్తూ ఒత్తిడిని కంట్రోల్​లో ఉంచుకోవాలి. సల్ఫేట్స్, ఆర్టిఫీషియల్ ఫ్రాగ్రెన్స్​లు ఉండే వాటిని ఉపయోగించకపోవడమే మంచిది. చర్మానికి హాని కలిగించే ప్రొడెక్ట్స్​కి దూరంగా ఉండాలి. 


ఈ ప్రొడెక్ట్స్ ఎంచుకోండి..


మీరు ఉపయోగించే బ్యూటీ ప్రొడెక్ట్స్​లో హైల్యూరోనిక్ యాసిడ్ ఉండేలా చూసుకోవాలి. ఇది చర్మాన్ని హైడ్రేటె చేస్తుంది. నియాసినిమైడ్ చర్మాన్ని బ్రైట్​గా చేసి.. చర్మానికి మృదుత్వాన్ని ఇస్తుంది. విటిమిన్ సి యాంటీ ఆక్సిడెంట్​గా వర్క్ చేస్తుంది. కొల్లాజెన్​ ఉత్పత్తిని పెంచుతుంది. రెటినోల్ వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. గ్లిజరిన్ కూడా స్కిన్​ని హైడ్రేట్ చేస్తుంది. 



ఇవన్నీ ఫాలో అవుతూ ఉంటే గ్లాస్​ స్కిన్​ మీకు వస్తుంది. అయితే ఇవి ఒక్కరోజులు జరిగిపోవు కాబట్టి ఓపికతో, సహనంగా వెయిట్ చేయాలి. అప్పుడే స్కిన్​ మంచిఫలితాలు ఇవ్వడం ప్రారంభిస్తుంది. 


Also Read : సెలబ్రెటీలు పవర్​లిఫ్టింగ్ చేసేది ఇందుకే.. బెనిఫిట్స్, ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే