సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) ఓ పాన్ వరల్డ్ మూవీ (SSMB29) తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. లొకేషన్స్ వేట జరుగుతోంది. అయితే... ఈ సినిమా బడ్జెట్, బిజినెస్ గురించి సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.


బడ్జెట్ వెయ్యి కోట్లు దాటుతుంది!
తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి అని చెప్పడంలో అసలు ఎటువంటి సందేహం అవసరం లేదు. తెలుగు బడ్జెట్ వంద కోట్ల రూపాయలు ఉన్న రోజుల్లో మూడు వందల కోట్లు పెట్టి 'బాహుబలి' తీశారు. 'ఆర్ఆర్ఆర్' బడ్జెట్ నాలుగు వందల కోట్లు దాటిందని టాక్. అఫ్ కోర్స్... ఆ సినిమాలు అదే స్థాయిలో, అంతకు మించి వసూళ్లు కూడా సాధించాయనుకోండి. ఇప్పుడు రాజమౌళి సినిమా అంటే ఎన్ని వందల కోట్లు అయినా సరే బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారు.


ప్రీ రిలీజ్ బిజినెస్ 2000 కోట్లు... మరి, కలెక్షన్స్?
మహేష్ బాబు హీరోగా రాజమౌళి తీసే సినిమా బడ్జెట్ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల బడ్జెట్లతో కంపేర్ చేస్తే హయ్యస్ట్ కాబోతుందని టాక్. సుమారు వెయ్యి కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో SSMB29 సినిమా తెరకెక్కుతోందని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 2000 కోట్లు... మరి, కలెక్షన్స్? ఎన్ని కోట్లు రావచ్చు?వెయ్యి కోట్ల రూపాయలతో నిర్మాణం అంటే ఆ స్థాయిలో బిజినెస్ జరుగుతుందా? అని కొందరికి సందేహం రావచ్చు. ఆ అనుమానాలకు తమ్మారెడ్డి ఫుల్ స్టాప్ పెట్టారు. మహేష్ - రాజమౌళి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రెండు వేల కోట్లు కావచ్చని ఆయన తెలిపారు. అది మినిమమ్ ప్రీ రిలీజ్ బిజినెస్ అని ఆ మూవీ టీం భావిస్తోందని చెప్పారు. 


Also Read: 'కంగువ' హిట్టైతే బన్నీది తప్పు... లేదంటే దేవి శ్రీ ప్రసాద్‌ది తప్పు - ఇండస్ట్రీలో లేటెస్ట్ డిస్కషన్



SSMB29 pre release business: తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ స్థాయిని 'బాహుబలి 2'తో రెండు వేల కోట్ల రూపాయలకు తీసుకు వెళ్లిన ఘనత ఎస్ఎస్ రాజమౌళిది. 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమాకు హాలీవుడ్ దర్శక నిర్మాతలతో పాటు అక్కడ ఆడియన్స్ నుంచి అప్లాజ్ వచ్చింది. అందువల్ల, రాజమౌళి - మహేష్ బాబు మూవీకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి సైతం కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ''ఎస్ఎస్ఎంఎం29 ప్రీ రిలీజ్ బిజినెస్ 2 వేల కోట్లు దాటొచ్చు. కలెక్షన్స్ అంతకు మించి ఎంతైనా రావచ్చు. మూడు నుంచి నాలుగు వేల కోట్ల వరకు వెళ్లొచ్చు. అది జరిగితే ఇండియన్ సినిమా హిస్టరీలో ఈ మూవీ పలు రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది'' అని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు.


మహేష్ బాబు, రాజమౌళి సినిమాను దుర్గా ఆర్ట్స్ పతాకం మీద కె.ఎల్. నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు. కొంత విరామం తర్వాత ఆయన చేస్తున్న చిత్రమిది. దీనికి విజయేంద్ర ప్రసాద్ కథా రచయిత.


Also Readఅల్లు అర్జున్‌కు వరుణ్ తేజ్ ఇన్ డైరెక్ట్ కౌంటర్ - 'మట్కా' ప్రీ రిలీజ్‌లో ఆ డైలాగ్ బన్నీకేనా?