కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన 'కంగువ' (Kanguva Release Date) గురువారం విడుదలకు రెడీ అయింది. ఇప్పటి వరకు వచ్చిన పాటలు, రెండు ట్రైలర్లు సినిమాపై అంచనాలు ఏర్పడేలా చేశాయి. మరి ముఖ్యంగా దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) అందించిన బాణీలు, ట్రైలర్లలో నేపథ్య సంగీతానికి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమా దేవి శ్రీ ప్రసాద్ ప్రతిభకు కొలమానం అవుతుందా? కంగువ బ్లాక్ బస్టర్ అయితే ఆ ఎఫెక్ట్ 'పుష్ప 2' (Pushpa 2 The Rule) మీద ఉంటుందా? అని ఇండస్ట్రీలో కూడా చర్చ మొదలైంది.
'కంగువ' రీ రికార్డింగ్ కోసం ఇండస్ట్రీ కూడా వెయిటింగ్!
'కంగువ'లో దేవి శ్రీ ప్రసాద్ రికార్డింగ్ ఎలా ఉంటుంది? ఆయన ఏ విధమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు? అని తెలుసుకోవడం కోసం అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అందుకు కారణం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా రూపొందుతున్న 'పుష్ప 2'.
'పుష్ప' సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా... 'పుష్ప 2' సినిమాకు వచ్చే సరికి ఆయనకు, చిత్ర బృందానికి మధ్య కొన్ని మనస్పర్థలు ఏర్పడ్డాయని ఇండస్ట్రీ గుసగుస. మరి ముఖ్యంగా అల్లు అర్జున్ - సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్ మధ్య సంథింగ్ ఏదో జరిగిందని చాలా మంది మనసులో ఉన్న సందేహం. హీరోకి, దర్శకుడికి, సంగీత దర్శకుడికి మధ్య చాలా సన్నిహిత సంబంధాలు సినిమాలకు అతీతమైన స్నేహం ఉంది. అయినా సరే... 'పుష్ప' సీక్వెల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించడానికి తమన్ వచ్చారు.
Also Read: అల్లు అర్జున్‌కు వరుణ్ తేజ్ ఇన్ డైరెక్ట్ కౌంటర్ - 'మట్కా' ప్రీ రిలీజ్‌లో ఆ డైలాగ్ బన్నీకేనా?
దేవి శ్రీ ప్రసాద్ అందించిన రికార్డింగ్ నచ్చకపోవడంతో మరొక సంగీత దర్శకుడు దగ్గరకు అల్లు అర్జున్, సుకుమార్ వెళ్లారని ఇండస్ట్రీలో గుసగుస వినబడుతుంది. ఇప్పుడు 'కంగువ' బ్లాక్ బస్టర్ సాధించడంతో పాటు మ్యూజిక్ పరంగా ఆడియన్స్ నుంచి అప్రిసియేషన్ అందుకుంటే... ఆ ఎఫెక్ట్ కచ్చితంగా 'పుష్ప 2' టీం మీద ఉంటుంది.
దేవి శ్రీ ప్రసాద్ మంచి మ్యూజిక్ అందించిన సరే వాళ్ళు తీసుకోలేదు అనే విమర్శ వినపడుతుంది. 'వన్ నేనొక్కడినే' సెకండ్ హాఫ్ రి రికార్డింగ్ దేవి శ్రీ ప్రసాద్ నాలుగు అంటే నాలుగు రోజుల్లో పూర్తి చేశారని తనతో సుకుమార్ చెప్పినట్లు స్వయంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక వీడియోలో చెప్పారు. అటువంటి దేవి శ్రీ ప్రసాద్ 'పుష్ప 2' సినిమాకు మ్యూజిక్ చేయలేరని అనుకోవడానికి లేదు. కచ్చితంగా గొడవ ఏదో కావడం వల్ల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించడానికి మరొకరిని తీసుకు వచ్చారని ఇండస్ట్రీలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇప్పుడు 'కంగువ' హిట్ అయితే, మ్యూజిక్ కూడా బావుంటే... అప్పుడు 'పుష్ప 2' నుంచి దేవి శ్రీని తీసేసి మరొక సంగీత దర్శకుడిని తెచ్చినందుకు బన్నీది తప్పు అవుతుందని, లేదంటే - 'కంగువ' మ్యూజిక్ ట్రోల్ అయితే అప్పుడు డీఎస్పీది తప్పు అవుతుందని ఇండస్ట్రీలో డిస్కషన్ జరుగుతోంది.
Also Read: గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్... బ్యాక్ స్టేజ్‌లో ఏం జరిగింది? ప్రోగ్రాం హైలైట్స్ ఏంటో తెలుసా?