Game Changer Teaser Launch Event Highlights: లక్నోలో 'గేమ్ ఛేంజర్' టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, నిర్మాత 'దిల్' రాజుతో పాటు హీరోయిన్లు కియారా అడ్వాణీ, అంజలి హాజరయ్యారు. ఆ ఈవెంట్ బ్యాక్ స్టేజిలో ఏం జరిగింది? ఆ కార్యక్రమంలో హైలైట్స్ ఏంటో తెలుసా?
- లక్నోలో టీజర్ లాంచ్ జరుపుకొన్న ఫస్ట్ తెలుగు సినిమా 'గేమ్ ఛేంజర్'. ఈవెంట్ కోసం శనివారం (నవంబర్ 9న) ఉదయం హైదరాబాద్ నుంచి 'దిల్' రాజు ఫ్యామిలీ (భార్య, పిల్లాడు), అంజలి లక్నో చేరుకున్నారు. రామ్ చరణ్ స్పెషల్ (ప్రైవేటు) ఫ్లైట్‌లో వచ్చారు. చెన్నై నుంచి ఎస్.జె. సూర్య, ముంబై నుంచి హీరోయిన్ కియారా అడ్వాణీ వచ్చారు.
- హైదరాబాద్ ఆర్‌టిసి క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్, సంధ్య థియేటర్లలో తరహాలో లక్నోలో ప్రతిభ థియేటర్ ఉంది. ఉత్తర ప్రదేశ్ సెక్రటేరియట్ పక్కనే ఉన్న ఆ థియేటర్‌లో టీజర్ లాంచ్ చేశారు.
- హైదరాబాద్ నుంచి కొంత మంది రామ్ చరణ్ ఫ్యాన్స్ 'గేమ్ ఛేంజర్' టీజర్ లాంచ్ ఈవెంట్ కోసం లక్నో వచ్చారు. అంతే కాదు... లక్నోలో సెటిలైన తెలుగు ఫ్యామిలీస్ కూడా ప్రతిభ థియేటర్ దగ్గరకు వచ్చాయి. అక్కడ అభిమానులు కొందరు 'గేమ్ ఛేంజర్' టీ షర్ట్స్ కోసం ఎగబడ్డారు. గ్లోబల్ స్టార్ నినాదాలతో ఆ థియేటర్ చుట్టుపక్కల దద్దరిల్లింది.
- 'గేమ్ ఛేంజర్' టీజర్ లాంచ్ ఈవెంట్‌లో అభిమానులు, ప్రేక్షకుల ముందుకు రామ్ చరణ్ ఎంట్రీ గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. అక్కడ ఒక బస్సు ఏర్పాటు చేశారు. దానికి వెనుక నుంచి స్టెప్స్ ఏర్పాటు చేశారు. ఆ బస్ మీదకు చరణ్ వచ్చిన తర్వాత ముందు ఉన్న పరదా తొలగించారు. హీరోయిన్ కియారా అడ్వాణీ, నిర్మాత దిల్ రాజు సైతం చరణ్ తర్వాత బస్సు మీదకు వెళ్లి ప్రేక్షకులకు అభివాదం చేశారు.
- రామ్ చరణ్ కంటే ముందు బస్సు దగ్గరకు చేరుకున్న కియారా అడ్వాణీ ఆ బస్ మీదకు వెళ్లడానికి ఏర్పాటు చేసిన మెట్లు చూసి షాక్ అయ్యారు. వెళ్లాలా? వద్దా? అని ఆలోచించారు. చివరకు ధైర్యం చేసి ఎక్కారు. దిగేటప్పుడు లాంగ్ ఫ్రాక్ ను దగ్గరకు తీసి పట్టుకుని కిందకు దిగారు.
- ప్రతిభ థియేటర్‌లో ముందు హిందీ వెర్షన్ టీజర్ ప్లే చేశారు. ఆ తర్వాత కాసేపటికి తెలుగు, తమిళ, తర్వాత మళ్లీ హిందీ టీజర్ ప్లే చేశారు. టీజర్ లాంచ్ సమయానికి అంజలి, సూర్య సైతం వేదిక దగ్గరకు చేరుకున్నారు. అంజలిని స్టేజి మీదకు యాంకర్ పిలవడం మర్చిపోతే రామ్ చరణ్ గుర్తు చేసి మరీ పిలిపించారు. పాన్ ఇండియా మీడియా అక్కడికి చేరుకుంది.
- టీజర్ ప్లే చేశాక... ప్రేక్షకుల నుంచి వచ్చిన క్రౌడ్ చూసిన రామ్ చరణ్, 'గేమ్ ఛేంజర్' విడుదల అయ్యాక నార్త్ ఇండియా అంతటా ఇదే సౌండ్ వస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. దర్శకుడు శంకర్ ను మిస్ అయ్యానని చెప్పారు.
- కియారా అడ్వాణీని 'షేర్షా' సినిమాలో డైలాగ్ చెప్పమని నార్త్ ఇండియా ఆడియన్స్ కొందరు అడగ్గా... 'గేమ్ చేంజర్' టీజర్ చివర్లో రామ్ చరణ్ చెప్పిన 'అయామ్ అన్ ప్రిడిక్టబుల్' డైలాగును మేనరిజంతో పాటు చెప్పారు. లక్నోలో ఓ హిందీ సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో 'గేమ్ ఛేంజర్' గురించి ఫోన్ వచ్చిందని, ఇప్పుడు సేమ్ సిటీలో టీజర్ లాంచ్ కావడం సంతోషంగా ఉందని కియారా అడ్వాణీ చెప్పారు.
- ఎస్.జే. సూర్య అయితే 'సరిపోదా శనివారం'లోని 'టాయలెట్స్ ఎక్కడ ఉన్నాయని వీడు నన్ను అడుగుతాడు ఏంటి సుధా' డైలాగ్ చెప్పారు. ఆడియన్స్ ఏమని అంటున్నారో ఆయనకు అర్థం కాలేదు. అప్పుడు రామ్ చరణ్ హెల్ప్ చేశారు.
Also Read: బాలీవుడ్ హీరోతో సమంత లిప్ లాక్... నెట్టింట వీడియో వైరల్