Unstoppable With NBK Season 4 Allu Arjun: నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే సీజన్ 4’కు అల్లు అర్జున్ గెస్ట్‌గా వచ్చారు. అల్లు అర్జున్ ఎపిసోడ్‌ను మొత్తం రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఫస్ట్ పార్ట్ నవంబర్ 15వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమ్ కానుంది. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను ఆహా రిలీజ్ చేసింది. ఈ ఎపిసోడ్‌కు అల్లు అర్జున్ తల్లి నిర్మల కూడా హాజరయ్యారు. ప్రోమోను మంచి ఫన్ ఎలిమెంట్స్‌తో నింపేశారు.
నేను కృష్ణుడ్ని... నువ్వు అర్జునుడివి...
ఇంట్రో అయ్యాక అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చిన వెంటనే బాలకృష్ణ ‘మనం రిలేటివ్స్ తెలుసా?’ అని అడుగుతారు. ఎలా సార్ అని అల్లు అర్జున్ అడగ్గానే... ‘నా పేరులో కృష్ణుడు ఉన్నాడు. అక్కడ అర్జునుడు ఉన్నాడు.’ అని బాలకృష్ణ అంటారు. వెంటనే అల్లు అర్జున్ ‘మీరు గీత ఇవ్వండి? నేను ఫాలో అయిపోతా.’ అంటారు. వెంటనే ‘నాకు పార్టీ ఇవ్వలేదేంటయ్యా...’ అని బాలకృష్ణ అడగ్గానే ‘మీ మాన్షన్‌లో మనం హౌస్ పార్టీ చేసుకుందాం సార్.’ అని అల్లు అర్జున్ షోలో నవ్వులు పూయించారు.
గురి చూసి కొట్టా...
తనకు నేషనల్ అవార్డు రావడంపై కూడా అల్లు అర్జున్ మాట్లాడారు. బెస్ట్ యాక్టర్ లిస్టు తీసినప్పుడు అక్కడ ఒక్క తెలుగు నటుడి పేరు కూడా లేదని, అది తన మనసులో బాగా ఉండిపోయిందని అన్నారు. అప్పుడే దాన్ని రౌండప్ చేసి కొట్టాలని ఫిక్స్ అయ్యానని తెలిపారు. ఆ తర్వాత మెగా స్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి చెప్పారు. ఆయన వీరి గురించి ఏమన్నారో ప్రోమోలో చూపించలేదు.
Read Also: ‘పుష్ప 2’ ఐటెమ్ సాంగ్ ఫోటో లీక్ - అల్లు అర్జున్ తో శ్రీలీల ఊరమాస్ స్టెప్పులు!
యాక్షనా... రొమాన్సా...
ఆ తర్వాత బాలకృష్ణ... బన్నీని మీకు యాక్షన్ ఇష్టమా... రొమాన్స్ ఇష్టమా... అని అడిగినప్పుడు అల్లు అర్జున్ ముందుకు వచ్చి ‘ఎవరూ వినట్లేదు కద సార్’ అని అడిగి ‘తొక్కలో యాక్షన్ సార్’ అనగానే ఆడిటోరియంలో నవ్వులు నిండాయి.
ఇది నాకే సర్‌ప్రైజ్...
ఆ తర్వాత అల్లు అర్జున్ తల్లి నిర్మల షోలో ఎంట్రీ ఇచ్చారు. ఆవిడ వచ్చి కూర్చోగానే అల్లు అర్జున్ ఇది నాకే సర్‌ప్రైజ్ అన్నారు. చిన్నప్పుడు అల్లు అర్జున్‌ని కొట్టారా అని బాలకృష్ణ ఆవిడని అడిగినప్పుడు మధ్యలోనే అల్లు అర్జున్ అందుకుని ‘ఒకటా... అసలు దేంతో కొట్టలేదని అడగాలి? అన్ని వెపన్స్‌తో ట్రైన్ అయి ఇలా సినిమాల్లో యాక్టింగ్ చేస్తున్నాం’ అన్నారు. వెంటనే బాలకృష్ణ ‘ఏ వెపన్ వల్ల నువ్వు మారావని అనుకోవచ్చు’ అడగ్గా.. ‘స్నేహా రెడ్డి అనే వెపన్ వల్ల’ అని అల్లు అర్జున్ జవాబిచ్చారు. ఇంకా ఈ ప్రోమోలో ఎన్నో ఇంట్రస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. ఈ ఎపిసోడ్ నవంబర్ 15వ తేదీన ఆహాలో స్ట్రీమ్ కానుంది.