Nindu Noorella Saavasam Serial Today Episode:  టిఫిన్‌ చేయడానికి కిందకు వచ్చిన పిల్లలు ఇడ్లీలు, చెట్నీ చూసి భయపడిపోతారు. అసలు ఇవి ఇడ్లీలేనా…? అసలు ఇది చట్నీ కాదు సాంబారు లాగా ఉందని సెటైర్లు వేస్తుంటే.. నిర్మల తిడుతుంది. ఇన్నాళ్లు భాగీ చేతి వంట తిని ఇప్పుడు నా చేతి వంట బాగాలేదని పేర్లు పెడుతున్నారా..? అంటుంది. దీంతో పిల్లలు వెంటనే స్కూల్‌ కు వెళ్ధామని మధ్యలో టిఫిన్‌ చేసి వెళ్దామని ప్లాన్‌ చేస్తారు. అమర్‌ రాగానే స్కూల్‌ కు టైం అవుతుందని మారాం చేస్తారు. దీంతో అమర్‌ రాథోడ్ ను పిలిచి పిల్లలను స్కూల్ లో వదిలేసిరా అని చెప్తాడు. అలాగేనని బయటకు వెళ్లగానే పిల్లలు మంచి టిఫిన్‌ సెంటర్‌ దగ్గర ఆపమని అడుగుతారు. సరేనని డైరెక్టుగా స్కూల్‌ కు తీసుకెళ్తాడు.


అంజు: రాథోడ్‌… నేను చెప్పానా.. స్కూల్ వచ్చే వరకు ఈ రాథోడ్ కారు అపడని.. నేను చెప్పానా..?


అమ్మ: రాథోడ్‌ నువ్వు ఇంత మోసం చేస్తావు అనుకోలేదు. నీవల్ల ఇవాళ మేము అంతా ఆకలితో ఉండాలి.


రాథోడ్‌ : పిల్లలు ఆగండి.. మిస్సమ్మ ఉండగా మిమ్మల్ని ఆకలితో ఉండనిస్తుందా..? అదే నేను ఉండగా మిమ్మల్ని ఆకలితో ఉండనిస్తానా..? మీరు లోపలికి వెళ్లి క్లాస్‌ రూంలో బ్యాగ్స్ పెట్టే లోపు నేను వెళ్లి టిఫిన్స్  పార్శిల్ తీసుకుని వస్తాను.


అనంద్‌: నువ్వు కనక టైం కి రాకపోతే..


ఆకాష్‌: వెళ్లేటప్పుడు మేము నలుగురం కలిసి నాలుగు లాంగ్వేజ్‌ ల్లో ఒక్కటే సినిమా చూపిస్తాము.


 అని పిల్లలు చెప్పగానే రాథోడ్ వెళ్లిపోతాడు. పోతూ పోతూ గేటు దగ్గర రామ్మూర్తికి సైగ చేసుకుంటూ వెళ్లిపోతాడు. స్కూల్ లోకి వచ్చిన రామ్మూర్తి టిఫిన్‌ బాక్స్‌ ఓపెన్‌ చేయడానికి ప్రత్నిస్తుంటాడు. చేతికి దెబ్బ తగిలించుకుంటాడు. పిల్లలు పరుగెత్తుకొస్తారు.


అమ్ము: తాతయ్యా ఏమైంది తాతయ్యా..


రామ్మూర్తి: బాక్స్‌ తీస్తుంటే వేలు నలిగింది.


ఆనంద్‌: చూసుకుని తీయాలి కదా..? అయినా మీకు రానప్పుడు ఎవరి సాయం అయినా తీసుకోవాలి కదా..?


రామ్మూర్తి : స్కూల్‌ లో ఈ ముసలోడికి ఎవరు సాయం చేస్తారు బాబు.


అని రామ్మూర్తి చెప్పగానే అమ్ము బాక్స్‌ ఓపెన్ చేస్తుంది. అందులో వెజిటేబుల్‌ ఉప్మా చూసి నా పేవరేట్‌ ఉప్మా అంటూ చెప్పగానే.. రామ్మూర్తి ఎవరి ఫేవరేట్‌ ఫుడ్‌ వాళ్లకు ఇస్తాడు. దీంతో అందరూ బాక్సులు ఓపెన్‌ చేసి ఆశగా చూస్తుంటారు. అంజలి వద్దని చెప్తున్నా.. ముగ్గురు కలిసి తింటుంటే అంజు కూడా తింటుంది. చాటు నుంచి చూసిన రాథోడ్‌ హ్యాపీగా ఫీలవుతాడు. తర్వాత రామ్మూర్తి భాగీకి ఫోన్‌ చేస్తాడు.


భాగీ: నాన్న పిల్లలు తిన్నారా…? టిఫిన్స్ నచ్చాయంటనా..? వాళ్లు ఎలా ఉన్నారు. రాత్రి బాగా పడుకున్నారటన.


రామ్మూర్తి: అమ్మా భాగీ నీ పిల్లలు చాలా బాగా ఉన్నారమ్మ. కడుపునిండా మనఃస్పూర్తిగా తిన్నారు. నీ లాగే వాళ్లు కూడా చాలా బెంగ పెట్టుకున్నారు అమ్మ. బయటకు చెప్పలేకపోతున్నారు కానీ ముఖంలో కనిపిస్తున్నాయి. అమ్మా.. నీ పిల్లలు తినేశారు అమ్మా.. నువ్వు రాత్రి కూడా తినలేదు. ఇప్పుడైనా తిను తల్లి.


అని రామ్మూర్తి చెప్పగానే భాగీ సరే అంటుంది. మరోవైపు  అమర్‌ గార్డెన్‌ లో కూర్చుని ఏదో భాగీ గురించి ఆలోచిస్తుంటాడు. ఆరు.. అమర్‌ నే గమనిస్తుంది.  


ఆరు: మిస్సమ్మ లేదని మా ఆయన బాగా బాధపడుతున్నట్టున్నారు. ఆయన అలా ఫీలవుతుంటే చూడలేకపోతున్నాను.


గుప్త: బాలిక..


ఆరు: ఏంటి గుప్త గారు ఇంట్లో ఎవరూ కనిపించడం లేదు.


గుప్త: అవును బాలిక ఆ బాలిక ఉన్నన్న రోజులు నువ్వు ఇంట్లోకి వెళ్లుటకు భయపడితివి ఇప్పుడు ఇంట్లో ఎవ్వరికి నువ్వు కనబడవు కదా..? ఇంకెందుకు ఇక్కడి నుంచి చూస్తున్నావు.


ఆరు: ఆవును కదా..? మిస్సమ్మ లేనప్పుడు నేను దర్జాగా ఇంట్లోకి వెళ్లొచ్చు కదా..? పదండి వెళ్దాం. మిస్సమ్మ వెళ్లిప్పటి నుంచి అత్తయ్య, మామయ్య చాలా బాధపడుతున్నారు. నేను వీళ్లను ఇలా చూడలేకపోతున్నాను.


గుప్త: అయితే వెళ్లి చక్కిలిగింతలు పెట్టు..


ఆరు: గుప్త గారు నాకు స్పర్శ శక్తి ఉంది కదా..? ఇప్పుడే నేను మా ఆయన రూంలోకి వెళ్లి డైరీలో దీనికంతటికి కారణం మనోహరి అని రాస్తాను.


అని పైకి వెళ్తుంటే గుప్త వెనకాలే వెళ్లి అలా రాయోద్దని చెప్తాడు. ఇంతలో అమర్‌ వస్తాడు. డల్లుగా కూర్చున్న శివరాం, నిర్మలను చూసి పైకి పిలిచి ఎందుకు మీరు ఇలా ఉన్నారు అని అడుగుతాడు. భాగీని ఇంటికి తీసుకురమ్మని నిర్మల గట్టిగా అడుగుతుంది. అది విన్న మనోహరి ఈ ముసలొళ్లకు ఏమైంది అని అనుకుంటుంది. పైన అమర్‌ సరేనని మిస్సమ్మను మీరే వెళ్లి తీసుకురండి అని చెప్తాడు. మేము కాదు నువ్వే వెళ్లి మాట్లాడి తీసుకురమ్మని చెప్తారు. ఇంతలో మనోహరి వచ్చి కిందపడిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!