Prema Entha Madhuram  Serial Today Episode:  కొత్త బిజినెస్‌ మొదలు పెట్టే ముందు గుడికి వెళ్తున్నామని పెద్దొడు, చిన్నొడు చెప్పగానే  పాండు గుడికి వెళితే ఏమొస్తుందని ఇప్పుడు మీరు మీ అన్నయ్య దగ్గరకు వెళ్లండని మీ పొజిషన్‌, దర్జా చూపండి అంటాడు. దీంతో చిన్నోడు ఇప్పుడు ఎలా వెళ్లగలం అంటాడు. పెద్దొడు మాత్రం వెల్లాల్సిందేనని చెప్తాడు. దీంతో ఇద్దరూ కలిసి శంకర్ దగ్గరకు వెళ్తారు. యాదగిరి ఇంట్లో బాధపడుతూ అభయ్‌ మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. రవి రూంలో ఆలోచిస్తుంటాడు. ఇంతలో ముగ్గురు వ్యక్తులు వచ్చి ఈ ఇల్లు ఖాళీ చేసి సిఫ్ట్‌ చేయడానికి వచ్చామని యాదగిరి గారే చెప్పారని అంటాడరు. దీంతో జ్యోతి కోపంగా లోపలికి వెళ్తుంది. యాదగిరి జ్యోతిని తిడతాడు. వీడు చేసిన పనికి నన్ను చాలా చీఫ్‌గా చూస్తున్నాడు. అనగానే రవి వచ్చి నేను ఎలాంటి ఆలోచన చేయలేదు అంటాడు. రవిని యాదగిరి తిడతాడు. మరోవైపు జెండే ఆకాంక్ష దగ్గర కూర్చుని ఉంటాడు.


అకి: నిజంగా నేను ఏ తప్పు చేయలేదు ఫ్రెండ్‌. రవి కూడా ఎప్పుడు తన లిమిట్స్‌ క్రాస్‌ చేయలేదు.


జెండే: అకి నువ్వు నాకు చెప్తున్నావా..?  నా స్నేహితుడి కూతురు ఎప్పుడూ తప్పు చేయదు. ఎందుకంటే నీలో ప్రవహిస్తుంది ఆర్యవర్తన్‌ రక్తం కాబట్టి. రవి గురించి కూడా  నాకు తెలుసు అకి.



మరోవైపు


అభయ్‌: అకి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది రాకేష్‌. ప్రాణం మీదకు వచ్చినా తప్పు చేయదు. అంతా ఆ రవి వల్లే


రాకేష్‌: వీడేంటి.. మెల్ట్‌ అవుతున్నాడా..? ( అని మనసులో అనుకుంటాడు.) అకి మంచిదే ఆ రవిని నమ్మడమే తన తప్పు.


అకి: అన్నయ్య నా మాట వినిపించుకోకుండా రవిని చాలా ఇన్సల్ట్‌ చేశాడు.


జెండే: ఇందులో అభయ్‌ తప్పు కూడా లేదులే అకి.


రాకేష్‌: కరెక్టు ఒక అన్నయ్యగా నువ్వు చేసింది తప్పు కాదు.


అభయ్‌: లేదు రాకేస్‌ వెంటనే అకికి సారీ చెప్పాలి.


రాకేష్‌: వీడేంటి సారీ చెప్పాలనుకుంటున్నాడు ( అని మనసులో అనుకుని) ఇప్పుడే వద్దులే అభయ్‌. తప్పు నువ్వు ఒప్పుకున్నట్లు అవుతుంది.


అభయ్: అకితో నాకు ఇగోలు ఎందుకు రాకేష్‌. దూరం పెంచుకుంటే పెరుగుతూనే ఉంటుంది.


అకి: నాకు అన్నయ్య మీద కోపం లేదు ఫ్రెండ్‌. తన మనసులో ఎలాంటి అనుమానాలు ఉంచుకోడు కదా.. నేను ఇప్పుడే వెళ్లి అన్నయ్యతో మాట్లాడతాను.


అని అకి కిందకు వస్తుంది. అభయ్‌కి సారీ చెప్తుంది. అభయ్‌ ఎమోషనల్ అవుతాడు. అకికి తిరిగి సారీ చెప్తాడు. దీంతో ఇద్దరూ కలిసిపోతారు. నీ సేఫ్టీ నాకు ముఖ్యమని ఎవ్వరినీ బ్లైండ్‌ గా నమ్మొద్దని జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోతాడు. ఇంతలో జ్యోతి జెండేకు ఫోన్‌ చేస్తుంది. యాదగిరి ఊరి వదిలి వెళ్లిపోదామంటున్నాడు అని చెప్తుంది. దీంతో జెండే నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్తాడు. మరోవైపు గౌరి వాళ్ల ఇంటికి ఆర్యవర్ధన్‌ కంపెనీ ప్రతినిధులు వచ్చి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్ చేసి జాయినింగ్‌ తేదీ చెప్పి వెళ్లిపోతారు. యాదగిరి ఇంటికి వచ్చిన జెండే యాదగిరిని తిట్టి.. అభయ్‌ మీద రాకేష్‌ ప్రభావం పడింది అందుకే అలా మాట్లాడాడు అంటూ రవి అసలు తప్పే చేయలేదు. తన లిమిట్స్‌ లో ఉన్నాడు అని చెప్తాడు. రవి బాధ్యత గురించి జ్యోతి చెప్పగానే యాదగిరి ఏడుస్తుంటాడు.  దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  



ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!