విశాఖలో జరిగిన 'మట్కా' ప్రీ రిలీజ్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)కు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) ఇన్ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చారని అనుకోవాలి. అసలు వరుణ్ ఏమన్నారు? అది బన్నీకి కౌంటర్ అని ఎందుకు అనుకోవాలి? వంటి వివరాల్లోకి వెళితే...
నీ సక్సెస్ దేనికీ పనికి రాదు - వరుణ్ తేజ్
Varun Tej Speech In Matka pre release event: ''జీవితంలో నువ్వు పెద్దోడు అవ్వొచ్చు, అవ్వకపోవచ్చు. కానీ... నువ్వు ఎక్కడ నుంచి మొదలు పెట్టావ్? ఎక్కడ నుంచి వచ్చావ్? నీ వెనుకాల ఉన్న సపోర్ట్ ఎవరు? అనేది మర్చిపోతే నీ సక్సెస్ దేనికీ పనికి రాదు'' - ఇదీ వరుణ్ తేజ్ స్పీచ్‌లో కొంత పార్ట్. ఇది బన్నీకి కౌంటర్ అనేది ఇండస్ట్రీ ఆఫ్ ది రికార్డ్ టాక్.
ఏపీలో ఎన్నికలకు ముందు, జనసేన పార్టీ అఖండ విజయానికి ముందు అల్లు అర్జున్ నంద్యాల వెళ్లారు. పవన్ కల్యాణ్ తరఫున ఎక్కడా ప్రచారం చేయని ఆయన, తన స్నేహితుడు కోసం అంటూ శిల్పా రవి ఇంటికి వెళ్లడం మెగా ఫ్యాన్స్ అందరికీ ఆగ్రహం తెప్పించింది. ఆ తర్వాత 'మారుతి నగర్ సుబ్రమణ్యం' ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో మరోసారి ఆ ఇష్యూ గురించి పరోక్షంగా మాట్లాడారు బన్నీ. తనకు ఇష్టమైతే వెళ్తా, వస్తానంటూ చెప్పారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ''నువ్ ఎక్కడ నుంచి వచ్చావ్? నీ సపోర్ట్ ఎవరు? అనేది మర్చిపోతే నీ సక్సెస్ పనికి రాదు'' అని వరుణ్ తేజ్ కౌంటర్ ఇచ్చారని జనాలు భావిస్తున్నారు.
''ఎంతసేపూ మీ వాళ్ళు మాట్లాడతావని అంటున్నారని, అయ్యా... నేను మా పెదనాన్న చిరంజీవి, బాబాయ్ పవన్ కళ్యాణ్, మా అన్నయ్య రామ్ చరణ్, తండ్రి నాగబాబు గురించి మాట్లాడతా. అది నా ఇష్టం'' అని వరుణ్ తేజ్ చెప్పారు. ఆ తర్వాత సక్సెస్ డైలాగ్ కొట్టారు. తన పెదనాన్న, బాబాయ్, తండ్రి, అన్నయ్య ఎప్ప్పుడూ తనకు సపోర్ట్ చేస్తున్నారని, వాళ్ళందరూ తన మనసులో ఉంటారని వరుణ్ తేజ్ తెలిపారు. వరుణ్ తేజ్ తన స్పీచ్‌లో అల్లు అర్జున్ పేరు గానీ, 'పుష్ప 2'ను గానీ ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ, బన్నీకి కౌంటర్ అని జనాలు ఫీల్ అవుతున్నారు.
Also Read: గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్... బ్యాక్ స్టేజ్‌లో ఏం జరిగింది? ప్రోగ్రాం హైలైట్స్ ఏంటో తెలుసా?
ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మెగా కుటుంబంలో చీలిక ఏర్పడిందా? మెగాస్టార్ చిరంజీవి నీడ నుంచి బయటకు వచ్చి తనకు తానుగా సొంతంగా ఎదగాలని అల్లు అర్జున్ ప్రయత్నం చేస్తున్నారా? ఆ ప్రయాణంలో ఆయన వేసిన అడుగులు మెగా వారసులకు కోపం తెప్పించాయా? అంటే... స్పష్టమైన సమాధానం బయట జనాలు ఇవ్వలేరు. కానీ, ఒక్కొక్కరూ ఒక్కో వేదికపై ఇస్తున్న స్టేట్మెంట్లు చూస్తుంటే... వాళ్ళ మధ్య దూరం ఉందనేది స్పష్టంగా ఉందనేది అర్థం అవుతోందని అటు ఇండస్ట్రీ జనాలు, ఇటు ఆడియన్స్ బలంగా నమ్ముతున్నారు.
Also Read: కంగువలో సూర్య ఫైట్స్... ఏనుగు దంతాలతో కుమ్మేసి, పాము బాణాలతో కాటేసి... రెప్ప వేయకుండా చూడాలంతే