కోలీవుడ్ కథానాయకుడు, తెలుగు ప్రేక్షకులకు సైతం తెలిసిన స్టార్ హీరో సూర్య (Suriya) నటించిన ప్రతిష్ఠాత్మక పీరియాడిక ఫాంటసీ యాక్షన్ డ్రామా 'కంగువ' (Kanguva). శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలపై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మించారు. ఇవాళ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. 


'కంగువ' రిలీజ్ ట్రైలర్ ఎలా ఉందంటే?
Watch Kanguva Release Trailer: నవంబర్ 14... అంటే ఈ గురువారం 'కంగువ' వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ అవుతోంది. సినిమా విడుదలకు సరిగ్గా నాలుగు రోజుల ముందు రిలీజ్ ట్రైలర్ తీసుకొచ్చారు.



కంగువ కథ ఏమిటి? అనేది ప్రేక్షకులకు తెలియదు. కానీ, ఈ సినిమాలో సూర్య డబుల్ రోల్ చేశారని తెలుసు. 'మగధీర' తరహాలో ఒక సూర్య యోధుడిగా, మరొక సూర్య ఈతరం యువకుడిగా కనిపించనున్నారు. బానిసత్వానికి వ్యతిరేకంగా వందల ఏళ్ల క్రితం సూర్య పోరాటం చేయగా... ఈతరం సూర్య ఏం చేశాడు? అనేది సస్పెన్స్. ఇద్దరు సూర్యుల మధ్య కనెక్షన్ కూడా! ఇవాళ విడుదల చేసిన ట్రైలర్ కథ, క్యారెక్టర్ల మీద కొంత వరకు క్లారిటీ ఇచ్చింది. నిజం చెప్పాలంటే... అంచనాలు మరింత పెంచింది. రిలీజ్ ట్రైలర్ చూస్తే హిట్టు కళ కనబడుతోందని చెప్పవచ్చు.


Also Read: కంగువలో సూర్య ఫైట్స్... ఏనుగు దంతాలతో కుమ్మేసి, పాము బాణాలతో కాటేసి... రెప్ప వేయకుండా చూడాలంతే






'కంగువ' మీద సూర్య అండ్ శివ చాలా ఆశలు పెట్టుకున్నారు. తమిళ చిత్రసీమకు 'బాహుబలి' రేంజ్ సినిమా అవుతుందని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల టాక్. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమాతో ఎప్పుడో పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వాల్సిన తాను, ఇప్పటికే ఆలస్యం చేశాననే ఫీలింగ్ లో సూర్య ఉన్నారు. 'కంగువ'లో బాబీ డియోల్, దిశా పటాని ఉండటంతో నార్త్ ఇండియాలోనూ మూవీ మీద మంచి క్రేజ్ నెలకొంది. పైగా, పీరియాడిక్ & ఫాంటసీ ఫిలిమ్స్ అంటే ఉత్తరాది ప్రేక్షకులు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. సో, సూర్య పాన్ ఇండియా హిట్ కొట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.   


Also Read: గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్... బ్యాక్ స్టేజ్‌లో ఏం జరిగింది? ప్రోగ్రాం హైలైట్స్ ఏంటో తెలుసా?



Kanguva Movie Cast And Crew: సూర్య, దిశా పటాని జంటగా నటించిన ఈ సినిమాలో బాబీ డియోల్, యోగి బాబు, రిడిన్ కింగ్ స్లే, కోవై సరళ, నటరాజన్ సుబ్రమణియం, కె.ఎస్. రవికుమార్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కూర్పు: నిషాద్ యూసుఫ్ (ఇటీవల మరణించారు), ఛాయాగ్రహణం: వెట్రి పళనిస్వామి, యాక్షన్: సుప్రీమ్ సుందర్, కథ: శివ - ఆది నారాయణ, సహ నిర్మాత: నేహా జ్ఞానవేల్ రాజా, నిర్మాతలు: కేఈ జ్ఞానవేల్ రాజా - వంశీ - ప్రమోద్, దర్శకత్వం: శివ.