Weather Update: బంగాళాఖాతం(Bay Of Bengal)లో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడినప్పటికీ తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపుతోంది. శ్రీలంక వైపుగా వెళ్లిన ఈ అల్పపీడనం పూర్తిగా బలహీనపడిపోయింది. అయినా తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు(Rain Alert) పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే రెండు రోజుల నుంచి పలు జిల్లాల్లో వర్షాలు కుమ్మేస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం (Andhra Pradesh Latest Weather )
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింతగా బలహీన పడింది. అయినా 15, 16 తేదీల్లో ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. కృష్ణ, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, సత్యసాయి జిల్లా, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వానలు పడే అవకాశం ఉంది. అల్లూరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్‌ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో సాధారణ వర్షాలు పడతాయని అధికారులు చెప్పారు.
నైరుతితోపాటు దానికి ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైన బలహీనపడింది. వర్షాల నేపథ్యంలో వరికోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. రైతులు పంట పొలాల్లో నిలిచిన అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లో స్టోర్ చేయాలని తెలిపారు.
తెలంగాణలో వాతావరణం(Telangana Latest Weather )
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలంగాణపై కూడా ప్రభావం చూపుతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులు కూడా ఇలాంట వాతావరణమే ఉంటోందని అంటున్నారు. తెలంగాణలో ఉదయం ఉక్కపోత ఉంటే సాయంత్రానికి చలి పెడుతోంది. ఉదయాన్నే విపరీతమైన పొగమంచు జనాలను ఇబ్బంది పెడుతోంది. చిత్రమైన వాతావరణంతో సమస్యలు ఎదుర్కొంటున్నారు.
రాబోయే మూడు రోజుల పాటు తెలంగాణలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ బులెటిన్ రిలీజ్ చేసింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల లోపు నమోదు కావచ్చని బులెటిన్‌లో అధికారులు పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో వాతావరణం చూస్తే... (Hyderabad Latest Weather )
ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు ఉంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో నగరంలోని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం లేదా చినుకులు పడతాయని అధికారులు వెల్లడించారు. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 31డిగ్రీలు 22 డిగ్రీలు ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు తూర్పు / ఆగ్నేయ దిశలో గంటకు 2 నుంచి 6 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది. గురువారం నమోదు అయిన గరిష్ట ఉష్ణోగ్రత 30.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత 23.2 డిగ్రీలు..
చెన్నై, బెంగళూరులో వాతావరణం (Chennai and Bengaluru Latest Weather )
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తమిళనాడు, కేరళలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, లక్షద్వీప్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కొంకణ్, గోవా, దక్షిణ మధ్య మహారాష్ట్రలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఢిల్లీ సహా దేశ్యాప్తంగా వాతావరణం (Delhi Latest Weather )
దేశవ్యాప్తంగా కూడా వాతావరణం మారుతోంది. ఢిల్లీ NCR సహా అనేక రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు కమ్మేసింది. పొగమంచుతో పాటు కాలుష్యంతో ఢిల్లీలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలో గాలి నాణ్యత రోజు రోజుకు క్షీణిస్తోంది. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. నవంబర్ 20 నాటికి ఢిల్లీలో తీవ్రమైన చలి మొదలవుతుంది.
ఉత్తర భారతం మొత్తం దట్టమైన పొగమంచు కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పంజాబ్, హర్యానా, చండీగఢ్, పశ్చిమ రాజస్థాన్‌లో దట్టమైన పొగమంచు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, జార్ఖండ్‌లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
Also Read: ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళు ప్రారంభం, రైతుల సమస్యలపై గ్రౌండ్ రిపోర్ట్