Horoscope Today November 15, 2024: కార్తీక పౌర్ణమి రాశిఫలాలు - చంద్రుడిని మనఃకారకుడు అంటారు. చంద్రుడి ప్రభావం బావుంటే దీర్ఘకాల అనారోగ్యాలు తగ్గుతాయి, ఆనందంగా ఉంటారు. చంద్రుడి ప్రభావం మీ రాశిపై ప్రతికూలంగా ఉంటే మానసిక సమస్యలు, గందరగోళం తప్పదు...


మేష రాశి


ఈ రోజు మీరు అనుభవజ్ఞులైన వ్యక్తుల నుంచి మార్గదర్శకత్వం పొందుతారు. ఈ రాశి స్త్రీలకు అనుకూలమైన రోజు. ప్రణాళిక ప్రకారం చేసే పనులన్నీ    విజయవంతం అవుతాయి.మీరు విదేశీ పర్యటనల నుంచి ప్రయోజనం పొందుతారు. 


వృషభ రాశి


వ్యాపారంలో ఒక ముఖ్యమైన ఒప్పందం ఉండవచ్చు. కొన్ని సంఘటనల గురించి సెన్సిటివ్‌గా ఆలోచిస్తారు. ఆదాయం ,  వ్యయాల మధ్య సమతుల్యతను కాపాడుకోండి. పొట్టకు సంబంధించిన ఇబ్బందులుంటాయి. మనసులో ఏదో తెలియని భయం ఉంటుంది. 


మిథున రాశి


ఈ రోజు మీరు మీ పనితో పూర్తిగా సంతృప్తి చెందుతారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ప్రేమించిన జంటలు వివాహానికి సన్నాహాలు చేసుకోవచ్చు.   ముఖ్యమైన సమావేశానికి హాజరు కావలసి రావచ్చు. ఫైనాన్స్‌కు సంబంధించి నిలిచిపోయిన పనులు ప్రారంభం అవుతాయి. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి


Also Read: కార్తీక పౌర్ణమి సందర్భంగా మీ బంధుమిత్రులకు ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి


కర్కాటక రాశి


ఈ రోజు మీరు మీ జీవనశైలి కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు. మీ సలహాల వల్ల మీ సన్నిహితులు ఎంతో ప్రయోజనం పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. మీ ఆలోచనలను మీ జీవిత భాగస్వామితో పంచుకుంటారు. రోజువారీ దినచర్య సమతుల్యంగా ఉంటుంది. వ్యాధిగ్రస్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.


సింహ రాశి


ఈ రోజు విద్యార్థులు విద్యలో అద్భుతమైన ఫలితాలను పొందుతారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.  మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ వ్యక్తిత్వం మీకు తెలియనంతగా మెరుగుపడుతుంది. పెద్దల ఆశీస్సులు తీసుకోండి. 


కన్యా రాశి


కొత్తగా పరిచయం అయిన వ్యక్తులను తొందరగా నమ్మవద్దు. రోజంతా బిజీగా గడుస్తుంది. ఉద్యోగులు పనిలో సహోద్యోగుల ప్రవర్తన కారణంగా కలత చెందుతారు. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. ఇంట్లో అనుకోని ఖర్చులు పెరుగుతాయి.  వైవాహిక సంబంధాలలో సమస్యలు ఉండవచ్చు.


Also Read: కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు ఏ సమయంలో వెలిగించాలి , ఎక్కడ వెలిగిస్తే మంచిది!


తులా రాశి


ఈ  రోజు మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఓ శుభవార్త వింటారు. స్నేహితులు, సన్నిహితుల నుంచి అవసరమైన సమయంలో సహకారం అందుతుంది. మార్కెటింగ్ సంబంధిత కార్యకలాపాల వల్ల లాభాలు ఉంటాయి. విదేశీ వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది.


వృశ్చిక రాశి


ఈ రోజు మీరు చేపట్టే పనులేవీ సఫలం కావు. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులను కలుస్తారు. కార్యాలయంలో బిజీ బిజీగా ఉంటారు. మీ సామర్థ్యానికి మించి పనిచేయవద్దు. బంగారు, వెండి ఆభరణాల వ్యాపారంలో ఆర్థిక లాభం ఉంటుంది. ఇంటికి సంబంధించిన విషయాలపై ఇతరుల నుంచి సలహాలు తీసుకోవద్దు.


ధనస్సు రాశి


ఈ రోజు మీరు మీ పిల్లల పురోగతితో సంతోషంగా ఉంటారు. వివాహం చేసుకోవాలి అనుకున్నవారికి ప్రతిపాదనలు అందుతాయి.  ఉద్యోగం మారాలని ఆలోచిస్తే మీ ప్రయత్నం సఫలం అవుతుంది. అన్ని పత్రాలను జాగ్రత్తగా చదవండి. మీరు కొన్ని విషయాలలో గందరగోళానికి గురవుతారు. 


మకర రాశి
 
ఈ రోజు మీరు మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. పూర్వీకుల నుంచి కొనసాగుతున్న వ్యాపారంలో మాంద్యం ఉంటుంది. భాగస్వామ్యానికి సంబంధించిన పనిలో పారదర్శకత ఉండేలా చూసుకోండి. వెంటనే ఎవరినీ నమ్మవద్దు. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకండి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి


Also Read: కార్తీక పౌర్ణమి రోజు జ్వాలా తోరణం ఎందుకు దాటాలి.. విశిష్టత ఏంటి.. కాలిన గడ్డి తీసుకొచ్చి ఏం చేయాలి!


కుంభ రాశి 


ఈ రోజు విద్యార్థులు చదువులో అద్భుతమైన ఫలితాలు పొందుతారు. చిన్న వ్యాపారులకు ఈరోజు చాలా మంచి రోజు. మీ ఆదాయం పెరుగుతుంది. ప్రేమ సంబంధాలలో సాన్నిహిత్యం పెరుగుతుంది. జర్నలిజం రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు మంచి రోజు అవుతుంది. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. 


మీన రాశి 


ఈ రోజు మీరు ప్రతికూల వార్తలు వినాల్సి రావొచ్చు. పనికిరాని పనులలో సమయం వృధా అవుతుంది. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మనసులో ప్రతికూల ఆలోచనలు వస్తాయి. అడగకుండా ఎవరికీ సలహాలు ఇవ్వొద్దు.  


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 


Also Read: కార్తీక పౌర్ణమి ఈ ఏడాది (2024) ఎప్పుడొచ్చింది - ఈ రోజు విశిష్టత ఏంటి!