Kartik Purnima 2024 Date And Timing: కార్తీకమాసం ప్రారంభమయింది. భక్తుల పుణ్యస్నానాలతో నదులు కళకళలాడిపోతున్నాయి. శివాలయాలన్నీ పంచాక్షరి మంత్రంతో మారుమోగుతున్నాయి. కార్తీకమాసంలో ప్రతి రోజూ ప్రత్యేకమే అయినా..అత్యంత ముఖ్యమైన రోజుల్లో కార్తీక పౌర్ణమి ఒకటి. ఈ ఏడాది కార్తీక పౌర్ణమి నవంబరు 15 శుక్రవారం వచ్చింది. ఈరోజు సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకూ పౌర్ణమి ఘడియలున్నాయి. అందుకే పున్నమి నోములు నోచేవారు, పౌర్ణమి ఉపవాసం ఉండేవారు అందరూ..నవంబరు 15న కార్తీక పౌర్ణమి సెలబ్రేట్ చేసుకోవాలి...
Also Read: కార్తీకమాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!
కార్తీక పౌర్ణమి రోజు చేయాల్సిన అతిముఖ్యమైన పని దీపం వెలిగించడం..కార్తీకం ఆరంభం నుంచి దీపం వెలిగించనివారు, అసలు ఏడాది మొత్తం దేవుడి వైపు కన్నెత్తి చూడని భక్తులు ఈ రోజు 365 వత్తులు వెలిగిస్తారు. ఇలా చేస్తే ఏడాదంతా దీపారాధన చేసిన పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
కార్తీక పౌర్ణమి రోజు తెల్లవారుజామునే స్నానమాచరించాలి. నది, సముద్రం, కొలను, చెరువు, బావులు, చేతి పంపు...ఇలా అందుబాటులో ఉన్న నీటివనరులలో స్నానమాచరించవచ్చు. స్నానమాచరించేటప్పుడు ఈ శ్లోకం పఠించండి
శ్లోకం
|| గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలే……స్మిన్ సన్నిధింకురు||
ఈ మాసం శివకేశవులకు ప్రతీకరం కావడంతో శైవ, వైష్ణవ ఆలయాల్లో దీపాలు వెలిగిస్తారు. ఈ రోజు సాయంత్రం శివాలయంలో జరిగే జ్వాలాతోరణంని దర్శించుకుంటారు.
కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండేవారు రోజంతా ఉపవాస నియమాలు పాటించి, ఇంట్లో - దేవాలయంలో దీపారాధన చేసి...సూర్యాస్తమయం తర్వాత పండ్లు, దేవుడి ప్రసాదం స్వీకరిస్తారు. మర్నాడు ఉదయం దైవారాధన అనంతరం ఉపవాసం విరమిస్తారు.
Also Read: కార్తీక పూర్ణిమ ఎందుకు ప్రత్యేకం - ఈ రోజు దంపతులు సరిగంగ స్నానాలు చేస్తే
హిందువులు అత్యంత పవిత్రంగా భావింటే కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమి.. స్నానం, దానం, జపాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజు గంగానదిలో స్నానమాచరించడం ద్వారా నెలమొత్తం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. కొన్ని ప్రాంతాల్లో దీనినే దేవ్ దీపావళి అంటారు. ఈ రోజు దేవతలంతా భువికి దిగివచ్చి గంగాస్నానం ఆచరిస్తారని చెబుతారు. అందుకే ఈ రోజు నదీ స్నానం ఆచరించి దీపాలు నీటిలో విడిచిపెడితే...గతజన్మ, ఈ జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతారు. ఈ రోజునే త్రిపురారి పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజు శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని ఓడించిన రోజు. అందుకే త్రిపురారి పూర్ణిమ అని కూడా పిలుస్తారు.
కార్తీక మాసములో వచ్చే పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైనదిగా చెబుతున్నాయి పురాణాలు. ఈ రోజు శివాలయాల్లో అయినా, ఇంట్లో అయినా రుద్రాభిషేకం జరుపుకుంటే ఆ ఇంట సిరిసంపదలు కలుగుతాయంటారు. మహన్యాసక పూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకం జరిపింస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ఇదే రోజు కేదారేశ్వర వ్రతం చేసినా అత్యత్తమ ఫలితాలు పొందాతారు. ఈ రోజు దాన ధర్మాల్లో భాగంగా కార్తీక పురాణ పుస్తకాలు అందజేస్తారు...
Also Read: కార్తీక సోమవారం వ్రతవిధి 6 రకాలు, మీరు అనుసరించేది ఏది!