Kanguva Day 1 Collection: కంగువ ఫస్ట్ డే కలెక్షన్స్... టార్గెట్ రీచ్ అయ్యిందా? సూర్యకు పాన్ ఇండియా సక్సెస్ వచ్చిందా?

Kanguva First Day Collection: సూర్యకు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 'కంగువ'తో ఆయన పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీకి ఫస్ట్ డే కలెక్షన్ ఎంతో తెలుసా?

Continues below advertisement

Suriya's Kanguva first day worldwide collection: కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు ఏపీ, తెలంగాణ (టాలీవుడ్) మార్కెట్లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. నార్త్ ఇండియాలో ఆడియన్స్‌కు కూడా ఆయన తెలుసు. అయితే, 'కంగువ'తో సూర్య పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చారు. మరి, ఈ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? సినిమాకు ఫస్ట్ డే ఎన్ని కోట్ల కలెక్షన్స్ వచ్చాయి? అనేది చూస్తే...

Continues below advertisement

కంగువ ఫస్ట్ డే గ్రాస్ @ 40 కోట్లు
Kanguva box office collection worldwide day 1: 'కంగువ'కు మొదటి రోజు మంచి ఓపెనింగ్ లభించింది. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూస్తే... 40 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు ఎర్లీ రిపోర్ట్స్ చెబుతున్నాయి. నెట్ కలెక్షన్ విషయానికి వస్తే... రూ. 22 కోట్లు అని టాక్. మరి, ప్రొడక్షన్ హౌస్ స్టూడియో గ్రీన్ అఫీషియల్ నంబర్ ఎంత రిలీజ్ చేస్తుందో చూడాలి.

ఏపీ, తెలంగాణ... తెలుగు రాష్ట్రాల్లో 'కంగువ' ఫస్ట్ డే గ్రాస్ రూ. 6 కోట్లు అని ట్రేడ్ టాక్. తమిళనాడులో ఈ సినిమాకు అదిరిపోయే ఓపెనింగ్ లభించింది. అక్కడ 37 పర్సెంట్ ఆక్యుపెన్సీలో 20 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిందట. హిందీ డబ్బింగ్ వెర్షన్ కలెక్షన్లు అటు ఇటుగా రూ. 3.5 కోట్లు అని తెలుస్తోంది. ఓవర్సీస్ నుంచి కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి.

పాన్ ఇండియా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న సూర్యకు 'కంగువ'తో మంచి ఓపెనింగ్ లభించిందని చెప్పవచ్చు. అయితే, మూవీకి మిక్స్డ్ రివ్యూలు రావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ తర్వాత ఎలా వుంటుందో చూడాలి. ప్రజెంట్ అయితే అడ్వాన్స్ బుకింగ్స్ బావున్నాయి.

Also Readకంగువ రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ఉందా? - కోలీవుడ్ స్టార్ హిట్ కొట్టారా?


దర్శకుడు శివ మీద ఫ్యాన్స్ ఫైర్! తప్పు ఆయనదే?
కేరళలో 'కంగువ' ఎర్లీ మార్నింగ్ షోస్ నాలుగు గంటలకు ప్లాన్ చేశారు. అయితే, ఆ టైంకి మూవీ స్టార్ట్ కాలేదు. గంట ఆలస్యంగా మొదలైంది. ఏపీ, తెలంగాణలో ఫస్ట్ డే ఉదయం నాలుగు గంటలకు షోస్ వేయాలని ప్లాన్ చేసినా సరే కుదరలేదు. ఇక, సూర్య హోమ్ గ్రౌండ్ తమిళనాడులో తొమ్మిది గంటలకు షోస్ స్టార్ట్ అయ్యాయి.

Also Read: వరుణ్ తేజ్‌కు మరో షాక్... 'మట్కా' ఫస్ట్ డే కలెక్షన్స్ అంతేనా?

ఫ్యాన్స్ నుంచి 'కంగువ'కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అది కూడా ఒక్క సూర్య విషయంలో! రెండు క్యారెక్టర్లలో సూర్య నటన అద్భుతం అని చెబుతున్నారు. కంగువ పాత్రలో ఇరగదీశాడని అంటున్నారు. అయితే, దర్శకుడు శివ మీద మాత్రం ఫైర్ అవుతున్నారు. ఆయన సరిగా సినిమా తీయలేదని చెబుతున్నారు. శివపై ఫైర్ అవుతున్నారు. 'కంగువ' సినిమాలో సూర్య సరసన బాలీవుడ్ అందాల భామ దిశా పటానీ యాక్ట్ చేసింది. ఓ సన్నివేశంలో బికినీలోనూ సందడి చేసి గ్లామర్ ఒలకబోసింది. ఇక, బాబీ డియోల్ ఈ మూవీతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.

Also Readమట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?

Continues below advertisement