'ప్రేమలు'... కేవలం మూడు కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో తెరకెక్కిన చిన్న మలయాళ సినిమా. అయితే... బాక్సాఫీస్ బరిలో అది మేజిక్ చేసింది. వంద కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. తెలుగులోనూ ఆ సినిమా భారీ విజయం సాధించింది. అందులో హీరో ఎవరో గుర్తు ఉన్నారు కదా! నస్లీన్ కె గఫూర్ (Naslen K Gafoor). 'ప్రేమలు' తర్వాత ఆ హీరో చేసిన సినిమా 'అ యామ్ కాథలన్'. ఆ మూవీ ఏ ఓటీటీలో, ఎప్పుడు విడుదల అవుతుందో తెలుసా?
మలయాళంలో పాపులర్ ఓటీటీ చేతికి 'అ యామ్ కాథలన్'
I Am Kathalan movie OTT release date and time: ప్రేమలు' తర్వాత ఆ సినిమా హీరో నస్లీన్ కె గఫూర్, దర్శకుడు గిరీష్ ఏడీ కలయికలో వచ్చిన సినిమా 'అ యామ్ కాథలన్'. నవంబర్ 7న థియేటర్లలో విడుదల అయ్యింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి రావడానికి రెడీ అయ్యింది.
మలయాళంలో పాపులర్ ఓటీటీ వేదిక మనోరమ మ్యాక్స్. అందులో జనవరి 17వ తేదీ నుంచి 'అ యామ్ కాథలన్' స్ట్రీమింగ్ కానుంది.
'అ యామ్ కాథలన్' కథ ఏమిటి? హీరో రోల్ ఏంటి?
టెక్నో థ్రిల్లర్ జానర్‌లో రూపొందిన సినిమా 'అ యామ్ కాథలన్'. ఇందులో విష్ణు పాత్రలో నస్లీన్ కె గఫూర్ నటించారు. అతనికి బ్యాక్ లాగ్స్ ఎక్కువ ఉండటం వల్ల జాబ్ రాదు. గాళ్ ఫ్రెండ్ కూడా వదిలేసి వెళ్లాలని డిసైడ్ అవుతుంది. తన తండ్రితో మాట్లాడిన తర్వాత హీరోని అవమానిస్తుంది. తనకు జరిగిన దాని పట్ల ప్రతీకారం తీర్చుకోవాలని తన సైబర్ స్కిల్స్ ఉపయోగించి చిట్ ఫండ్ కంపెనీని టార్గెట్ చేస్తాడు. హీరో దారికి ఎథికల్ హ్యాకర్ అడ్డు తగిలిన తర్వాత ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
Also Read: నేనూ హిందువువే... నన్ను క్షమించండి - రామ లక్ష్మణులపై కామెంట్స్ చేసి సారీ చెప్పిన శ్రీముఖి
'అ యామ్ కాథలన్' సినిమాలో లిజోమోల్ జోస్ హీరోయిన్. రీసెంట్ మలయాళం బ్లాక్ బస్టర్ 'రైఫిల్ క్లబ్' యాక్టర్ దిలీప్ పోతన్ కీలక పాత్రలో నటించారు.