కని కుశ్రుతి, దివ్య ప్రభ, ఛాయా కదమ్, హృదు ఆరోన్, అజీస్ నెడుమంగడ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్'. పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన ఈ సినిమా ముంబైలోని ఇద్దరు మలయాళీ నర్సుల కథతో తెరకెక్కింది. గోల్డెన్ గ్లోబ్ వరకూ వెళ్లిన చిత్రమిది. అవార్డు కొద్దిలో మిస్ అయ్యింది. చాలా కాలం తరువాత కేన్స్ వంటి ఫిల్మ్ ఫెస్టివల్ లో సత్తా చాటిన ఇండియన్ ఫిల్మ్ గా పేరు తెచ్చుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ ఈ మూవీ ఓటీటీ వెర్షన్ లో కొన్ని సీన్స్ ను కట్ చేశారని తెలుస్తోంది. 


ఓటీటీ వెర్షన్ లో మార్పులు చేర్పులు 


అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు అందుకున్న 'ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్' మూవీ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. జనవరి 3 నుంచి ఈ మూవీ ఓటీటీలో అందుబాటులో ఉంది. "ఫెస్టివల్ డి కేన్స్ గ్రాండ్ ప్రిక్స్ విజేత 2024, 2 గ్లోబ్ నామినేషన్లతో పాయల్ కపాడియా 'ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్' మూవీని జనవరి 3 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం చేయబోతున్నాము. డోంట్ మిస్" అంటూ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ మూవీ స్ట్రీమింగ్ మొదలుపెట్టింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలోని పలు సన్నివేశాలను మేకర్స్ కట్ చేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఆల్కహాల్, సిగరెట్ వంటివి వచ్చినప్పుడు డిస్క్లైమర్ వేశారు. అలాగే 30 సెకండ్ల నిడివి ఉన్న సీన్స్ ని ట్రిమ్ చేశారని తెలుస్తోంది. అవేమీ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు కానప్పటికీ, ఓటీటీ రూల్స్ లో భాగంగా ఓ న్యూడ్ సీన్ ను కట్ చేశారట. అయితే ఈ సన్నివేశాలకు సీబీఎఫ్సీ అడ్డుకట్ట వేయలేదు. కానీ ఓటీటీ ప్లాట్ఫామ్ సీన్స్ ను ట్రిమ్ చేయడం గమనారహం. నిజానికి ఓటీటీలు ఇలాంటి సన్నివేశాలకు చాలా అరుదుగా అభ్యంతరాలు తెలుపుతాయి. కానీ స్టాండర్డ్స్ అండ్ ప్రాక్టీస్ రూల్ లో భాగంగా కొన్నిసార్లు ఇలా కంటెంట్ ని ట్రిమ్ చేసి రిలీజ్ చేస్తారు. తాజాగా 'ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్' ఓటీటీ వెర్షన్ లో కూడా ఇదే జరిగిందని అంటున్నారు. ఈ సినిమాను తెలుగులో రానా రిలీజ్ చేయగా, ఇంటర్నేషనల్ వైడ్ గా చరిత్ర సృష్టించిన 'ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్' సినిమా థియేటర్లలో ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయింది.


Also Read: బుల్లితెరపై ప్రదీప్ రీ ఎంట్రీ... వెంకీ మామతో 'బ్రహ్మముడి' కావ్య కామెడీ... సంక్రాంతి వేడుక కోసం


గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో నిరాశ
30 ఏళ్లలో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు నామినేట్ అయిన తొలి భారతీయ చిత్రంగా 'ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్' చరిత్ర సృష్టించింది. ఇది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో గ్రాండ్ ప్రిక్స్ అవార్డును అందుకుంది. పాయల్ కపాడియా 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' ఇటీవల రెండు గోల్డెన్ గ్లోబ్ నామినేషన్లలో కూడా సెలెక్ట్ అయ్యింది. ఈ చిత్రం బెస్ట్‌ నాన్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ మోషన్‌ పిక్చర్‌, బెస్ట్‌ డైరెక్టర్‌ కేటగిరీల్లో నామినేషన్లను అందుకుంది. ఆసియాలోనే ఈ ఘనత సాధించిన మూడో మహిళా దర్శకురాలిగా పాయల్ గుర్తింపు పొందింది. అయితే ఈ చిత్రానికి రెండు విభాగాల్లోనూ నిరాశే ఎదురైంది.


Read Alsoఈటీవీలో కొత్త సీరియల్... 'ఝాన్సీ' టెలికాస్ట్ టైమింగ్ నుంచి యాక్టర్స్ వరకు - ఈ డీటెయిల్స్ తెలుసా?