అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. యాంకర్ నుంచి ఏకంగా పాన్ ఇండియా నటిగా ఎదిగిన ఈ బ్యూటీ పలు సినిమాలలో ప్రధాన పాత్రలు కూడా పోషిస్తోంది. రీసెంట్ గా 'పుష్ప 2'లో ద్రాక్షాయని పాత్రలో అలరించిన ఈ అమ్మడు... గత ఏడాది 'రజాకార్' (Razakar) సినిమాలో లీడ్ రోల్ పోషించింది. ఈ సినిమా తాజాగా ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. అయితే 10 నెలల తర్వాత ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయడం విశేషం.


ఆహా ఓటీటీలోకి 'రజాకార్'


అనసూయ, బాబీ సింహ, ఇంద్రజ, వేదిక లాంటి నటీనటులు ప్రధాన పాత్రల్లో నటించిన హిస్టారికల్ యాక్షన్ డ్రామా 'రజాకార్ : సైలెంట్ జినోసైడ్ ఆఫ్ హైదరాబాద్'. యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ పై ఎట్టకేలకు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ సినిమా ద్వారా మేకర్స్ దేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనానికి ముందు జరిగిన రజాకార్ల ఆకృత్యాలను ప్రేక్షకుల కళ్ళ ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ మూవీ రిలీజ్ కి ముందే ఎన్నో వివాదాలను మూట కట్టుకుంది. అవన్నిటిని దాటుకొని థియేటర్లలో కూడా రిలీజ్ అయింది.


Razakar OTT Release Date: తాజాగా 'రజాకార్' ఓటీటీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ మేరకు సినిమా జనవరి 24న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోందని వెల్లడించారు. "చరిత్ర, ధైర్యం, ఎవరూ చెప్పని కథ... రజాకార్. ఈ సినిమా జనవరి 24 నుంచి ఆహా వీడియోలో ప్రీమియర్ కాబోతోంది" అనే ఆప్షన్ తో ఆహా వీడియో ఓటీటీ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. అందులో భాగంగా "వరల్డ్ డిజిటల్ ప్రీమియర్" అంటూ ఈ సినిమాను రిపబ్లిక్ డేకు రెండు రోజుల ముందు ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నాము అని వెల్లడించారు.






10 నెలల తర్వాత ఓటీటీలోకి...


అప్పట్లో జరిగిన నిజాం పాలనలో రజాకార్లు ఎలాంటి హింసలకు పాల్పడ్డారు? వాళ్ళు చేసిన దురాగతాలు ఏంటి? అనే యదార్థ సంఘటనల స్ఫూర్తితో యాటా సత్యనారాయణ 'రజాకార్' సినిమాను రూపొందించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన ఎంతోమంది యోధుల ఎమోషనల్ స్టోరీతో మూవీ నడుస్తుంది. ఈ మూవీ 2024 మార్చి 24న పలు వివాదాల మధ్య థియేటర్లోకి వచ్చింది. కానీ థియేటర్లలో ఈ సినిమాకు పెద్దగా ఆశించిన రెస్పాన్స్ దక్కలేదు. అయితే అప్పటి నుంచి ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా ? అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అనసూయ అభిమానులు. మధ్య మధ్యలో 'రజాకర్' మూవీ ఓటీటీ రిలీజ్ గురించి ఎన్నో రూమర్లు వచ్చాయి. కానీ ఎట్టకేలకు ఆహా వీడియో ఓటీటీ తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేసి ఆ పుకార్లన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టింది. అయితే సినిమా ఓటీటీలోకి రావడానికి ఏకంగా 10 నెలల టైం పట్టడం గమనార్హం.


Also Readరేసింగ్ సర్క్యూట్‌లో కోలీవుడ్ స్టార్ కారుకు ఘోర ప్రమాదం... స్వల్ప గాయాలతో బయటపడిన అజిత్